రూపాయికి శస్త్ర చికిత్స చేయాల్సిందే

రూపాయికి శస్త్ర చికిత్స చేయాల్సిందే


 


దిగుమతుల భారం తగ్గితేనే సత్ఫలితాలు ఆర్బిఐ చర్యల కోసం ఆర్థికవేత్తల చూపులు


రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం నాలుగేళ్ల క్రితం అంటే 2014 ఆగస్టు 14న డాలర్ కు 61.05 పైసలు కాగా గతేడాది అదే రోజున రూ. 69.76 కు దిగజారింది. ఇప్పుడు ఇది 72 రూపాయలకు చేరింది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు మరించుకు పోతున్నాయి. ఇదంతా కేవలం దిగుమతుల ప్రభావం అనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇదీ మోడీ సాధించిన ఆర్థిక ప్రగతి ఎలా ఉన్నారూపాయిని మాత్రం పట్టుకోలేక పోతున్నారు. నిజంగా రూపాయికి శస్త్రచికిత్స చేసే కార్యాక్రమాలు కానరావడం లేదు. మనవాళ్లను అమెరికా పంపించాలంటేనే భయం వెన్నాడుతోంది. చదువుకునేందుకు వెళ్లే పిల్లలకు రూపాయలను బస్తాల్లో పంపినా అక్కడ పిడికెడు డాలర్లు రావడం లేదని వాపోతున్నారు.


 



డెబ్భయ్యేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారిపోయి రూపాయి విలపిస్తుండగా, నిత్యావసరాల ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు ఎక్కడా ప్రధాని మోడీ ప్రసంగంలో కానరాలేదు. 1947లో రూపాయి విలువ డాలర్తో సమానం. అంటే ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో మనం బాగా అభివృద్ధి సాధించామని ఈ రకంగా పోల్చుకోవాలేమో.


డాలర్తో రూపాయి మారకం డెబ్భయ్యో వంతుకు చేరిపోయింది. అమెరికా, టర్కీల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో టర్కీ కరెన్సీ అయిన లిరా ఒడిదుడుకులకు గురికావడంతోనే ఇంతటి పెను మార్పులని అప్పట్లో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ సెలవిచ్చారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఉపద్రవం వచ్చినా మన రూపాయి తట్టుకుని నిలబడేంత బలంగా లేదు.


 



ఇంతటి బలహీనమైన రూపాయి ఎప్పుడు బలపడుతుందా అన్నదే అనుమానం. సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ద్రవ్యమారక రేట్లతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావిత మవుతోంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చమురు ధరలకు నిర్ణయాత్మకమవుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతోందని 2014 ఎన్నికలకు ముందు మోడీ కాంగ్రెసను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు.


ఇప్పుడు మోడీ ఆయుష్మాన్ | భారత్ ప్రకటించారు. అయితే రూపాయికి శస్త్రచికిత్స చేయకుండా దీనిని సాధించడం దుస్సాధ్యం. ఇది సాధిస్తే ప్రజలు ఎవరికి వారు ఆర్థికంగా ఎదగలరు. ఎవరి ఆరోగ్యం వారు చూసుకోగలరు. దివంగత ప్రధాని పివి నరసింహారావు మాత్రమే ఇలాంటి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన తీసుకున్న సాహసోపేత సంస్కరణలే ఇప్పటికీ మనకు రక్షగా నిలిచాయి.


 



ప్రధాని మోడీ ఇప్పుడు ఈ దిశగా దృష్టి సారించాలి. కఠిన పరిశ్రమ చేయాలి. ఎగుమతులు, దిగుమతులను విశ్లేషించాలి. తాము తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వడం లేదని గుర్తించి అందుకు కారణాలు విశ్లేషించాలి. చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెరిగిన చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి.


అంతేగాకుండా రూపాయి మారకవిలువ దిగజారిపోతోందని అంటున్నారు. పివి-మన్మోహన్ ద్వయం తెచ్చిన ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు ఆదేశిత . ఆర్థిక విధానాలనే వాజ్ పేయ్ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే మన్మోహన్ సర్కారు బాటలోనే మోడీ ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ఆ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నిజంగా మాత్రం కాదు.



 


రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగి. రూపాయిని నిలబెట్టాల్సి ఉందని చాలామంది సూచిస్తున్నారు. 80శాతం చమురు ఎలాగూ దిగుమతి చేసుకొనేదే కనుక, క్రూడాయిల్ ధర పెరిగి, దేశీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల రేట్లు మరింత హెచ్చి నిత్యావసర, వినియోగ వస్తువులు ఖరీదు కాక తప్పదు. ఇప్పటికే ఇరాన్ చమురు కూడా కాదనుకుంటున్నందున చమురు లభ్యత మరింత తగ్గి కొత్త కష్టాలు ఎదురు కావచ్చన్న ఆందోళనా ఉంది.


ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి ఆర్బిఐ కష్టాలు పడుతున్న తరుణంలోనే రూపాయి మరింతగా కృశించిపోతున్నది. రూపాయిని కాపాడటానికి రిజర్వుబ్యాంకు వద్ద అనేక మార్గాలు ఉండివుంటాయని, తగిన సమయంలో నిర్ణయాలు చేస్తుందని ఆర్థిక నిపుణులు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందన్నది అర్థంకాని ప్రశ్న.


 


రిజర్వుబ్యాంకు చర్యలు సామాన్యుడికి ఉపశమనం ఇవ్వలేని కాలం కూడా దాపురించవచ్చు. రూపాయి బలహీనతలను గుర్తించతగు శస్త్ర చికిత్సలకు దిగాలి. లేకుంటే ఆర్థిక ద్రవ్యోల్బణం,ధరల స్వారీ పెరగగలదు. .


Comments