పడకంటి మనసులో మాట ...
___________________________________________________________________________________
గత ఏడు దశాబ్దాల కాంగ్రెస్ తప్పిదాలను సరిదిద్దుతున్నామంటూ గత ఆరేళ్లుగా అదే మాట చెబుతున్నారు. ఇందుకు కారణమేమిటన్నది విశ్లేషకుల అభిప్రాయం మేరకు హిందుత్వపై ఉన్న నమ్మకమే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ మాది బరా బర్ హిందువుల పార్టీ అంటే గతం కంటే బలంగా చెడుతూ వస్తున్నది. అంటే మతం ప్రాతిపదికన ఓట్లు చీల్చగలిగితే...విధానాలేవైనా అధికారం పదిలం అన్న భావనతో ఆ పీర్ట ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామజపం ముందు విపక్షాల విమర్శలు పూర్వపక్షం అవుతాయని బీజీపీ, వెూడీ బలంగా నమ్ముతున్నాయని పిస్తున్నది.అందుకే రైతు ఉద్యమానికి సంబంధించి విదేశాల నుంచి ఏ స్పందన వచ్చినా కేంద్రం తీవ్రంగా స్పందిస్తోంది. దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నది హిందూ పార్టీ అనే విషయాన్ని వాళ్లు ఏ మాత్రం తగ్గకుండా చెప్పుకుంటున్నారు.
_________________________________________________________________________
రామజపమే బీజేపీ ట్రంప్ కార్డా
ప్రధాని నరేంద్ర వెూడీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా తన ఆర్థిక విధానాల విషయంలో కానీ, రైతు చట్టాల విషయంలో కానీ, విదేశాంగ విధానం, ముఖ్యంగాచైనాకు భారత బ భూభాగాన్ని అప్పగించింది కాంగ్రెస్ అన్న మాటలను కానీ వెనక్కు తీసుకోవడం లేదు. గత ఏడు దశాబ్దాల కాంగ్రెస్ తప్పిదాలను సరిదిద్దుతున్నామంటూ గత ఆరేళ్లుగా అదే మాట చెబుతున్నారు.
ఇందుకు కారణమేమిటన్నది విశ్లేషకుల అభిప్రాయం మేరకు హిందుత్వపై ఉన్న నమ్మకమే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ మాది బరా బర్ హిందువుల పార్టీ అంటే గతం కంటే బలంగా చెడుతూ వస్తున్నది. అంటే మతం ప్రాతిపదికన ఓట్లు చీల్చగలిగితే...విధానాలేవైనా అధికారం పదిలం అన్న భావనతో ఆ పీర్ట ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రామజపం ముందు విపక్షాల విమర్శలు పూర్వపక్షం అవుతాయని బీజీపీ, వెూడీ బలంగా నమ్ముతున్నాయని పిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే వెూడీ వాగ్థాటి, విమర్శల వర్షం ముందు విపక్షాల గొంతు ఇటీవలి కాలంలో రోజు రోజుకూ బలహీన పడుతూ వస్తున్నది.
ఈ ఆరేళ్లలో వెూడీ విదానాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడింది ఎవరైనా ఉన్నారంటే అది రైతులు మాత్రమే. అందుకే రైతు ఉద్యమానికి సంబంధించి విదేశాల నుంచి ఏ స్పందన వచ్చినా కేంద్రం తీవ్రంగా స్పందిస్తోంది. దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నది హిందూ పార్టీ అనే విషయాన్ని వాళ్లు ఏ మాత్రం తగ్గకుండా చెప్పుకుంటున్నారు.
మరి ముస్లింలు, క్రిస్టియన్ల పరిస్థితి
ఏంటి. మిగతా మతాల పరిస్థితి ఏంటి అంటే అది వేరే విషయం. దాని గురించి అడిగే వాళ్లు
లేరు. అడిగినా వాళ్లు లెక్క చేసే పొజిషన్ లో లేరు. అది అలా వదిలేద్దాం.
మాది హిందువుల పార్టీ అంటున్నారు.
సరే.. మిమ్మల్ని ఎవరూ కదిలించడం లేదు. కానీ.. మీకు హిందువులంటే ఓన్లీ రాముడేనా అనే క్వశ్చన్ వేస్తే ఏం చేస్తారు అంటే.. మరి ఏం సమాధానం చెబుతారో మరి. అది కూడా అలా వదిలేస్తే.. బీజేపీ ఎవ్వారం జనం అన్నట్లే ఉంటుంది.
కేవలం మతం మీదే బేస్ అయ్యి నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆ విషయం ఓపెన్ సీక్రెట్టే... కానీ.. కేవలం మతం తప్ప.. వేరే బలమే లేదా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. రాముడు.. హిందూ అనుకుంటూ లాగించడమేనా.. మేం ప్రజలకి మంచి చేశాం.. మంచి చేస్తున్నాం.. మంచి చేస్తాం అంటూ.. ఎక్కడా మాట్లాడరా అంటే ఏం చెబుతారో ఏవెూ.
ఎవరి పార్టీ స్టాండ్ వాళ్లకి ఉంటుంది. కానీ.. కేవలం రామ నామం..
హిందూ నామం. అంతేనా.. బీజేపీ అంటే ఇంకేం లేదా.. ఆ విషయం వారికైనా తెలియాలి కదా.
ఎందుకంటే.. అక్కడ వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల టైం. అక్కడికి వెళ్లిన
ప్రతి బీజేపీ లీడర్.. రామ నామం పట్టుకుంటున్నారు. మొన్న వెూడీ వచ్చిన టైంలో కూడా
మమతా బెనర్జీ ముందు ఇలాగే అంటే.. ఆమె హర్ట్ అయ్యి.. వెళ్లిపోయారు. తర్వాత వెూడీ
అదే స్టేట్ కి వెళ్తే.. నేను రానంటే రాను అన్నారు మమతా.
ఇక అమిత్ షా కూడా అంతే. మమతా బెనర్జీతో జై శ్రీరాం అనిపిస్తాం అంటున్నారు. అదేంటి సామీ.. జై శ్రీరాం అనిపించడంలో తప్పేం లేదు. కానీ.. ప్రజలకి మేలు చేపిస్తాం.. పథకాలు పెట్టిస్తాం అంటే.. ఇంకాస్త బావుంటుందేవెూ అనే సెటైర్లు.. సోషల్ మీడియాలో ఫుల్ గా పడుతున్నాయి.
ఇక తెలంగాణలో కూడా అంతే. షర్మిల పార్టీపై స్పందించిన ఎంపీ అరవింద్..
రాజన్న రాజ్యం కాదు.. రామ రాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. ఇక్కడ కూడా ఎంపీ అరవింద్
అనడంలో ఎలాంటి తప్పూ లేదు. రామరాజ్యం అంటే.. గొప్ప రాజ్యం అని పేరు.
ప్రజల
హ్యాప్పీగా బతికారు అనేపేరు. కాకపోతే.. అందరూ అదే నామం పట్టుకుంటున్నారే తప్ప..
ప్రజల గురించి.. పథకాల గురించి మాట్లాడ్డానికి ఇంకేమీ లేదా అనే క్వశ్చన్ లు అయితే
వస్తున్నరు..
______________________________________________________
కేజీ టు జీపీ ఇక పట్టాలెక్కిస్తేనే మేలు
తెలంగాణలో గతంతో పోలిస్తే విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గురుకులాల ఏర్పాటు వల్ల సామాన్యులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. అయితే తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక ప్రకటించినా ఎందుకనో అది పట్టాలకెక్క లేదు.
నిజానికి కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తానని సిఎం కెసిఆర్ పలుమార్లు ప్రకటించారు. సామాన్యుడి నుంచి, రాజకీయ నాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్షను ప్రకటించారు.
కులరహిత హాస్టళ్లు ఉండకూడదని కూడా చెప్పారు. ఇంతటి ఉదాత్తమైన పథకం ఎందుకనో ముందుకు సాగడం లేదు. నిజానికి ఇప్పటి వరకు సిఎం కెసిఆర్ చేస్తున్న పథకాలు ఒక ఎత్తయితే ఈ పథకం ఒక ఎత్తయ్యేది. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది.
కామన్ ఎడ్యుకేషన్ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుంది. అది ఎల్‌కెజి నుంచే పిల్లల్లో భేదభావాలు లేకుండా చేస్తుంది. ఇపðడున్న స్కూళ్లను చూస్తుంటే ఆర్థికస్థాయిని బట్టి నడుపుతున్నారు. అయితే ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉండగానే గురుకులాలు, ఉర్దూవిూడియం స్కూళ్లు ప్రారంభించడం, అనేక హాస్టళ్లను కొత్తగా చేప్టటడం వల్ల పథకం అటకెక్కిందన్న భావన కలుగుతోంది.
ప్రస్తుతానికి ఈ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వం కూడా అధిక బడ్జెట్ కేటాయింపులు చేసి వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాలు 800 పైనే అయ్యాయి.
ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు.
పేదపిల్లలకు
కార్పోరేట్ విద్యాసంస్థలను
తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్
విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ
విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి.
ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉపాధికి తగ్గ చదువు దక్కేలా చేయాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను, కరికులమ్‌ను మార్చాలి.
పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో సామాజిక మార్పుకు దోహదపడుతుందని రుజువు చేయాలి. అలాగే ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు చదువును కొనే దుస్థితి నుంచి బయటపడేలా చేయాలి.
సామాన్యులకు చదవును దగ్గర చేసేందుకు ఎంతయినా ఖౄర్చు చేయాలి. అపðడే విద్యారగం పటిష్టం కాగలదు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గగలదు. లేకుంటే విద్య కోసం పేదలు సైతం లక్షల్లో ఖర్చు చేసేందుకు అపðల బారిన పడుతున్నారు.
కార్పోరేట్ స్కూళ్ ఫీజు దోపిడీలను అరికట్టాలి. నిర్ణీత ఫీజులు ఉండేలా చూడాలి. అందుకు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న కృషి మరింత ముందుకు సాగాలి.
______________________________________________________
సంస్కరణలతో ఏపీలో పేదలకు అందుబాటులో విద్య
ఎపిలో విద్యారంగంలో సంస్కరణలకు సిఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సామాన్యులకు విద్యను చేరువచేసే లక్ష్యంతో అనేక విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.సర్కార్ అనేకానేక పథకాలతో విద్యార్థులకు అండగా నిలవాలని చూస్తోంది.
మూడేళ్లలో 45 వేల పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టల్స్, 148 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రూపురేఖలు మార్చబోతున్నట్లు సిఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలన్నీ పూర్తిగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని స్కూళ్ల రూపు రేఖలు మార్చబోయే కార్యక్రమం ఇది.
మధ్యాహ్న భోజనం మెనూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ.. గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. దీనివల్ల అదనంగా దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు.. వారు భావితరంతో పోటీ పడాలన్న లక్ష్యం మేరకు ముందుకు సాగుతున్నారు.
అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి రావాలని. అది జరగాలంటే ప్రతి స్కూల్ ఇంగ్లిష్ విూడియం వైపు పరుగెత్తాలన్న సంకల్పంతో సిఎం జగన్ ఉన్నారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ పూర్తిగా ఇంగ్లిష్ విూడియం ప్రవేశపెట్టబోతున్నారు.
ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ మొత్తంగా నాలుగేళ్లలో బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్ విూడియంలో రాసే పరిస్థితి కల్పిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా పిల్లలకు బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు.
వీటన్నింటితో పాటు తెలుగును తప్పనిసరి స్జబెక్టుగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఎపిలో విద్యారంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో కార్పోరేట్ స్కూళ్ల ఫీజు దోపిడీకి కళ్లెం పడనుంది. వేలకోట్లు ప్రజల నుంచి పీలుస్తున్న విద్యాసంస్థలకు ముకుతాడు పడనుంది.
ప్రభుత్వమే నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ విూడియాన్ని ప్రకటించినందున ఇక ఎపిలో విద్యారంగంలో విప్లవం రాకమానదు. ఇకపోతే ఏపీ ప్రయివేటు యూనివర్సిటీల చట్టం-2006 సవరణకు రూపొందించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా ప్రయివేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేసే ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయివేటు యూనివర్సిటీలు స్థాపించే వారికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశిరచాలని అధికారులకు దిశా నిర్దేశర చేశారు.
కోవిడ్19 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆన్‌లాక ఉత్తర్వుల మేరకు దశల వారీగా కాలేజీల పునః ప్రారంభం, క్లాసుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఎయిడెడ్ కాలేజీల నిర్వహణ పూర్తిగా ఇటు ప్రభుత్వ యాజమాన్యంలో, లేక అటు ప్రయివేటు యాజమాన్యాల చేతిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఎయిడెడ్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే
నడుపుతుందని, లేని పక్షంలో పైవేటు యాజమాన్యాలే నడుపుకొనేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
______________________________________________________
For more updates:
Follow us on Facebook
Join our Facebook group
News 9 Telugu Daily Public Group
Follow us on Instagram: