పడకంటి మనసులో మాట 05.07.2020


పడకంటి మనసులో మాట...


_____________________________________________________________


మోడీ పక్కన అడుగులేస్తూ వారు చేసిన వందేమాతరం నినాదాలతో గాల్వాన్ లోయ ప్రతిధ్వనించింది. ఆ సింహగర్జన చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తుందనడంలో సందేహానికి తావే లేదు. శాంతి వచనాలతో పాటు సుదర్శన చక్ర ప్రయోగం కూడా తెలుసునంటూ మోడీ చేసిన ప్రసంగం అటు సైనికుల్లోనూ, ఇటు దేశ ప్రజలలోనూ గుండెల్లో నటుకునేలా ఉంది. గాల్వాన్ లోయలో చైనా సైనికులను ఎదురొడ్డి పోరాడిన భారత సైనికులకు నేతృత్వం వహించిన మన తెలుగు బిడ్డ సంతోష్ బాబుకు ప్రధాని పర్యటన నిజమైన, ఘనమైన నివాళిగా చెప్పాలి.


_____________________________________________________________


జాతి రక్షకుడు జవానే 



జాతి ప్రధాని నరేంద్రమోడీ గాల్వాన్ లోయ ప్రాంత పర్యటన యావత్తూ ఉత్తేజపూరితంగా, ఉద్వేగ భరితంగా సాగింది. అసలు ఆయన పర్యటన యావత్ ప్రపంచాన్నీ సంభ్రమాశ్యర్యాలలో ముంచెత్తింది.


విపక్షాలు రాజకీయ ప్రయోజనం కోసమని విమర్శలు చేసినా, శత్రు దేశాలుగా వ్యవహరిస్తున్న పొరుగు దేశాలు పెదవి విరిచినా, తాను అనుకున్నది చేయడానికి వెనుకాడని దృఢ సంకల్పం, పట్టుదల ప్రధానమంత్రి నరేంద్రమోడీలో మరోసారి ప్రస్పులమయ్యఆయి.దేశ రక్షణ విషయంలో జవాన్ల సహసం, త్యాగాల విలువ వెలకట్టలేనిదని తన పర్యటన ద్వారో మోడీ మరోసారి చాటారు.



జవాన్లో నిజమైన హీరోలని ఉద్ఘాటించారు. ప్రధానిగా తన హెూదాని పక్కన పెట్టి, వారి సహచరుడిగా, పెద్దన్నగా సైనికులతో కలిసిపోయారు.వారికి ప్రేమగా తినిపించారు. కోవిడ్ నిబంధనలను సైతం తోసి రాజని వారితో కరచాలనాలు చేశారు.


భుజం తట్టి అభినందన, ప్రోత్సాహాలు అందించారు. మోడీ తొలి సారి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో సియాచిన్ మంచు కొండలపై సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నా, లడఖ్ లో గాల్వన్ లోయ ప్రాంతంలో సైనికులను కలుసుకున్నా దేశ సరిహద్దులను ప్రాణాలను పణంగా పెట్టి పరిరక్షిస్తున్న వీర జవాన్లకు నైతిక స్థయిర్యాన్ని కలిగించడమే లక్ష్యం.



చైనా సైనికులు గాల్వాన్ లోయలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టే సందర్భంలో మన సైనికులు 20మంది మరణించారు. ఇంతకు రెట్టింపు మంది చైనా సైనికులు మరణించినట్టు అమెరికా నిఘా వర్గాలు ప్రకటించాయి. దీనిపై చైనా ఇంకా ధ్రువీకరించలేదు.


ధృవీకరించే ఉద్దేశం కూడా ఆదేశానికి లేదు. తమ సైనికులు ఎంతమంది చనిపోయారో చెప్పుకోలేని దయనీయ స్థితిలో చైనా పడిపోవడానికి కారణం దాని స్వయంకృతాపరాధమే. పక్కా వ్యూహంతో మన జవాన్లపై దాడికి దిగిన పొరుగుదేశం జవాన్లకు భారత సైనికులు మరిచిపోలేనిగుణపాఠాన్ని నేర్పారు.



అటువంటి సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించడం వీర జవాన్ల మనోసైర్యాన్ని పెంపొందించడం కోసమేననన్నది నిస్సందేహం. దేశాధినేత స్వయంగా తమ వద్దకు వచ్చినప్పుడు సైనికుల్లో వెల్లివిరిసిన వారి నినాదాలలోనే ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది.


ఈ మోడీ పక్కన అడుగులేస్తూ వారు చేసిన వందేమాతరం నినాదాలతో గాల్వాన్ లోయ ప్రతిధ్వనించింది. ఆ సింహగర్జన చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తుందనడంలో సందేహానికి తావే లేదు. శాంతి వచనాలతో పాటు సుదర్శన చక్ర ప్రయోగం కూడా తెలుసునంటూ మోడీ చేసిన ప్రసంగం అటు సైనికుల్లోనూ, ఇటు దేశ ప్రజలలోనూ గుండెల్లో నటుకునేలా ఉంది.



గాల్వాన్ లోయలో చైనా సైనికులను ఎదురొడ్డి పోరాడిన భారత సైనికులకు నేతృత్వం వహించిన మన తెలుగు బిడ్డ సంతోష్ బాబుకు ప్రధాని పర్యటన నిజమైన, ఘనమైన నివాళిగా చెప్పాలి. ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళు లర్పించడమే కాకుండా ,వీర సైనికుల సాహసాన్ని ప్రశంసించారు.


తనపర్యటన ద్వారా దేశం అంతా జవాన్ల వెనుక ఉందన్న సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని పర్యటన చైనాలో గుబులు రేకెత్తించింది. అందుకే ఉక్రోషాన్ని వెళ్లగక్కింది. వివాదాస్పద ప్రాంతంలో మోడీ పర్యటించారంటూ ఆరోపణల పర్వానికి తెరతీసింది.



అయితే చైనా గాల్వాన్ లోయలో చేసిన దుర్మార్గం, దౌర్జన్యాలను యావత్ ప్రపంచం వ్యతిరేకించింది. నిరసించింది. భారత్ కు మద్దతుగా, బాసటగా నిలిచింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురౌతున్న చైనా శాంతి కాముక భారత్ పై జవానే కయ్యానికి కాలుదువ్వడంతో ప్రపంచ దేశాలలో ఏకాకిగా మారిన పాకిస్థాన్ సరసన చేరాల్సిన పరిస్థితి వచ్చింది.


ఉపఖండంలో చైనాకు సమ ఉజ్జీగా, ఆర్థిక రంగంలో నిలిచిన భారత్ పట్ల చైనా కుళ్లు మోతుతనానికి మోడీ పర్యటన, ఆ పర్యటనకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన మద్దతు దిమ్మదిరిగే గుణపాఠం అవుతుంది. అంతే కాదు చైనాది విస్తరణ వాదమంటూ గాల్వాన్ వేదికగా మోడీ ఎలుగెత్తి చాటారు.



తద్వారా గాల్వాన్ తూర్పు ప్రాంతాన్ని కబళించే ందుకు చైనా సాగిస్తున్న యత్నాలను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టారు. ఐరాసలో భారత ప్రతినిధి హాంకాంగ్ రక్షణ చట్టాన్ని లొసుగుల మయంగా అభివర్ణించడానికి ప్రపంచ దేశాల మద్దతు లభించడం ఇందుకు నిదర్శనం.


ఆధునిక ప్రపంచం విస్తరణ వాదాన్ని సహించదంటూ మోడీ చేసిన నినాదం... చెనాకు చెమట్లు పట్టించిందనడంలో సందేహం లేదు. ఇక చైనాకు చెందిన 59 యాట్లపై భారత్ విధించిన నిషం ఆర్థికంగా చైనా వెన్ను విరిచినంత పని చేసింది. ఇప్పుడు అమెరికా సహా పలు దేశాలు అదే బాటలో అడుగులు వేయాలని భావిస్తున్నాయి.



ఇక చైనా యాప్ ల స్థానంలో భారత్ యాప్ లను ప్రోత్సహించేందుకు మోడీ పిలుపు నిచ్చారు. ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా యాక్స్ రూపకల్పనకు స్టార్టప్ లకు పిలుపు నిచ్చారు. ఇది చైనా ఆర్థిక మూలాలపై పెను ప్రభావం చూపనుంది. శత్రు దేశంపై ఇప్పటికే మోడీ తీరుతో భారత్ నైతిక విజయం సాధించింది.


_____________________________________________________________


కరోనా...భయం - నగరం వీడి జనం 



తెలంగాణలో పరిస్థితులు వెలుగు నీడల దోబూచులాటగా మారాయి. ఒక వైపు హరితహారం ఊరూవాడా ఉత్సాహంగా సాగుతోంది. పుడమితల్లికి పచ్చలహారంవేస్తోంది. అదే సమయంలో మరోవైపు మహమ్మారి వైరస్ కరోనా రాష్ట్రాన్ని కమ్మేస్తోంది.


ముఖ్యంగా మహానగరం భాగ్యనగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంపై మహమ్మారి కరోనా పగపట్టిందా అన్న అనుమానం కలిగేలా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.



రోజుకు రెండు వేల మంది కరోనా బారిన పడుతున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ లో సెక్యూరిటీ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి మొత్తం 30 మందికి వైరస్ సోకింది. దీంతో ముఖ్యమంత్రి నివాసాన్ని శానిటైజ్ చేశారు.


కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లారు. పెద్దా,చిన్నా, గొప్ప, పేదా తేడా లేకుండా వైరస్ అందరికీ సంక్రమిస్తున్నది. సాక్షాత్తూ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడి, కోలుకున్నారు. మంత్రి హరీష్ రావు సూం క్వారంటైన్ లోకి వెళ్లారు.



పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలలో ధైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధిస్తామన్న ధైర్యాన్ని ప్రజలలో కల్పించడానికి ప్రయత్నాలు జరగడం లేదు. మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ లో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినా ఆ తరువాత కేబినెట్ ఊసే లేదు.


దీంతో జనమే స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మహానగరంలోని పలు ప్రాంతాలలో వ్యాపారులు స్వచ్చందంగా తమ వ్యాపారాలను బంద్ చేశారు. జనం అయితే బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.



చావో బతుకో కలిసే ఉందాం, కలోగంజో కలిసే తాగుదాం అన్న చందంగా సొంతూళ్లకు బయలుదేరి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఐటీ, సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, సూటల్స్, మాల్స్ ఇలా అన్నీ స్తంభించిపోయాయి.


వాటిల్లో పని చేసే వారిలో అత్యధిక భాగం మహానగరాన్ని వీడి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇక చాలా కార్యాలయాలలో వర్క్ ఫ్రం హోం నడుస్తోంది. దాంతో ఆయా కార్యాలయాల వారు కూడా అత్యధిక భాగం ఆ వర్క్ ఫ్రం హెూంను సొంతూళ్ల నుంచే చేసుకుందామని వెళ్లిపోయారు.



ఎలా చూసుకున్నా మహానగర జనాభాలో సగం మంది ఇప్పుడు నగరంలో లేరు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ వల్ల నష్టమూ, లాభమూ రెండూ ఉండవు. కానీ ప్రభుత్వం బాధ్యతగా, భరోసాగా వ్యవహరించాలి. కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంత ఉదృతంగా లేని సమయంలో మఎఖ్యమంత్రి తరచూ విలేకరుల సమావేశంలో కరోనాపై పోరు విషయంలో జనానికి భరోసా కల్పిస్తూ ఉత్తేజపూరితంగా మాట్లాడేవారు.


దేశ వ్యాప్తంగా తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు భేష్ అంటూ కేంద్రమే కితాబిచ్చింది. అయితే ఆ తరువాత పరిస్థితి మారింది. కేంద్రం లాక్ డౌన్ మినహాయింపుల కారణంగా కరోనా వ్యాప్తి పెరిగింది.



సహజంగా అ పెరుగుదల మెట్రోపాలిటిన్ నగరాలలో అధికంగా ఉంది. అందుకు హైదరాబాద్ కూడా మినహాయింపు కాదు. ప్రధాని మోడీ మహమ్మారిపై పోరాటం విషయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే బాద్యత వహించాలన్న చందంగా , వ్యవహరిస్తున్నారు.


ఈ పోరాటంలో కేంద్రం నుంచి ఇప్పటికే చేయాల్సిన సహాయం అంతా చేసేశాం...ఇక మీ బాధలు మీరే పడండి అని చెప్పకనే చెప్పేశారు. కరోనా మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాలను, జనాలను కూడా ఒకే సారి రెండు పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టేసింది.



అవేమిటంటే... ఒకటి బతుకు పోరాటం. అంటే ఉపాధి కోసం బయటకు వెళ్లి పనులు చేయక తప్పని పరిస్థితి. రెండోది...మహమ్మారి కరోనాపై పోరు. కరోనా సోకకుండా అన్నఇ రక్షణ చర్యలు తీసుకోవడం. ఇక ప్రభుత్వాలకు కూడా రెండు పోరాటాలూ తప్పని పరిస్థితి.


ఒకటి ఖజానా ఖాళీ కాకుండా చూసుకోవడం అయితే రెండోది ప్రజలను కరోనా బారిన రక్షించడం. ప్రజలూ, ప్రభుత్వాలు కూడా ఏకకాలంలో రెండు పోరాటాలూ చేయక తప్పని అనివార్య పరిస్థితి. పోరాటాలలో ప్రజలూ, ప్రభుత్వాలు కూడా పరస్పర సహకారంతో ముందుకు సాగాలి.



ఆ దిశగా జనాలను అప్రమత్తం చేయాల్సిన అదనపు బాధ్యత ప్రభుత్వానిదే అనడంలో సందేహం లేదు.


_____________________________________________________________


సంక్షేమం,సంక్షోభం జుగల్ బందీ 



ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం, సంక్షోభం జుగల్ బందీ చేస్తున్న పరిస్థితి ఉంది. కరోనా విపత్కర సమయంలో కూడా జగన్ సర్కార్ ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడటం లేదు. అదే సమయంలో రాజకీయాలను వేడెక్కించే చర్యలతో | ఒక విధమైన అసహన పరిస్థితులు ఏర్పడేలా వ్యవహరిస్తున్నది.


అంబులెన్సుల విషయంలోనైతేనేమి, విపక్ష నేతలపై కేసుల విషయంలోనైతేనేమి ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ప్రజలలో ఆగ్రహానికీ, ఆందోళనలను చేయడానికి దారి తీస్తున్నది. ఒక నాణేనికి రెండు ముఖాలున్నట్లుగానే సంక్షేమ పథకాల అమలులో అవినీతి మరకలు కనిపిస్తున్నాయి.



అయితే ప్రజా సంక్షేమం విషయంలో తమను ప్రశ్నిస్తే సహించమన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఏ ప్రభుత్వ మైనా సరే ప్రశంసలనూ, విమర్శలనూ స్వీంకరించాల్సి ఉంటుంది.


ప్రశంసలను వ్ర జోవ యోగ కరమై న కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా చేపట్టడానికి స్పూర్తిగా తీసుకోవాలి.విమర్శలను లోటుపాట్లను న వరించుకోవడానికి సలహాలుగా స్వీకరించాలి. అయితే ఏపీలో అలా జరుగు తోందనిపించే పరిస్థితులు కనిపించడం లేదు.



అంబులెన్సుల వ్యవహారమే తీసుకుంటే, వాటి నిర్వహణ కాంట్రాక్టును వైకాపాలో నంబర్ 2గా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ అయిన విజయసాయిరెడ్డి అల్లుడికి దక్కడం వివాదాస్పదంగా మారింది. దానిపై సహజంగానే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.


విమర్శలకు బదులివ్వాల్సింది పోయి, ప్రభుత్వం ఎదురుదాడులకు దిగడం వివాదాస్పదంగా మారింది. అసలు అంబులెన్సుల నిర్వహణను బహిరంగ టెండర్ ద్వారా ఇచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తే వివాదం ఇంతగా రాజుకునేది కాదు.



అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అన్ననాయుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ చేసిన తీరు కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న అనుమానాలకు బలం చేకూర్చేదిగా ఉంది.


_____________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


 


Comments