జిల్లాలో మరోమారు పత్తికి ప్రోత్సాహం

జిల్లాలో మరోమారు పత్తికి ప్రోత్సాహం


కందిపంటకు కూడా అవకాశాలు మెండు రైతులకు సూచనలు


 


ఆదిలాబాద్ : ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, కడెం, సదర్మాట్, కుమ్రం భీం గూడెం ఎత్తిపోతలు, స్వర్ణ ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రాంతంలో వరి సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు.


మిగతా చెరువుల కింద కూడా సాగు చేసేలా చూస్తున్నారు. బోర- బావుల కింద సాధ్యమైనంత వరి సాగు తగ్గించి పత్తి పంట వేసేలా ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కందులను పెద్ద మొత్తంలో సాగు చేసేలా చూస్తున్నారు. సిఎంతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో ఇదే విషయం స్పష్టమయ్యింది.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 55 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత వరి సాగు తగ్గించి పత్తి, కందులను సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు.


మరోవైపు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సోయా సాగు చేస్తారు. ఈసారి లా డౌన్ వల్ల సోయా సాగుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరి, సోయా, మక్కజొన్న తగ్గించి పత్తి, కందులు, ఇతర పప్పు దినుసుల సాగుకు ప్రోత్సహిస్తున్నారు.



ఇకపత్తి విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 2.85 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది. వరి పంటకు నీరు అధికంగా అవసరమవుతోంది.


అదే నీటిని పత్తికి వినియోగిస్తే దిగుబడి అధికంగా వస్తుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది పత్తి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా మరో 2 లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం ఉంది.



పత్తి సాగుకు నీటి వనరులుంటే దిగుబడి 50 నుంచి 100 శాతం పెరుగుతుందని వ్యవసాయ శా- స్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు పత్తిని డిసెంబర్ నాటికి తీసేస్తే.. నువ్వులు, ఆవాలు, కుసుమలు, శనిగలు సాగు చేసుకోవచ్చు.


ఈ పత్తిని డిసెంబర్ లో తీసేసి పశువులకు తినిపించి దున్నేసుకుంటే గులాబీ పురుగు బెడద ఉండదని, పత్తి వేసిన 45 నుంచి 50 రోజుల్లో గులాబీ పురుగు రాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని, రసాయన మందులు పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



కాగా, ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 9.79 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 52 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 18 లక్షల క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1.84 లక్షల ఎకరాల్లో 13 లక్షల క్వింటాళ్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాలకు 12లక్షల క్వింటాళ్లు, నిర్మల్ జిల్లాలో 1.45 లక్షల ఎకరాల్లో 9 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది.


బహిరంగ మార్కెట్లో పత్తి క్వింటాలుకు సీసీఐ రూ.5,450 చొప్పున క్వింటాలుకు మద్దతు ధర చెల్లిస్తోంది. బహిరంగ మార్కెట్లో రూ. 4500 నుంచి రూ. 5,000 వరకు క్వింటాలుకు చెల్లిస్తున్నారు. కొన్నిసార్లు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గతంలో అనేకమార్లు పత్తిని పండించారు.


Comments