పడకంటి మనసులో మాట
________________________________________________________________
2015 సంవత్సరం నుంచి ఈ విధాన రూపకల్పన అన్నిదశలలో 2 లక్షలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని, అన్ని అంచెల స్థానిక సంస్థలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖతో సహకరిస్తూ, భాగస్వామ్యం వహించాయని ప్రభుత్వం పేర్కొన్నది. మన గురుకుల విద్య ఎప్పటి నుంచో బాగా ప్రాచుర్యం పొంది ఉన్నందున దానికి అనుగుణంగా ఉంటుందా అన్న చర్చ కూడా సాగాలి. ప్రాంతీయభాషల్లోనే ప్రాథమిక బోధన ఉంటుందని సెలవిచ్చారు. అనేక సబ్జక్టుల అధ్యయనం కూడా సెకండరీ స్థాయిలోనే మొదలవుతుంది.
________________________________________________________________
మార్పు మంచిదే కానీ...
నూతన విద్యావిధానం-2020 ద్వారా విద్యా వ్యవస్థలో చాన్నాళ్లుగా అవసరమైన సంస్కరణలను చేపట్టేం దుకు అవకాశం ఏర్పడిందని, ఇది మున్ముందు లక్షలమంది జీవితాలను అద్భుతంగా ప్రభావితం చేస్తుందని ప్రధాని వెూదీ అన్నారు. నూతన విద్యావిధానానికి కేబినేట్ ఇటీవలే ఆవెూదం తెలిపింది. అయితే ఇలాంటి ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టే ముందు విస్తృతస్థాయిలో చర్చ సాగాలి.
సెమినార్లు నిర్వహించాలి. అధ్యాప కులు, విద్యార్థులు, విద్యారంగ నిపుణులతో సుదరీర్ఘంగా చర్చించాలి. పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించా లి. అపðడే అనుమానాలు నివృత్తి అవుతాయి. అలాగే వివిధ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానంతో సవిూక్షించాలి. నిజానికి విద్యావిధానంలో అభ్యసనం, పరిశోధన, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యం.
నూతన విద్యావిధానం ఉత్తేజపూరిత జ్ఞాన సముపార్జనలోకి దేశాన్ని తీసుకెళుతుందని వెూదీ విశ్లేషించారు. సరళత, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం, అందరికీ అందుబాటులో అనే పునాదులపై నూతన విద్యావిధానం ఉంటుందన్నారు. కొత్త విధానం ద్వారా మన దేశం మరింత మహోజల్వం అవుతుందన్న, సమృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఇది ఎంతమేరకు సత్ఫలితాలు ఇస్తుందన్న దానిపై చర్చించాలి. మన దేశ అవసరాలతో పాటు, ప్రపంచ దేశాల్లో పోటీకి నిలబడగలమా అన్నది కూడా ఆలోచన చేయాలి. ప్రపంచ విద్యారంగాన్ని తట్టుకుని మన విద్యార్థి నిలబడినపðడే అంతర్జాతీయంగా మన విద్యకు ప్రాధాన్యం లేదా డిమాండ్ ఉంటుంది.
ఇక్కడ ఏదో చదివి ఇతర దేశాలకు వెళ్లగానే అంతా కొత్తగా అనిపించేలా ఉంటే విద్‌ఆయర్థి ఒత్తడికి గురి కాగలడు. అందువల్ల కేబినేట్ ఆవెూదించిన విద్యావిధానంపై లోతుగా అధ్యయనం జరగాలి. ఆధునిక భారతనిర్మాణం దిశగా ఇదో మైలురాయి అని బిజెపి నేతలు సహజంగానే ప్రకటించారు. నూతన విద్యావిధానం ద్వారా విద్యావ్యవస్థలో సంస్కరణలకు అవకాశం ఏర్పడిందని అంటున్నారు.
ఈ విధానం యువతలో స్వయం సామర్థ్యాలను, పెంపొందించి.. ఆధునిక భారతం దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు. మరోవైపు నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం అనేది ఏకపక్ష విధానం అని.. భారత విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. నూతన విద్యావిధానాన్ని అవెూదించే క్రమంలో పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవలేదన్నారు.
నిజానికి మన విద్య అంతా మెకాలే సృష్టించిన చట్రంలో ఇమిడి ఉంది. భారతీయత అన్నది లేకుండా చేశారు. ఒకప్పటి పటిష్టమైన గురుకుల విద్యను నాశనం చేశారు. మన గురుకులాలు ఎంతగానో పటిష్టంగా పనిచేశాయి. అంతర్జాయంగా మన నలంద,తక్షశిల లాంటి విద్యాలాయాలు ప్రాచుర్యం పొందాయి. అలాంటి విద్యావిధానాన్ని కూడా సీమక్షించుకోవాల్సి ఉంది.
ఇంకా ట్వింకిల్.. ట్వింకిల్ లిటిల్ స్టార్.....రెయిన్ రెయిన్ గో అవే అన్న ఇంగ్లీష్ తరహా విద్యను వదులు కోవాలి. మన దేశ ఔన్నత్యాన్ని నేటి తరం తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో మార్పులతో ముందుకు సాగాలి. విద్యారంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ పక్షాలు ఈ అంశం విూద మరింతగా మేథోమథనం చేయాలి. నూతన విధానం అమలులోకి రావడానికి అనేక దశలు దాటవలసి వస్తుంది.
ఈ సమయంలో అయినా చర్చ అర్థవంతంగా జరగవలసి ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం 2020, విద్యారంగంలో అనేక పెద్ద మార్పులను వాగ్దానం చేస్తున్నది. ప్రతిపాదించిన మార్పులన్నీ వాంఛనీయమైనవి కావన్న వ్యాఖ్యలు కూడా వినిపి స్తున్నాయి. కస్తూరిరంగన్ కమిటీ నివేదిక రెండేళ్ల కిందటే ప్రభుత్వానికి అందినా, దాన్ని పోయినేడాది పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
అప్పటి నుంచి ఈ ఏడాది కాలంలో ఆ నివేదికపై విస్తృతంగా చర్చ జరిగిందని, ప్రజల నుంచి అనేక సూచనలు అందుకున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అంతే కాదు, 2015 సంవత్సరం నుంచి ఈ విధాన రూపకల్పన అన్నిదశలలో 2 లక్షలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని, అన్ని అంచెల స్థానిక సంస్థలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖతో సహకరిస్తూ, భాగస్వామ్యం వహించాయని ప్రభుత్వం పేర్కొన్నది.
మన గురుకుల విద్య ఎప్పటి నుంచో బాగా ప్రాచుర్యం పొంది ఉన్నందున దానికి అనుగుణంగా ఉంటుందా అన్న చర్చ కూడా సాగాలి. ప్రాంతీయభాషల్లోనే ప్రాథమిక బోధన ఉంటుందని సెలవిచ్చారు. అనేక సబ్జక్టుల అధ్యయనం కూడా సెకండరీ స్థాయిలోనే మొదలవుతుంది.
ఐదవ తరగతి దాకా, వీలయిన చోట్ల, మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరుపుతారు. పరీక్షలు జరిగే తరగతులు, జరిపే విధానం, మూల్యాంకన పద్ధతులు- మొదలయినవన్నీ మారిపోతాయి. ఇందులో ప్రధానంగా ఇంటర్ విద్య పూర్తిగా రద్దు అవుతోంది.
రెండు సంవత్సరాల ప్రాథమిక పూర్వ విద్యతో కలుపుకుని సెకండరీ స్థాయి దాకా పదిహేను సంవత్సరాల విద్య, అనంతరం నాలుగు సంవత్సరాల పట్టభద్రవిద్య, తరువాత ఒకటి లేదా రెండు సంవత్సరాల వ్యవధితో స్నాతకోత్తర కోర్సులు- ఇదీ చదువుల క్రమంగా ఉంటుందని విశ్లేషించారు. పిహెచ్‌డికి ముందు ఎంఫిల్ రద్దు చేశారు.
ఇకపోతే విద్యారంగ ప్రపంచీకరణకు అనుగుణంగా మన దేశంలోని చదువుల పద్ధతులను మార్చుకోవడం లక్ష్యంగా కనిపిస్తుంది. అది ఎంతమేరకు నిజమన్నదో చర్చ జరగాలి.
నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు, క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి స్థాయిని కొలిచే పద్ధతి, కోర్సునుంచి వైదొలగడానికి, పాక్షికంగా మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండడం, మానవీయ, సామాజిక శాస్త్రాల, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల మేళవింపుతో పాఠ్యాంశాల ఎంపిక వంటి ప్రతిపాదనలన్నీ గ్లోబల్ నమూనాకోసం సంకల్పించినవే అని అంటున్నారు.
నూతన విధానం ద్వారా అనేక విదేశీ యూనివర్సిటీలు మనదేశంలో రకరకాల స్థాయిలలో పనిచేయడం సులువు అవుతుంది. బహుశా, భారతీయ యూనివర్సిటీలు కూడా కొన్ని, చిన్న చిన్న దేశాలలో వ్యాపారం చేయడం సాధ్యపడుతుందన్న భావనా ఉంది.
మొత్తంగా సంస్కరణలతో మన విద్యార్థులు ప్రపంచ పోటీకి అనుగుణంగా రాటుదేలితే మంచిదే. అదే క్రమంలో మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మన చరిత్ర కూడా అద్యయనంలో భాగం కావాలి. వక్రీకరించిన మన చరిత్ర పుటలను చించి పారేయాలి. అపðడే సమగ్ర విద్యావిధానంగా గుర్తించవచ్చు.
________________________________________________________________
ఇక సచివాలయ నిర్మాణంపై విమర్శలకు ఫుల్ స్టాప్
కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లుగా నూతన సచివాలయ భవన నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు విస్పష్ట తీర్పుతో సందిగ్ధతకు, ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పడింది. సచివాలయం నేలమట్టం కావడంతో ఇక అధునాత తెలంగాణ సచివాలయం ఆవిర్భవించబోతున్నది.
ఓ ఏడాదిలో ఓ అద్భుత సచివాలయం చూడబోతాం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సకలహంగులతో సచివాయ నిర్మాణం జరుగనుంది. సచివాలయం అన్నది కార్యాలయాలకు కేంద్ర బిందువు లాంటిది. అక్కడ కూల్చివేతలపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగినా చివరకు ప్రబుత్వానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి.
అక్కడ నిధినక్షేపాలు ఉన్నాయన్న ఆరోపణలు చేసిన వారు గతంలో ఎందుకు చేయలేదో తెలియదు. నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో హుస్సీఏన్ సాగర్ తీరాన మరో అద్భుత కట్టడం రావడం తెలంగాణ వారికి నిజంగానే అదృష్టంగా భావించాలి.
ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను సమర్థ వంతంగా నిర్వహించిన సచివాలయం నేడు నేలమట్టం అవుతోందని చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి పాత సచివాలయంలో విసిరేసినట్లుగా భవనాలు ఉండేవి. కొత్త వాటిలో కూడా వసతులు సరిగా ఉండేవి కావు. ఇవన్నీ నేతలకు తెలుసు.
ఇకపోతే ఎప్పటికపðడు ఇక తమదే అధికారం అని చెపðకుంటున్న కాంగ్రెస్, బిజెపి నేతలకు కొత్త సచివాలయం వస్తే ఆనందించాలి తప్ప ఆక్రోశం వెళ్లగక్కరాదు. సువిశాలమైన భవనాలు, రాష్ట్రంలో ఏ మూలకైనా పరిపాలన వ్యవహారాలు సవిూక్షించగలిగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగివున్న సచివాలయంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు అవకాశం రావాలని అంతా కోరుకోవాలి.
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరడం వల్ల వృదా ప్రయాస,ఖర్చు తగ్గుందన్నది నిర్వివాదాంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయిన కార్యాలయాల సమూహం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేం దుకు సరిపోదా అని చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి అలాంటి అవకాశం లేదు. సచివాలయం ఒక చోట ఉంటే అధికారుల కార్యాలయాలు మరోచోటు ఉన్నాయని తెలుసు కోవాలి. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా అనేక అద్బుతాలు సాధించి ముందుకు సాగుతున్నది. సచివాలయం, అసెంబ్లీ, ఇతర రాష్ట్ర కార్యాలయాలు అన్నీ ఉన్నా వసతుల విషయంలో లోటుపాట్లు తప్ప లేదు.
అన్ని సౌకర్యాలు, హంగులు ఉన్నప్పటికీ, సీఎంగా ప్రమాణం చేసిన నాటినుంచి సచివాలయానికే రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు అని వితండ వాదనలు చేస్తూనే ఉన్నారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్న కొత్త సచివాలయంతో ప్రజలకు కూడా మేలు జరుగనుంది. సచివాలయం లోకి అడుగుపెడితే తమ పనులు చక్కదిద్దుకునే అవకాశం వస్తుంది.
ఎన్నో రాష్ట్రాల్లో చెక్క బల్లల విూద పాలన సాగుతోందని, పరిపాలన విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారే తప్ప రంగులద్దిన అద్దాల మేడలు చూసి కాదని పెద్దలు గ్రహించాలని సహజంగానే కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఇలాంటి వాదనలు చేస్తున్న వారు తమ ఇళ్లు మాత్రం అద్దాల మేడాల్లా ఉండాలని కలలు కంటారు. అందుకు అనువుగా డబ్బు సంపాదనలో పడతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వైఎస్ హయాంలో నిర్మించిన కొత్త ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ఉండగా, వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి కొత్తగా ప్రగతి భవన్ నిర్మించిన విషయాన్‌ఇన ప్రతిసారీ ప్రదిపాదిస్తున్నారు.
ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేట్ దవాఖానలో బెడ్లు దొరకడంలేదని, కాళ్ళా వేళ్ళా పడి ఒక బెడ్ సాధిస్తే, లక్షల రూపాయల బిల్లులు కట్టాల్సిన దుస్థితి ఉందన్న వాదనలో విపక్షాలు ఉన్నాయి. ఇక గాంధీ, ఉస్మానియా, ఛాతీ దావాఖానలో రోగుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సచివాలయం విషయం వేరు.
ఆస్పత్రుల విషయం వేరు. వాటిని బాగు చేయడం కోసం పోరాడాల్సిందే. కొత్త సచివాలయ నిర్మాణం ఆలోచనను విరమించుకోవాలన్నది పక్న పెట్టి ఆస్పత్రులను బాగు చేయాలన్న నినాదం బయలుదేరాలి. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పాటుపడాలంటున్న వారు గతంలో తాము చేసిన పాపాలకు లెక్కలు చెప్పాలి. నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేయాలన్న వారు గతంలో ఎందుకు చేయలేదో చెప్పాలి.
________________________________________________________________
ఏపీ సర్కార్ పంతంతోరాష్ట్రప్రగతికి అవరోధమేనా
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. మొండి పట్టుదల వినా..రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ పేరిట జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం వెనుక హేతుబద్ధమైన కారణం కనిపించదు.
రాజధాని అన్నది ఒక రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, సంస్కృతికి అద్దంలా భాసిల్లాలే తప్ప...ప్రాంతాల వారీ అభివృద్ధికి ఒకే రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో రాజధానులు ఉండటమే అభివృద్ధికి తార్కానం, అవకాశం అనడంలో హేతువు కనిపించదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో కూడా విశాఖ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందన్నది తెలియంది కాదు.
అలాగే విజయవాడ, గుంటూరు నగరాలూ అభివృద్ధి చెందాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, పాలకొల్లు...ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రాంతంలో నగరాలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు రాజధానిని మూడు ముక్కలు చేయడం వల్లనే పురోగతి సాధ్యమంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా సర్కార్ కొత్త పల్లవి, పాట ఎత్తుకోవడం వెనుక రాజకీయ వైరం తప్ప మరో కారణం కనిపించదు.
నిర్మాణం పూర్తి కాక ముందే విభజిత రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఒక గుర్తింపు దక్కింది. బ్రాండ్ ఇమేజ్ సంతరించుకుంది. దానిని కొనసాగించడం వల్ల వైకాపాకు ఇబ్బంది ఏమిటన్నది అవగతం కాదు.
ఎన్నికల సమయంలో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని విస్పష్టంగా చెప్పిన వైకాపా అధినేత జగన్...అధికారంలోకి రాగానే ఆ మాటలోని అంతరార్థాన్ని మార్చేశారు. అమరావతి కూడా రాజధానే...అయితే విశాఖ, కర్నూలులు కూడా రాజధానులే అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
రాజధాని వికేంద్రీకరణ వల్ల నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుంది. ప్రభుత్వాధికారులు రాజధానుల మధ్య పర్యటనలకే తమ సమయం అంతా వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇక జనం కూడా పనుల నిమిత్తం సుదూర తీరాలకు తిరగాల్సి ఉంటుంది.
ఇంతా చేసి పారిశ్రామికంగా ఒనగూరే ప్రయోజనం కూడాపెద్దగా ఉండదు. ఇప్పటికే అమరావతి కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలు వెనక్కు మళ్లారు.ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటుందన్న ఆశలు రేకెత్తించిన మంగళగిరి ఇప్పుడు వెలవెలబోతున్నది.
అద్భుత న్యాయ సౌధంగా నిర్మితమైన హైకోర్టు భవనం కోర్టు అక్కడ నుంచి కర్నూలుకు తరలిపోవడం వల్ల నిరుపయోగంగా మారుతుంది. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని కావాలన్న ఆశయంతో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తమ భూములు అప్పగించిన రైతులకు నిరాశే మిగులు తుంది.
అపారమైన అబివృద్ధికి ఆస్కారమున్న అమరావతి గ్రామాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. జరుగుతున్న అభివృద్ధిని ఆపేసి...అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా విశాఖ ప్రగతి గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. విశాఖ రాజధాని అయినా కాకున్నా అభివృద్ధికి ఢోకా లేదు.
కానీ విశాఖను పాలనా రాజధాని చేయడం వల్ల సీమ ప్రాంతం నుంచి జనం అక్కడకు వెల్లడం దూరాభారమే కాకుండా వ్యయ ప్రయాసలకులోను కావలసి ఉంటుంది. అదే అమరావతి అయితే రాష్ట్రం మధ్యలో ఉండటమే కాకుండా ట్రాన్స్‌పోర్టుకు కూడా వెసులు బాటుగా ఉంటుంది.
ఈ వెసులు బాట్లన్నీ కాదని రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయడమంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడమే అవుతుందన్నది నిపుణుల అభిప్రాయం. పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదల కంటే ప్రజలకు ఏది ప్రయోజనం అన్న కోణంలో ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంటుంది.
అయినా ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని తిరగదోడడమే ఎజెండాగా ముందుకు వెళితే రేపు మరో ప్రభుత్వం వస్తే అదే పని చేయదా ఇది సమంజసమేనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవిసరం ఉంది.
________________________________________________________________
For more updates:
Follow us on Facebook
Join our Facebook group
News 9 Telugu Daily Public Group
Follow us on Instagram: