పడకంటి మనసులో మాట 26.07.2020


పడకంటి మనసులో మాట.....


________________________________________________________________


వ్యాక్సిన్‌ గురించి వస్తున్న వార్తలు జనంలో భరోసా కలిగించడమే కాదు..వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న ధీమాతో నిర్లక్ష్యాన్నీ ప్రోది చేస్తున్నాయని పించేలా పరిస్థితులు మారాయి. వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అంటే వ్యాక్సిన్‌ వచ్చేసినట్లే కాదన్న చైతన్యం ప్రజలలో కలిగేలా వెూడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. స్వీయ ప్రయోజనాల కోసం వ్యాక్సిన అందుబాటులోకి వచ్చేస్తోందన్న భావన జనంలోనికి వ్యాప్తి చెందడానికే కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. దాని వల్ల కూడా జనంలో కరోనా వ్యాప్తి పట్ల భయం తగ్గి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందని సామాజిక వేత్తలు చేస్తున్న హెచ్చరికలు, ఆందోళనలను విస్మరించకూడదు.


________________________________________________________________


వ్యాక్సిన్ పై ఆశలు సరే...కరోనా కట్టడిపై దృష్టి ఏది?



కేంద్రం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, విదానాల అమలు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కరోనా కట్టడి విషయంలో బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్న వెూడీ సర్కార్‌ అందుకు సమాంతరంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలకూ ప్రాధాన్యత ఇస్తున్నది. మందులేని మహమ్మారి కట్టడికి ప్రయత్నాలు ఎన్ని చేసినా దానిని పూర్తిగా అంతం చేయాలంటే వ్యాక్సిన్‌ వినా మరో మార్గం లేదు.


కరోనా మహమ్మారి ఒక్క ఇండియాకే పరిమితమైన సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పరిశోదనలూ సాగుతున్నాయి. కొన్ని పరిశోధనల ఫలితాలు ఆశాజనకంగానూ ఉన్నాయి. ఆక్సఫర్డ్‌ వర్సిటీ, రష్యా, అమెరికా, భారతన లో శాంతా బయోటెక్స వంటివి వ్యాక్సిన్‌ విషయంలో గణనీయ పురోగతినీ సాధించాయి.


 



ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎలా విమర్శలు వస్తున్నాయో, అదే స్థాయిలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం జనం బాధ్యతను విస్మరించడంపైనా అదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాక్సిన్‌ కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ప్రజలకు ఉపశమనం కలిగించేదిగా ఉంటోంది. అది సహజం కూడా.


కరోనా వ్యాక్సిన్‌ విషయంలో వస్తున్న సమాచారం ఇపðడు ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. కరోనాపై ప్రపంచ దేశాల పరిశోధనలను తెలుసుకుంటున్నారు. కరోనా వ్యాధి తీవ్రత, మరణాల సంఖ్యకన్నా పరిశోధక వార్తలపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.



అందుకే దేశంలో కరోనా వెనక్కి తగ్గగలదని, తాము మళ్లీ మామూలు మనుషులం కాగలమన్న భరోసాతో బతుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌తో పాటు అనేక చోట్ల భారత్‌ బయోటెక రూపొందించిన కోవాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.


ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. తొలుత 30 ఏళ్ల వ్యక్తికి టీకాలు వేయగా, అతనిలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స రాలేదు.
రెండు గంటల తరువాత అతనిని పరీక్షించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌లోని ట్రయల్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ సంజరు రారు మాట్లాడుతూ కోవాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని, క్రమక్రమంగా అధికసంఖ్యలో వాలంటీర్లకు టీకాల పరీక్ష జరపనున్నామని తెలిపారు.



ఇప్పటివరకు 12 మందికిపైగా వాలంటీర్లకు మెడికల్‌ ఫిట్‌నెస్‌ లభించిందని, వారిలో ఇద్దరిని పిలవగా, ఒక వాలంటీర్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఎయిమ్స్‌కు చేరుకోలేకపోయారన్నారు. దీంతో ఒక టీకా మాత్రమే ఇవ్వగలిగారు. ట్రయల్స్‌ విషయంలో ఆరోగ్య భద్రత చాలా ప్రధానమని, అందుకే టీకా వేసిన వ్యక్తిని రెండు గంటలపాటు పరిశీలిస్తున్నామన్నారు.


వారికి ఎటువంటి అనారోగ్య సమస్య లేదని తేలిన తరువాతే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేస్తున్నామన్నారు. కాగా తొలుత 50 మందికి టీకాలు వేయనున్నామని, ఈ వ్యాక్సిన్‌ రెండు వెూతాదులలో ఇస్తామన్నారు. మొదటి డోసు ఇచ్చిన వారికి, 14 రోజుల తరువాత రెండవ వెూతాదు ఇవ్వనున్నామన్నారు.



కాగా ఈ టీకాలను మరో నలుగురికి వేయనున్నారు. ఇప్పటికే నిమ్స్‌లో ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అలాగే విశాఖ కెజిహెచ్‌ కూడా ఇందుకు సిద్దంగా ఉంది. ఈ ప్రయోగాలు విజయవంతం అయితే ప్రపంచదేశాల్లో భారత్‌ కూడా పోటీగా నిలవనుంది.


ఇకపోతే ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌.. కరోనా డ్రగ్‌ ఫావిపిరావిర్‌ ఫేజ్‌ 3 ప్రయోగ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 150మంది కరోనా రోగులపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. సాధారణ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వారికన్నా, ఫావిపిరావిర్‌ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నట్లు తేలింది.



ఈ ప్రయోగంతో ఫావిపిరావిర్‌ ప్రయోజనం, భద్రతపై సందేహాలు తొలగినట్లు గ్లెన్‌మార్క్‌ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు క్లినికల్‌ సైట్స్‌లో ఈ డ్రగ్‌ ప్రయోగం జరిగింది. సాధారణ చికిత్స పొందిన వారికంటే ఫావిపిరావిర్‌ ఉపయోగించిన వారు 40శాతం త్వరగా కోలుకున్నారని, అలాగే చికిత్స ప్రారంభమైన నాలుగోరోజు నాటికల్లా వారిలో వ్యాధి అదుపులోకి వచ్చిందని తెలుస్తోంది.


అలాగే ఫావిపిరావిర్‌ ఉపయోగించిన పేషెంట్లలో ఎటువంటి సీరియస్‌ సైడ్‌ ఎఫెక్ట్స లేవని తెలిపింది. ఈ డ్రగ్‌ ప్రయోగ ఫలితాలను త్వరలోనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురిస్తామని ఆ సంస్థ స్పష్టంచేసింది. మొత్తంగా కో వాక్సిన్‌ ప్రయోగాలు సఫలం అయితే ప్రపంచ దేవాల వైపు చూడకుండా భారత్‌ సొంతంగా కరోనాను తరిమి కొట్టేస్థాయికి చేరుకుంటుంది.



అందుకే ప్రజలు ప్రయోగ ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ గురించి వస్తున్న వార్తలు జనంలో భరోసా కలిగించడమే కాదు..వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న ధీమాతో నిర్లక్ష్యాన్నీ ప్రోది చేస్తున్నాయని పించేలా పరిస్థితులు మారాయి.


వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అంటే వ్యాక్సిన్‌ వచ్చేసినట్లే కాదన్న చైతన్యం ప్రజలలో కలిగేలా వెూడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. స్వీయ ప్రయోజనాల కోసం వ్యాక్సిన అందుబాటులోకి వచ్చేస్తోందన్న భావన జనంలోనికి వ్యాప్తి చెందడానికే కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది.



దాని వల్ల కూడా జనంలో కరోనా వ్యాప్తి పట్ల భయం తగ్గి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందని సామాజిక వేత్తలు చేస్తున్న హెచ్చరికలు, ఆందోళనలను విస్మరించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాప్తి తీవ్రత ఈ ఏడాది వరకూ కొనసాగుతుందని చేస్తున్న హెచ్చరికలను కేంద్రం పెడచెవిన పెడుతున్నట్లుగా తోస్తున్నది.


కరోనా కట్టడి చర్యలలో భాగంగా అనేక వ్యాపారాలు మూతపడటంతో దేశంలో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య, వేతనాల కోతకు గురైన వారి సంఖ్యా అధికంగా ఉంది. వారిలో కుంగుబాటు రాకుండా ఉండడానికీ, వారిలో భవిష్యత్‌పై ఆశలను పెంచేందుకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత...మహమ్మారి సృష్టిస్తున్న, సృష్టించబోతున్న కల్లోలాన్ని తక్కువ చేసి చూపేలా ఉంది.



ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందంటూ ప్రధాని వ్యక్తం చేసిన ధీమా దానినే సూచిస్తున్నది. రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రతిష్ట పెంపొందించుకోవడానికి యత్నాలు ఈ సమయంలో ఎంత మాత్రం సరికాదు. జనం ఆరోగ్య రక్షణ, కరోనా బాధితులకు సత్వర చికిత్స వంటి విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.


దేశంలో కరోనా పరీక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది.


________________________________________________________________


నియంత్రిత సాగుతో రైతు బాగు 



 


నియంత్రిత సాగు విధానంతో తెలంగాణ వ్యవసయా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేచిందని చెప్పాలి. నియంత్రిత సాగగు అంటే నిర్బంధ సాగు అన్న విపక్షాల విమర్శలలో పస కనిపించడం లేదు. అందుకే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క పిలుపు ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ దాదాపుగా ఈ విధానానికి జై కొట్టారు.


నియంత్రిత సాగు అంటే నిర్బంధ సాగు కాదు..నష్టాలు లేని సాగు విధానం. రైతును నిజంగా రాజును చేసే ప్రణాళికా బద్ధ వ్యవసాయం. డిమాండ్‌ ఉన్న పంటలను, అదీ భూసారాన్ని బట్టి అధికదిగుబడులను ఇచ్చే పంటలనే సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ సూచనలు, సలహాల మేరకు నష్ట భయం దరిదాపులకు రాని వ్యవసాయ విధానం.



ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రైతుల సంతోషం, శ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతుల కోసం, వారి సాగు విధానాల బాగు కోసం స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.


ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో సాగునీటి కొరత లేకుండా చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ ను 24 గంటలూ అందిస్తూ రైతు నష్టాలకు ప్రధాన కారణమైన రెండు సమస్యలను కేసీఆర్‌ సర్కార్‌ పరిష్కరించేసింది. తరువాత కేసీఆర్‌...రైతు ఉత్పత్తుల మార్కెటింగ్‌ పై చూపారు.



సాగు బాగున్నప్పుడు పంటకు డిమాండ్‌ లేకపోవడం, సాగు బాగు లేనప్పుడు పండని పంటకు డిమాండ్‌ పెరగడం వంటి మార్కెట్‌ మాయాజాలం కారణంగా అన్నదాత ఏటా నష్టాలను మూటగట్టుకుంటున్నా పరిస్థితి ఇంత వరకూ ఉంది. పంట నష్టంతో తరువాతి పంట వేసుకోవడానికి ఇబ్బంది పడే రైతన్నకు ఇప్పుడు పంట పెట్టుబడి రూపంలో ముఖ్యమంత్రి పూర్తి సాయం అందిస్తున్నారు.


ఇలా సాగు కష్టాలకు సంబంధించి ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు రైతులు తమ పంటలను తాము నిర్ణయించే ధర లేదా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించేందుకు వీలుగా నియంత్రిత పంట సాగు విధానాన్ని తీసుకువచ్చారు.



నియంత్రిత పంట సాగు అంటే నిర్బంధ సాగు ఎంత మాత్రం కాదు...రైతు తన భూమి సారాన్ని బట్టి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో...సీజన్‌ లో ఏ పంటకు మంచి డిమాండ్‌ ఉంటుందో వ్యవసాయాధికారుల సూచనలు తీసుకుని, వారు సూచించిన పంట సాగు చేయడం.


దీని వల్ల రైతుకు లాభమే తప్ప నష్టపోయే అవకాశం ఉండదు. పంటకు, పంట విక్రయానికీ ప్రభుత్వం పూచీ పడుతుంది. ముందు ముందు వ్యవసాయ రంగం పరిణితి చెందడానికీ, రైతుకు వ్యవసాయం లాభసాటి వ్యాపకంగా మారేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.



మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండాల్సిన అవసరాన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బలోపేతమయ్యేలా వాటిని నిరంతరాయంగా ముడి సరుకు అందే విధంగా, అలాగే రైతు తన పంటను పూర్తిగా విక్రయించేకునే విధంగా ఈ నియంత్రిత సాగు విధానం ఉంటుంది.


రైతు బలోపేతం కావాలన్నా, ఆర్థిక నష్టాల ఊబిలో కూరుకు పోకుండా ఉండాలన్నా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధానాన్ని ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకువచ్చింది. రైతును ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.



ప్రపంచంలో తెలంగాణ వ్యవసాయం ఒక ఆదర్శంగా, ఒక వెూడల్‌ గా మార్చేందుకు ఈ నియంత్రిత సాగు విధానం ఎంతగానో దోహదపడుతుంది. ప్రజలు, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు, వ్యవసాయ వాణిజ్యం ఈ విధానం ద్వారా సాకారమౌతుంది.


అలాగే రైతుకు ఈ విధానం వల్ల నష్టం అన్న భయం ఉండదు సరికదా..రెట్టింపు ఆదాయానికి పూచీ, హామీ, భరోసా ఉంటుంది. ఇదే విషయాన్ని అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిథులు గ్రామ సభల్లో రైతులకు వివరించి చెబుతున్నారు. పంట మార్పిడి వల్ల రైతులకు వెసులుబాటే కాకుండా అధికదిగుబడులు సాధించే అవకాశం కూడా ఉంటుంది.



అదే సమయంలో సస్యరక్షణ వ్యయం చాలా వరకూ తగ్గుతుంది. పండమార్పిడి, నియంత్రిత సాగు వల్ల భూసారం పెరుగుతుంది. తద్వారా పంటలను ఆశించే చీడ పీడల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నియంత్రిత పంటల సాగుతో ప్రభుత్వం వద్ద ఎంత విస్తీర్ణంలో, ఏఏ పంటలున్నాయో స్పష్టమైన లెక్కలు ఉంటాయి.


ఈ ఉత్పత్తులతో నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల పండించిన వారికి అధిక లాభాలు, అదే సమయంలో తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుంది. అంతర్జాతీయంగా మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రధాన పంటలను వేయడం వల్ల రైతు ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుంది.



ఈ విధానం వల్ల ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు గణనీయమైన మార్పు వస్తుంది. ఆ పంటకు సంబంధిచిన అగ్రో ఇండిస్టీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వెలుస్తాయి. దీని వల్ల వ్యవసాయంలో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా, ఇంత కాలం నష్టాల ఊబిలో పడిగిలగిల లాడుతున్న తెలంగాణ రైతు దండిగా ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది.


________________________________________________________________


ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనపై
సుప్రీం ఆగ్రహం  



ఆంధ్ర పద్రేశ్‌ రాష్ట్రంలో సంక్షేమం పేరిట జరుగుతున్న కార్యక్రమాలు ప్రజా మన్ననలు పొదుతున్నా...రాజ్యాంగ మౌలిక సూత్రాలను అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా సంక్షేమం పేరిట ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా అది సుపరిపాలన అనిపించుకోదు.


కేవలం సంక్షేమంతో రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నదన్న ప్రచారం ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టే అవకాశం లేదు. సంక్షేమం, ప్రగతి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాన ప్రాముఖ్యత కలిగిన అంశాలు. అయితే ఏపీలోని జగన్‌ సర్కార్‌ మాత్రం ప్రజాస్వామ్య విలువలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు.



ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలన్నీ దాసోహం అనాలన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. స్వాతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకూ ఒక రాష్ట్ర పభ్రుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ కోర్టులు ఇన్ని సార్లు చురకలు వేయడం జరిగిన దాఖలాలు లేవు.


కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యం చెప్పే కొత్త సంస్కృతి ఇప్పుడు ఏపీలో పురుడు పోసుకుంటున్నది. ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో ఏపీ హైకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం పదే పదే తీవ్ర వ్యాఖ్యలతో తప్పుపడుతున్నా ఏపీ సర్కార్‌ లోచలనం కనిపించడం లేదు.



రాజ్యాంగ ఉల్లంఘనే అని సుప్రీం కోర్టు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడమంటే అది తేలికగా తీసుకోవలసిన అంశం కాదు. గవర్నర్‌ ఆదేశాలు, సూచనలను సైతం ఏపీ సర్కార్‌ ఖాతరు చేయడం లేదు. నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం విధానాల కంటే, వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యం అన్న రీతిలో వ్యవహరిస్తున్నది.


హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా, ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినా కూడా జగన్‌ సర్కార్‌ వైఖరి మారడం లేదు. దీని వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌ పంతాలకు పోయి తనకు తానే హాని చేసుకుంటున్నది.



దీని వల్ల రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పాలన కంటే కోర్టుల చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి అధికారులకు ఎదురౌతున్నది. కరోనావ్యాప్తి రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో ఇంచుమించు సమానంగా కరోనా వ్యాప్తి ఉంది.


దాని కట్టడిపై దృష్టి పెట్టి వ్యాజ్యాల పేర ప్రతిష్టను మసకబార్చుకోవడం జగన్‌ సర్కార్‌కు ఎంత మాత్రం సముచితం కాదు.


________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


 


 


Comments