విమోచనోత్సవంపై బిజెపి కార్యక్రమాలు

విమోచనోత్సవంపై బిజెపి కార్యక్రమాలు


 


అన్నిపార్టీలను కలుపుకుపోయే యత్నాలు వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి చెక్ పెట్టే యత్నాలు


 


హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవంపై బిజెపి దూకుడు పెంచింది. అధికారికంగా విమోచనోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారిక టిఆర్ఎస్ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు మ— రోమారు బిజెపి దీనిని నిర్వహించేందుకు సిద్దం అయ్యింది.


టిఆర్ఎసను నిలదీయడమే గాకుండా ఈ సందర్భంగా రాజకీయ ఉద్యమానికి బీజేపీ తెరతీయ- ఎబోతుంది. రాష్ట్రంలో రాజకీయంగా బలపడడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.


 



ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా దీనిపై అనేక కార్యక్రమాలను నిర్వహించింది. తాజాగా మైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్గవర్నర్ దత్తాత్రేయ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్లు పలుకార్యక్రమాలల్లో పాల్గొన్నారు.


ఆర్యసమాజ్తో పాటు, ఉద్యమకారుల ఆత్మీయసమ్మేళనం కార్యక్రమాల్లో బిజెపి చురుకుగా వ్యవహరించింది. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ విముక్తంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు బాగా స్పందన వచ్చింది.


 



ఢిల్లీలో నిర్వహించిన పోటో ప్రదర్శన సందర్భంగా బైరాన్ పల్లి గ్రామానికి చెందిన నాటి తరం వృద్దులను, ఆనాటి ఘటనలకు సాక్షిగా నిలిచిన వారిని దేశ రాజధానికి తీసుకుని వచ్చి వారిని సన్మానించారు. విమోచనకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ మలుపుగా గమనించాలి.


తెలంగాణ ఏర్పడ్డ తరవాత, అధికార టీఆర్ఎస్ పట్టించుకోని సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సభలను నిర్వహిస్తోంది. తెలంగాణ విమోచనోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి పెంచుతోంది.


 



ఇందులో భాగంగా కేంద్రమంత్రులను రప్పించి సభలను నిర్వహిస్తూ విమోచన నాటి పరిణామాలను వివరిస్తూ వస్తోంది. తాజాగా కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలో నాలుగు ఎంపి స్థానాలు గెల్చుకోవడంతో బిజెపి ఇప్పుడు మరింత దూకుడు పెంచింది.


రాష్ట్రంలోనూ హైదరాబాద్, | నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళిక రచిస్తోంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ను ఎండగట్టడంతో పాటు, మజ్సిస్ కు తొత్తుగా మారిందని బిజెపి నేతలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.



 


17న రాష్ట్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు.


విమోచనను పెద్ద ఎత్తున నిర్వహించి అటు టీఆర్ ఎస్ ను, ఇటు ఎంఐఎంను రాజకీయంగా ఎండగట్టడంతో ప్రజల్లో మరింత పట్టు పెంచుకునేలా బిజెపి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్న ధీమాలో నేతలంతా ఉన్నారు.



 


తెలంగాణ వస్తే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామిని విస్మరించారు. దీనిని అవకాశంగా చూపుతూ రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు, అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని బిజెపి అగ్రనేతలు చెబుతున్నారు.


17న ప్రజలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా జాతీయ పతాకాలను ఎగరవేయాలని బిజెపినేతలు పిలుపునిచ్చారు. మజ్లిస్ చేతిలో టీఆర్ ఎస్ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఇకపోతే టీఆర్ఎస్ చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.


 



గత పాలకులు చరిత్రను కాలగర్భంలో కలిపారని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. ప్రజల త్యాగం లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని, తెలంగాణనే రాకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారే కాదన్నారు. అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించడం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.


తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచనోత్సవాలను జరపాలని టిఆర్ఎస్ అధినేతగా డిమాండ్ చేసిన కెసిఆర్, సొంత రాష్ట్రం ఏర్పడి సిఎం అయినాక కూడా గత పాలకుల విధానాలనే అనుసరిస్తూ వస్తున్నారు. అందుకే విమోచనోత్సవాలను జరపడం లేదు. దీని ఆధారంగా బిజెపి తన రాజకీయ కార్యకలాపాలను విసతరించుకుంటోంది.


Comments