ఎన్నికల కురుక్షేత్రం హుజుర్ నగర్
బరిలో నాలుగు పార్టీలు? సైసై అంటే సై అంటున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ
హుజూర్ నగర్ : కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార ప్రధాన ప్రతిపక్షాల ప్రతిష్టకు సవాల్ గా మారింది. అంతేకాదు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ కూడా ఈ సీటుపై కన్నేసింది. వీటితో పాటు, టీడీపీ కూడా బరిలో దిగే అవకాశం ఉంది.
మొత్తం మీద ఈ ఉప ఎన్నిక కురుక్షేత్రం లా జరుగుతుందని అన్ని పార్టీల నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి పేరు ప్రకటించగానే పార్టీలో మొదలైన రచ్చ
సద్దుమనిగింది. దాంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలంతా పద్మావతి గెలుపుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పద్మావతిని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపునివ్వడం పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది.
మరోవైపు, హుజూర్ నగర్ లో పాగా వేయాలని అధికార టిఆర్ఎస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వటంతో ఎన్నికల కాక మరింత పెరిగింది. ఈ సారి సైదిరెడ్డి గెలుపు తధ్యమని కేటీఆర్
ధీమాతో ఉన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన విజయం సొంతం చేసుకోలేక పోయినకు హుజూర్ నగర్ సవాలుగా మారింది. మరోవైపుబీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని తెలంగాణ బీజేపీ నేతలు ఎంపిక చేశారు. ఈసారి హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగానే అనేకమంది పోటీ పడినప్పటికీ శ్రీకళారెడ్డివైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆమె తండ్రి జితేందర్ రెడ్డి కోదాడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఎన్నికల కురుక్షేత్రం
శ్రీకళారెడ్డి భర్త కూడా బీఎస్సీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారుఆమె కుటుంబమంతా రాజకీయ నేపథ్యం కాబట్టి.. ఆ దిశలో కూడా పరిశీలించిన బీజేపీ అధిష్టానం
శ్రీకళారెడ్డివైపు మొగ్గుచూపింది.
అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో.. బీజేపీ వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేసింది. ఇక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని టీటీడీపీ భావిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు
. హుజూర్ నగర్ లో టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. ఉప ఎన్నికలో సత్తా చాటుతాం అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏదేమైనా.. గెలుపు ఎవరిదైనా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగటం ఖాయం!