వలసకూలీలపై ప్రత్యేక దృష్టి

వలసకూలీలపై ప్రత్యేక దృష్టి


క్వారంటైన్ కు తరలిస్తున్న అధికారులు


కర్నూలు : కరోనా కంట్రోల్ అయినా జిల్లా అధికార యంత్రాంగం అన్ని రోణ చర్యలు తీసుకుంటున్నది. వలస కూలీలను ప్రభుత్వమే స్వస్థలాలకు తీసుకొస్తుండడంతో వారిని ముందుగా క్వారంటైన్లకు తరలించి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపుతున్నారు.


అయితే.. కొందరు అనధికారికంగా ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వస్తున్నారు. వీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండానే నేరుగా వస్తుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరు ఇప్పటికే కరోనా బారిన పడి ఉంటే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి గానీ, పట్ట ణాల్లోకి గానీ ఎక్కడి నుంచైనా వలసదారులు వస్తే సమాచారం సేకరించాలని ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా నేరుగా రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104 లేదా 1902కు ఫోన్ చేయొచ్చని సూచిస్తున్నారు.


వలస కూలీలు ఎక్కడి నుంచి వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండేలా కలెక్టర్ వీరపాం డియన్ చర్యలు చేపట్టారు. అక్కడ వారికి భోజనం, ఇతర సదుపాయాలు, వైద్య సేవలను కల్పిస్తున్నారు. చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ ప్రస్తుతం కరోనా హాట్ స్పాట్ గా మారింది. అక్కడ పనిచేసేందుకు జిల్లాకు చెందిన కూలీలు 494 మంది వెళ్లారు.ప్రస్తుతం మార్కెట్ ను మూసేయడంతో వారందరూ తిరిగొచ్చారు. వారిలో 390 మందిని మాత్రమే క్వారంటైన్ చేశారు. మిగిలిన 104 మంది ఆచూకీ తెలి యడం లేదు. వీరు ఎక్కడున్నారో కనుగొ నాలని అధికార యంత్రాంగం పోలీ సులకు కాల్ డేటా అంద జేసింది.


కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపేలా ఏర్పాట్లు చేశారు. కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జిల్లా అధికార యంత్రాంగానికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది.మహారాష్ట్రలోని థానే నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వలస కూలీల్లో 37 మందికి కరోనా పాజిటివ్ రావడం, చెన్నైలోని అతి పెద్ద కూరగాయల హోల్ సేల్ మార్కెట్ 'కోయంబేడు'కు వెళ్లాచ్చిన వారిలో 104 మంది ఆచూకీ గల్లంతు కావడంపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది.


దీంతో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులపై గట్టి నిఘా వేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది వలస కూలీలు మంగళవారం రాత్రి గుంతకల్లు రైల్వేసే షనకు చేరుకున్నారు.వీరిలో అత్యధిక మంది కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారే. వీరిలో ఇప్పటివరకు 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 37 మంది కర్నూలు జిల్లావాసులు కాగా.. మిగిలిన ఒక్కరూ కడప వాసి. మిగిలిన వారం దరికీ పరీక్షలు కొనసాగు తున్నాయి.


పాజిటివ్ వచ్చిన వారిని జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.ప్రస్తుతం పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు థానే సమీపంలోని చేపల మార్కెట్ లో కూలీలుగా పని చేసినట్లు గుర్తించారు. కాగా, రెండు వారాల క్రితం ముంబై నుంచి జిల్లాకు 254 మంది వలస కూలీలు తిరిగొచ్చారు. వీరిలో ఒక్కరూ కరోనా బారిన పడకపోవడం విశేషం. ఆదోని రెవెన్యూ డివిజన్ లోని 16 మండలాలకు చెందిన వారు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం వీరు తిరిగొస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.


Comments