పడకంటి మనసులో మాట 09.08.2020


పడకంటి మనసులో మాట ...


________________________________________________________________


వెూడీది డిప్లమసీ కాదు, హగ్లమసీ అంటూ విమర్శలు గుప్పించిన విపక్షాలు ఒక దాని వెంట ఒకటిగా భారత్‌ అంతర్జాతీయ వేదికలపై సాధిస్తున్న విజయాలకూ, కూడగట్టగలుగుతున్న మద్దతుకూ మౌనం వహించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు కానీ, దేశ భదత్రా, రక్షణ విషయానికి వచ్చే సరికి రాజకీయ విభేదాలు, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భారత జాతి ఒక్కటిగా నిలబడుతుంది. ఇది భారత డీఎన్‌ఏలోనే ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.


________________________________________________________________


వెూడీ దౌత్య విజయాలు



వెూడీ హయాంలో భారత దౌత్య విధానం కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ...పొరుగు దేశాల కుయుక్తులను ఎంగడగట్టడంలో గతంలో ఎన్నడూ లేనంతగా విజయాలను నవెూదు చేసింది. ఉగ్ర మద్దతు విషయంలో పాకిస్థాన్‌, సరిహద్దులో అలవిమాలిన దూకుడు ప్రదర్శిస్తున్న చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత విజయాలు వెూడీ విధానాల పుణ్యమేనని చెప్పడంలో సందేహానికి తావులేదు.


వెూడీది డిప్లమసీ కాదు, హగ్లమసీ అంటూ విమర్శలు గుప్పించిన విపక్షాలు ఒక దాని వెంట ఒకటిగా భారత్‌ అంతర్జాతీయ వేదికలపై సాధిస్తున్న విజయాలకూ, కూడగట్టగలుగుతున్న మద్దతుకూ మౌనం వహించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.



దేశంలో పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు కానీ, దేశ భదత్రా, రక్షణ విషయానికి వచ్చే సరికి రాజకీయ విభేదాలు, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భారత జాతి ఒక్కటిగా నిలబడుతుంది. ఇది భారత డీఎన్‌ఏలోనే ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. భారత వ్యతిరేకతే ఊపిరిగా పాకిస్థాన్‌ లో పాలక వర్గాలు ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు తెలియనివి కావు.


కార్గిల్‌ యుద్ధం నుంచి దేశంలో ఉగ్రదాడుల వరకూ ఆ దేశం భారత్‌ కు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి మద్దతు లేకుండా చేయడంలో వెూడీ దౌత్య నీతని ఎంతగా శ్లాఘించినా తక్కువే అని చెప్పవచ్చు.



ఇక చైనా అంతర్జాతీయంగా అమెరికా తరువాత అంతటి ఆర్థిక శక్తిగా గుర్తింపు పొందిన చైనా భారత సరిహద్దులతో అలవిమాలిన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆక్రమణలకు దిగితే...ఆ దేశానికి దీటుగా సమాధానమిస్తూనే...చైనా దురాక్రమణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో వెూడీ సర్కార్‌ అపూర్వ విజయం సాధించింది.


అంతర్జాతీయ సమాజంలో ఏకాకి ఔతామన్న కారణంగా చైనా తన దూకుడును తగ్గించుకుని వెనక్కు మళ్లక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది.చైనా యాప్‌ లను నిషేధిస్తూ వెూడీ తీసుకున్న నిర్ణయానికి యావత్‌ ప్రపంచం మద్దతు పలికింది. అంతే కాకుండా భారత్‌ బాటలోనే నడిచేందుకు అగ్రదేశం సహా పలు దేశాలుసమాయత్తమౌతున్నాయి.



భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వం దక్కకుండా అడ్డుకునేందుకు చైనా విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడానికీ, దాదాపు ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా, దన్నుగా నిలవడానికి వెూడీ దౌత్య పరమైన విధానాలే కారణం.
ఇక తాజాగా భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత దేశ దౌత్యపరమైన ఒత్తిడికి పాకిస్థాన్‌ తలొగ్గక తప్పని పరిస్థితి ఎదురైంది.


జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునఃసవిూక్షకు అవకాశం కల్పిస్తూ విస్తృత ధర్మాసనాన్ని ఇస్లామాబాద్‌ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అథర్‌ మినల్లా, జస్టిస్‌ అమిర్‌ ఫరూఖ్‌, జస్టిస్‌ మియాన్‌ గుల్‌ హసన్‌ ఔరంగజేబ్‌లతో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు పాకిస్థాన్‌ విూడియా తెలిపింది.



ఈ కేసుపై సెప్టెంబరు 3న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
కుల్‌భూషణ్‌ జాదవ్‌తో మాట్లాడేందుకు, న్యాయ సహాయం అందజేసేందుకు అవసరమైన కాన్సులర్‌ యాక్సెస్‌ను భారత దేశానికి ఇవ్వాలని పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే.


మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం మాత్రం తాము జాదవ్‌ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించే విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అంతకుముందు, పాకిస్థాన్‌ విూడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో తమ వైఖరిని తెలియ జేసేందుకు భారత ప్రభుత్వానికి ఓ అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది.



జాదవ్‌ను 2016లో బలూచిస్థాన్‌లో పాకిస్థాన్‌ దళాలు అక్రమంగా అరెస్టు చేశాయి. ఆయన ఉగ్రవాదం, గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాయి. అనంతరం పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు ఆయనకు 2017లో మరణ శిక్ష విధించింది. దీనిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించింది.


గత ఏడాది జూలైలో ఐసీజే తీర్పు చెబుతూ, జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పునఃసవిూక్షించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘించిందని తెలిపింది.


ఇక అలాగే పాక చెరలో చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ ను స్వదేశానికి రప్పించడంలో కూడా వెూడీ అనుసరించిన వ్యూహం, పాకిస్థాన్‌ పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెంచడంలో చూపిన వేగం, చొరవకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.


________________________________________________________________


పాలనాసౌధం నిర్మాణానికి తొలగిన అడ్డంకులు 



సచివాలయం నిర్మాణం తప్పదని తేలిపోయింది. గతంలో లాగా అక్కడా ఇక్కాడ అన్న సందేహాలకు తావులేకుండా ఉన్నచోటనే కొత్తదానిని కట్టాలన్న ధృడసంకల్పంతో ప్రభుత్వం ఉంది. పాతసచివాలయం కూల్చివేత దాదాపు పూర్తయ్యింది. కొత్త సచివాలయ నిర్మాణానికి 400 కోట్లు కూడా కేటాయించారు.


టెక్నికల్‌ కమిటీ కూడా నివేదిక సమర్పించింది. అలాగే మంత్రివర్గం నివేదికను ఆవెూదించింది. నమూనాను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ఓకే చెప్పేశారు. త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. ఓ ఏడాదిలోగా సచివాలయం సాకారం కానుంది. బహుశా ఈ నెలలోనే పనులు ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి.



కొత్తగా సచివాలయాన్ని నిర్మిం చాలన్న విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. హైకోర్టులో ప్రస్తుత సచివాలయం కూల్చివేతపై వాదనలు సాగాయి. దానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వచ్చింది. దీనిని ఆపేందుకు చివరి వరకు యత్నించిన విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిందనే అనుకోవాలి. పాత సచివాలయం సమస్యల మయంగా ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.


ఉమ్మడి రాష్ట్రంలో కూడా పలుమార్లు సచివాలయం మార్పు ప్రస్తావన వచ్చింది.అయితే కేవలం రాజకీయ కారణాలతోనే విపక్షాలు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తూ వచ్చాయి. అయితే కేసీఆర్‌ పట్టుదల, కృతనిశ్చయం ముందు విపక్షాల విమర్శలు, సవాళ్లు చెల్లఉబాటు కాలేదు.



పురాతన భవనాలు కూల్చవద్దంటూ పిటిషన్లు వేశారు. ఇకపోతే బైసన్‌పోలో స్థలాన్ని రాష్ట్రానికి ఇవ్వడానికి అప్పట్లో కేంద్రం అంగీకరించిందని వార్తలు రావడంతో అక్కడ అధునాతన సచివాలయం నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్దం అయ్యింది. అది కాదని తేలడంతో ఇపðడు ఉన్న సచివాలయంలోనే నిర్మాణానికి ప్రభుత్వం సిద్దం అవ్వడమే గాకుండా సచివాయల కార్యాలయాలను బిఆర్కె భవన్‌కు తరలించింది.


నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే నమూనాను కూడా సిద్దం చేశారు. దీంతో త్వరలోనే ఇక్కడ సచివాలయం అధునాతన హంగులతో నిర్మితం కానుంది. హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఉన్న ప్రస్తుత సచివా లయం సౌకర్యంగా లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే సిఎం కెసిఆర్‌ ప్రకటించారు.



పలు స్థలాలను అన్వేషించారు. సచివాలయంతో పాటు అసెంబ్లీని కూడా నిర్మించాలని యోచించారు. ఈ మేరకుఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉన్న స్థలాన్ని కూడా నిర్ణయించారు. చివరకు రక్షణశాఖ ఆధీనంలో ఉన్న బైసన్‌ పోలో స్థలాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించారు.


ఈ దశలో కాంగ్రెస్‌, టిడిపి, వామపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకించడంతో రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. ఒక క్యాంప్‌ ఆఫీసు ఉండగా మరో క్యాంప్‌ ఆఫీస్‌, ఒక సెక్రటేరియట్‌ ఉండగా..మరో సెక్రటేరియట్‌ నిర్మించి ఇలా కోట్ల రూపాయల ప్రజాధనం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్న వైనం తగదని విమర్శలకు పదను పెట్టారు.



ప్రజాధనం వృధా చేయడం తగదని ఆందోళనకు దిగారు. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీని నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బుకు కష్టోడియన్‌ గా ఉండాల్సిన సర్కార్‌ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ ముందుకు సాగుతోందని మండిపడుతున్నారు.



ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రుల క్వార్టర్లను పడగొట్టి సీఎం నివాసం..క్యాంప్‌ ఆఫీస్‌ కట్టారు. అప్పట్లో దీనిపైనా విమర్శలు వచ్చాయి. ఆనాడు టిడిపి దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి వైఎస్‌ ఆనాడు వివరణ ఇస్తూ ఇది తన సొంత నివాసంకాదని,ఏ సీఎం వచ్చినా క్యాంపు కార్యాలయం అన్నది అధికారిక నివాసంగా ఉండాలన్న యోచనతో నిర్మించామని అన్నారు.



సీఎంకు అధికారిక నివాసం..క్యాంప్‌ ఆఫీస్‌ అవసరం అని చెప్పారు. ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణం నిర్ణయం కూడా అలాంటిదే. సచివాలయం అన్నది ప్రస్తుత సీఎం కేసీఆర్‌ సొంత భవనం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...పాలనా సౌధంగా ఇప్పుడు నిర్మితమౌతున్న భవన సముదాయాన్నే వాడుకుంటుంది.



పైగా పాత సచివాలయం యథాతథంగా వినియోగించేందుకు ఎంత మాత్రం అనువుగా లేదనీ, ఫైర్‌ సేఫ్టీ లేదనీ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుత సచివాలయం యధాతథంగా పనికిరాదన్నది టెక్నికల్‌ కమిటీ విస్పష్టంగా తేల్చేసిన అంశం. అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకున్న తరువాత కోర్టు కూడా అనుకూలంగా తీర్ప ఇవ్వడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి.



పాత సచివాలయ భవనాల కింద నిజాం నిధులున్నాయనీ, వాటి కోసమే కేసీఆర్‌ కూల్చివేతలకు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు హాస్యాస్పదమే కాకుండా, న్యాయ సమీక్షకు నిలవవు. ఊహాజనిత వ్యాజ్యాలను విచారించలేమని హైకోర్టు విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఇప్పటికైనా విపక్షాలు ఈ విషయంలో విమర్శలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టడం మంచిది.


________________________________________________________________


రాజధాని లేకుండా పాలన ఎలా 



అమరావతిలో రాజధానిని కొనసాగించనపðడు... భూములిచ్చి రోడ్డున పడ్డ రైతుల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం ఎలా తీరుస్తుందని టిడిపి సహా లెఫ్ట్‌ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాజధానిని మార్చాలన్న నిర్ణయం ఖర్చుతో కూడుకున్నది అయినా కావాలనే రచ్చ చేస్తున్నారని మండిపడుతున్నాయి.


వేల కోట్లు పరిహారంగా చెల్లించి ఇవ్వడం..రాజధానిని తరలించడం అవసరామా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కనీసం పేదలకు పింఛను ఇవ్వలేక, ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్న సర్కారు.. ఇంత భారీ మొత్తం ఎక్కడ నుంచి తీసుకొస్తుందని అంటున్నారు.



రాజధాని కోసమే అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి ఎంతో త్యాగం చేశారన్నారు. ప్రభుత్వం ఇపðడు మాటతప్పి అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని వేరే చోటకు తరలిస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.


అమరావతే రాజధానిగా ఉంటుందని భావించిన అనేక మంది చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు కూడా ఆ చుట్టుపక్కల ఇంటి స్థలాలను, చిన్నచిన్నప్లాట్లు కొనుగోలు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధానిని వేరే చోటకు తరలించడం ఎంతవరకు సబబనికూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.


మరోవైపు తరలింపుపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. ఇదిలావుంటే సెలెక్ట కమిటీ ఏర్పాటు కాలేదన్న స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను శాసనమండలి పరిశీలించే అవకాశం ఉంది. రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో మండలికి కూడా అధికారాలు ఉంటాయి.


ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులపై మండలి నిలదీస్తుంది. అభ్యంతరాలు తెలుపుతుంది. దీనిని ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అడ్డుకోజాలరు. మండలిలో పెత్తనం చెల్లుబాటు కావడం లేదని దానిని ఏకంగా రద్దు చేయాలను కోవడం అధికార దురహంకారమే అవుతుంది తప్ప మరొకటి కాదు.



అయితూ రాజధాని వికేంద్రీకరణ అన్నది ముఖ్యమంత్రి స్వీయ వ్యవహారం కాదు. న్యాయ రాజధాని కర్నూలు అంటున్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించడం..ప్రభుత్వ నిర్ణయంతో జరిగిపోతుందా రాజధాని వికేంద్రీకరణపై కోర్టు విచారణ చేస్తుండగానే ముహూర్తాలు నిర్ణయించేసి కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోవడం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది.


ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు విషయంలో ప్రభుత్వ ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. మొండిగా ముందుకు పోయి...కోర్టు తీర్పును, గవర్నర్‌ ఉత్తర్వులనూ కూడా ఖాతరు చేయని ఫలితం సుప్రీం విస్పష్ట ఆదేశాలు.
సుప్రీం మొట్టికాయలతో సీఈసీగా నిమ్మగడ్డను పునర్నియమించాల్సిన అనివార్య పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంది.



రాజ్యాంగ బద్ధమైన ఎస్‌ఈసీ పదవి ప్రభుత్వ నిర్వాకం కారణంగా కొన్ని నెలల పాటు ఖాళీగా ఉంది. ఇప్పుడు రోజధాని తరలింపు విషయంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే కార్యాలయాల తరలింపు.


వికేంద్రీకరణ ఆచరణకు ముహూర్తాలూ నిర్ణయించేస్తే తీర్పు జాప్యం అయితే ప్రతికూలంగా వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది. రాజధాని లేకుండానే పాలన సాగిస్తుందా మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం హేతువుకు కాకుండా పంతానికి, విపక్షంపై కక్ష సాధింపుకీ అనుగుణంగా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.



ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని విస్పష్టంగా చెప్నిన వైకాపా అధినేత..అధికారంలోనికి రాగానే ముఖ్యమంత్రి హౌదాలో ఆ మాటను విస్మరించడం సరికాదు.


________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments