పడకంటి మనసులో మాట 24.05.2020 PART 2

కేసీఆర్ దార్శనికత ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.


 


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందు చూపుతో కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో మహమ్మారి అదుపులోనే ఉంది. హైదరాబాద్ మహానగరం వినా మిగిలిన రాష్ట్ర మంతా దాదాపు కరోనా ఫ్రీ అన్న స్థాయికి చేరుకుంది.


హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడిలోకి రాలేదు సరికదా రోజు రోజుకూ విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్క హైదరాబాద్ అని మాత్రమే కాదు...దేశంలో మెట్రోపాలిటిన్ నగరాలలో కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాలు అవలంబించాల్సిన అవసరం ఉంది.



కేసీఆర్ అందరి కంటే ముందుగానే కఠినమైన చర్యలతో...కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను జూన్ 5వ తేదీ వరకూ కొనసాగిస్తేనే మేలని చెప్పారు. లాక్ డౌన్ కొనసాగించక తప్పదని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.


అయితే కేంద్రం రాష్ట్రాలను ఇతోధికంగా ఆదుకుంటే మాత్రమే రాష్ట్రాలు లాక్ డౌన్ ను సమర్థంగా అమలు చేయగలుగుతాయని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు.



అయితే కేంద్రం రాష్ట్రాలను ఆదుకునే విషయంలో రాజకీయ లాభ నష్టాల బేరీజులో మునిగి తేలడం వల్లనే లాక్ డౌన్ సడలింపులు అనివార్యమయ్యాయని అమర్త్య సేన్ వంటి నిపుణులు చెప్పారు.


కేసీఆర్ స్వరమే అది. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ రంగం కరోనా కల్లోల పరిస్థితుల్లో సైతం పచ్చగా ఉంది.



వలస కార్మికులను ఆదుకునే విషయంలో కూడా కేసీఆర్ సర్కార్ ముందు చూపుతో వ్యవహరించడం వల్లనే ఇక్కడ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆందోళనలు తక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ పొడగింపు అనివార్యమని, అయితే ఇందుకు కేంద్రం సహకారం అవసరమనీ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.


కరోనా విజృంభన పరిస్థితుల్లో కేంద్రం కేసీఆర్ సూచనలను పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


_____________________________________________________________


కరోనా కట్టడితో పాటు వెంకన్న ఆస్తుల రక్షణా ప్రభుత్వ బాధ్యతే



ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు దేశ సగటు కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి. ఆ కారణంగానే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా...కట్టడి సాధ్యమన్న భావనతో జనం భరోసాగా ఉన్నారు.


కరోనా బాదితులు, వలస కార్మికులు, సామాన్యులను ఆదుకోవడంలో, ప్రజా సంక్షేమం కుంటుపడకుండా ముదుకు సాగడంలో జగన్ సర్కార్ ప్రశంసారమైన పాత్ర పోషిస్తున్నది.



అదే సమయంలో ఏడుకొండల వాడి ఆస్తులను అమ్మి పబ్బం గడుపుకుంటామంటూ... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రతిపాదనలు ప్రజల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు.


భక్తుల మనోభావాలు గాయపడే ఇటువంటి చర్యలను ఆదిలోనే అడ్డుకోవలసిన అవసరం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి టిటిడి సన్నాహాలు చేడాన్ని ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది.



టిటిడి భూముల. వేలం నిర్వహణకు 8 మంది సిబ్బందితో కూడిన రెండు ప్రత్యే క బృందాలను కూడా నియమిస్తూ టిటిడి అధికారిక ఉత్తర్వు లను జారీ చేసింది.


అయితే తిరుమలేశునిపై భక్తితో భక్తులు సమర్పించిన ఆస్తులను విక్రయించడం ఎంత మాత్రం తగదు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తితో డబ్బు, ఆభర ణాలతో పాటు విలువైన స్థిరాస్తులను కూడా భక్తులు సమర్పిం చే అనవాయితీగా దశాబ్దాలుగా కొనసాగుతూ వుంది.



అందు లో కొందరు భక్తులు తాము సమర్పించిన భూములను పలానా అవసరాలకే వినియోగించాలని సూచిస్తే ఎక్కువ మంది ఏ విధంగా అయినా ఉపయోగించుకునే హక్కును టిటిడికి అప్పగిస్తుంటారు.


వాటి స్థితిగతులను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు టిటిడి అధికారికంగా స్వాధీనం చేసుకుని భవిష్యత్ అసవరాలకు వినియోగించుకో వడం కూడా అనవాయితీగానే వస్తోంది.



ఇందుకు భిన్నంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆస్తులను టిటిడీ వేలం పెట్టడం అంటే భక్త జనం మనోభావాలను గాయపరచడం అవుతుంది. తెలుగు దేశం, జనసేన, బిజెపి లకు చెందిన స్థానికనా యకులు తీవ్రస్థాయిలో టిటిడిపై ధ్వజ మెత్తారు.


భక్తులు భగవంతునికి భక్తితో సమర్పించిన ఆస్తులను దైవ సంబంధమైన అవసరాలకు వినియో గించాలే కానీ విక్రయించి సొమ్ము చేసుకోవడం తగదని తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేసారు. పలువురు నాయకులు ఆందోళనలకు దిగుతా మని హెచ్చరిస్తున్నారు.



అయితే ముఖ్యమంత్రి జగన్ టిటిడి ఆస్తుల వేలాన్ని పక్కన పెట్టాలంటూ టీటీడీని ఆదేశించినప్పటికీ. ఆ ఆదేశాలలో పదును లేదని...వేలం విషయంలో టీటీడీ ముందుకే సాగుతుండటాన్ని బట్టి అవగతమౌతున్నది.


ప్రస్తుతం ప్రభుత్వం శక్తియుక్తులన్నీ కరోనా కట్టడిపై కేంద్రీకృతం చేయాల్సిన తరుణంలో టిటిడి ఆస్తుల వేలం, విశాఖలో వైద్యుడిపై దాడి, పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వంటి అనవసర వివాదాలను కావాలని కొని తెచ్చుకుంటున్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


________________________________________________________________


CLICK BELOW TO CHECK OUT PART I


పడకంటి మనసులో మాట 24.05.2020 - NEWS 9 TELUGU DAILY PAPER -    https://news9telugunews.page/BX4793.html


Comments