యునెస్కో బరిలో రామప్ప ఆలయం

యునెస్కో బరిలో రామప్ప ఆలయం  


25, 26వ తేదీల్లో బృందం పరిశీలన 


 


వరంగల్ : కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప ఆలయం. ఈ ఆలయానికి యునెస్కో జాబితాలో చోటు లభిస్తే ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి దక్కనుంది. య- నెస్కో అంటే ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ. అంతర్జాతీయంగా విద్య, విజ్ఞానంతో పాటు సాంస్కృతిక పరిరక్షణ కోసం ఈ సంస్థ పాటుపడుతోంది. 


 ఇప్పటివరకు చారిత్రక ప్రాంతాలకే గుర్తింపునిస్తుండగా.. కాకతీయులు నిర్మించిన కట్టడం ఈ జాబితాలో స్థానం కోసం పోటీ పడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దేశంలో 3,867 చారిత్రక కట్టడాలు ఉండగా ఇప్పటివరకు 38 చారిత్రక ప్రాంతాలకు మాత్రమే యునెస్కో జాబితాలో చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 137 చారిత్రాక కట్టడాలు ఉన్నా ఇప్పటి వరకు ఒక కట్టడానికి కూడా వారసత్వ సంపదగా గుర్తింపు లభించలేదు. 


  


ఏటా యునెస్కో గుర్తింపు కోసం దేశం నుండి రెండు, మూడు దరఖాస్తులను కేంద్రం పంపిస్తుండగా 2017లో రామప్ప ఆలయం పేరు కూడా పంపించారు. కానీ ఆలయ ప్రత్యేకతల వివరాలు సరిగా లేవంటూ దరఖాస్తును తిరస్కరించారు. ఈ మేరకు యునెస్కో కస్టలెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ అయిన చూడామణి నందగోపాల్ తో ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు అందజేశారు. 


దీంతో 2019 సంవత్సరానికి గాను భారతదేశం నుండి రామప్ప ఆలయం ఒక్కటే య- నెస్కో పరిశీలనకు నామినేట్ అయింది. ఈ మేరకు దరఖాస్తుతో జత చేసిన ప్రత్యేకతలు రామప్పలో ఉన్నాయో, లేదో పరిశీలించేందుకు ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు యునెస్కో(ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ సైట్స్) బృందం రామప్పలో పర్యటించనుంది. యునెస్కో కన్సల్టెంట్ చూడామణి నందగోపాల్ ఆలయంపై అధ్యయనం చేసి ఆలయంలోని మూడు ప్రత్యేకతలను తెలియజేస్తూ నివేదించించారు. 


  


ఇందులో శాండ్ బాక్స్ టెక్నాలజీ (ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం), ఫ్లోటింగ్ బ్రిక్స్ (నీటిలో తేలాడే ఇటుకలతో గోపురం నిర్మించడం), కలర్ వేరియేషన్స్(ఆలయ నిర్మాణానికి మూడు రకాల రాతిని వాడడం)ను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన)ను తయారు చేసి యునెస్కోకు సమర్పించార . నామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. రామప్పకు మెరుగైన రవా మార్గం ఏర్పాటు చేయడమే కాకుండా పరిసరప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చి పరిరక్షణ చర్యలు చేపడుతారు. 


 తద్వారా దేశ, విదేశీ పర్యాటకులు పెరగనుండడంతో అంతర్జాతీయ పర్యాటకుల కోసం కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. యునెస్కో బృందం సందర్శించనున్న నేపథ్యంలో సుమారు రూ. 8కోట్లతో పురావస్తుశాఖ అధికారులు అభివృద్ధి పనులను చేపట్టారు. గత నెలరోజులుగా చేపడుతున్న ఈ పనులు పూర్తికావొచ్చాయి.


Comments