అమెరికాలో విమర్శలకు గురవుతున్న ట్రంప్
కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదన్న ఆరోపణలు కరోనా వైరస్ పై దర్యాప్తులో తేలనున్న చైనా వ్యవహారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి దారుణంగా వుంది. చైనాను అనుమానిస్తూ ఆయన చేసిన ప్రకటనకు స్వదేశంలో ఇంతవరకూ పెద్దగా మద్దతు దొరక్కపోయినా ప్రపంచ ఆరోగ్య సంస్థలో క్రమేపీ అన్ని దేశాలూ గొంతు కలిపాయి.
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ట్రంప్ ఏర్పాటు చేసిన కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు అయిన ఆంథోనీ ఫాసి ఈ వైరస్ మానవ సృష్టి అని చెప్పడానికి ఆధారాల్లేవని ట్రంప్ సమక్షంలోనే మొదట్లోనే నిర్మొహమాటంగా చెప్పారు.
ట్రంప్ అనుభవ రాహిత్యం వల్లనే అమెరికా భారీ మూల్యం చెల్లించుకుందని నజాతి నాయకుడు జాక్సన్ * భారీ మావ విమర్శలు గుప్పించారు. వైరస్ జన్యు చిత్రపటాన్ని అధ్యయనం చేస్తే ఇది జంతువుల ద్వారా వ్యాపించింది తప్ప, కృత్రిమంగా రూపొందలేదని తేలిందంటున్నారు.
అత్యంత కీలకమైన జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ కార్యాలయం సైతం ఈ నెల మొదట్లో ఈ మాటే చెప్పింది. వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ వాటా నిధులను నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదిలావుంటే మొత్తంగా వైరస్ వ్యాప్తిపై విచారణ జరగాలన్న అమెరికా పంతం నెగ్గింది.
చైనాపై ముందునుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న ట్రంప్ ఎట్టకేలకు తనపంతాన్ని నెగ్గించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని డబ్ల్యూ హెవోపై కారాలు మిరియాలు నూరుతున్న ట్రంప్.. ఆ సంస్థకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు.
చైనా చేతుల్లోంచి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించకపోతే సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. 30 రోజుల్లోగా తన విధానాన్ని మార్చుకోకపోతే డబ్ల్యూహెచ్ వోకు నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆ సంస్థ డైరెక్టర్ టెడ్రోను సోమవారం రాసిన లేఖలో స్పష్టంచేశారు.
'కొవిడ్-19 విషయంలో మీరు, మార్చుకోకపోతే ఆ ఈ సంస్థ పదేపదే చేస్తున్న తప్పుల కారణంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తున్నది. వచ్చే 30 రోజుల్లో స్థిరమైన చర్యలు తీసుకోకపోతే తాత్కాలికంగా నిలిపేసిన మా నిధులను శాశ్వతంగా రద్దుచేస్తాం.
సంస్థలో మా సభ్యత్వం గురించి కూడా పునరాలోచిస్తాం' అని హెచ్చరించారు. డబ్ల్యూహెవోకు అమెరికా ఏటా 500 మిలియన్ డాలర్ల విరాళం ఇస్తున్నది. కరోనా విషయంలో సంస్థ తీరుపై గుర్రుగా ఉన్న ట్రంప్ ఇటీవలే ఆ నిధులను తాత్కాలికంగా నిలిపేశారు. ఇక విచారణ జరిగితే వైరస్ వ్యాప్తిక ఇకారణాలు తెలుస్తాయి.
దర్యాప్తు మొదలైతే దాని ముందు హాజరై జవాబిచ్చుకునే బాధ్యత చైనాపైనే వుంటుంది. వైరస్ ఆనవాళ్లు ముందుగా ఆ దేశంలోని వుహాలో బయటపడ్డాయి గనుక జరిగిందేమిటో, తన వంతుగా తీసుకున్న చర్యలేమిటో, దాన్ని అదుపు చేయడంలో మొదట్లో ఎందుకు విఫలం కావాల్సివచ్చిందో అది వివరిం చక తప్పదు.
వాస్తవానికి మొదట్లో దర్యాప్తు ఎందుకంటూ చైనా అభ్యంతర పెట్టింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించిన తీరు, ఆ వైరస్ పుట్టుక తెలుసు కోవడానికి నిష్పాక్షికమైన, స్వతంత్రమైన, సమగ్రమైన మదింపు' వేయడానికి అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని డబ్లుయహెచ్ఓను తీర్మానం కోరడంతో దాన్ని చైనా కాదన లేకపోయింది.
తీర్మానాన్ని ప్రతిపాదించిన 61 దేశాల్లో మన దేశం కూడా వుండటం సహజంగానే ఆసక్తికరమైనది. ఆన్ లైన్ లో జరిగిన ఈ సదస్సులో అమెరికా ఆచితూచి మాట్లాడిన తీరు కూడా గమనించదగ్గది. బయట ఇంతవరకూ ట్రంప్ ఏం చెప్పినా.. డబ్లుయహెచ్ఓలో మాత్రం చైనా విషయంలో ఆ దేశం బాధ్యతాయుతంగానే మాట్లాడుతోంది.
అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న ఆరోగ్య మంత్రి అలెక్స్ అజర్ మాట్లాడుతూ వైరస్ విరుచుకుపడుతున్న సంగతిని ఒక దేశం దాచి పెట్టడం వల్ల ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సివచ్చిందని అనడమే తప్ప నేరుగా చైనా పై విరుచుకుపడలేదు.
కరోనా వైరస్ మహమ్మారికి బాధ్యులెవరో తేల్చడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదు. అది ఖచ్చితంగా వెల్లడి కావలసిందేనని అన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే దానికి సశాస్త్రీయమైన, సాధికారికమైన ఆధారాలు సేకరించాలి. అదే జరిగితే కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయంలో ట్రంప్ వాదనలు ఎలా ఉన్నా అమెరికాలో మాత్రం అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు విమర్శలపాలవుతున్నాయి.