పడకంటి మనసులో మాట 20.09.2020


పడకంటి మనసులో మాట ...


_________________________________________________________


అధిక ధరల పేరు చెప్పి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం...వినియోగదారులకు అందుబాటు ధరలో ఉల్లి అందజేస్తామని ఔమాత్రం చెప్పడం లేదు. దీని వల్ల రైతుకూ, వినియోగదారుడికీ ప్రయోజనం లేకపోగా, రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఉల్లికి మద్దతు ధర ప్రకటించి...ఆ ధరకు మార్కెట్‌ లో వ్యాపారులు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేంద్రం ఇప్పుడు అనుసరిస్తున్న విధానం వ్యాపారులు లాభాలు దండుకోవడానికీ, రైతుకు, వినియోగదారుడికి కష్టాలూ, కన్నీళ్లు మిగల్చడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడదు.


___________________________________________________________


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనంఎవరికి ఏటా ఉల్లి ఘాటు రైతులను, వినియోగదారులనూ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. అయినా ఉల్లి నిల్వ, కొరత నివారణ, ధరల పెరుగుదలను అదుపు చేయడం వంటి విషయాల్లో కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమౌతూనే ఉన్నాయి.


విఫలమవ్వడమే కాదు... వినియోగదారులకు కష్టం కలగకుండా ఉండేదుకేనని చెబుతూ, తీసుకుంటున్న చర్యలు అంతిమంగా బడా వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. ఉదాహరణకు తాజాగా వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు ఉల్లి ఎగుమతులను నిషేధించి నట్లు కేంద్రం ఘనంగా ప్రకటించింది.ఈ నెల 14వ తేదీ నుంచి ఉల్లి ఎగుమతుల నిషేధం అమలులోనికి వచ్చింది. కానీ దాని వల్ల వినియోగదారుడికి వీసమెత్తు ప్రయోజనం కూడా కలుగలేదు. ధరలు యథావిథిగా కొండెక్కి కూర్చున్నాయి.ఆరుగాలం శ్రమించి ఉల్లి రైతు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో కుదేలయ్యాడు.


వినియోగదారుడికీ, రైతుకీ కూడా ప్రయోజనం లేని ఉల్లి ఎగుమతుల వల్ల లబ్ధి ఎవరికన్న ప్రశ్నకు కేంద్రం బదులివ్వకపోయినా... ఆ చర్య వల్ల ప్రయోజనం పొందినది, పొందేదీ బడా వ్యాపారులేనన్నది ఎంత మాత్రం రహస్యం కాదు. ఉల్లి దాదాపుగా ఒక నిత్యావసర వస్తువే. సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ ఆహారంలో నిత్యం ఉల్లి ఉండాల్సిందే.అటువంటి ఉల్లి విషయంలో రైతుకూ, వినియోగదారుడికి ఏమాత్రం ఉపయోగపడని చర్యలతో ఎందుకు ముందుకు సాగుతున్నదన్న ప్రశ్నకు బదులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఉల్లి కష్టాలు ఏటా పునరావ తమౌతున్నా ...కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయే తప్ప ఉల్లి రైతులను ప్రోత్సహించడానికి, ఉల్లి కొరత ఏర్పడకుండా నిల్వలు పెంచడానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.తాజా పరిస్థితినే తీసుకుంటే..అధిక ధరల పేరు చెప్పి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం...వినియోగదారులకు అందుబాటు ధరలో ఉల్లి అందజేస్తామని
ఔమాత్రం చెప్పడం లేదు. దీని వల్ల రైతుకూ, వినియోగదారుడికీ ప్రయోజనం లేకపోగా, రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది.


ఉల్లికి మద్దతు ధర ప్రకటించి...ఆ ధరకు మార్కెట్‌ లో వ్యాపారులు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేంద్రం ఇప్పుడు అనుసరిస్తున్న విధానం వ్యాపారులు లాభాలు దండుకోవడానికీ, రైతుకు, వినియోగదారుడికి కష్టాలూ, కన్నీళ్లు మిగల్చడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడదు.వెూడీ సర్కార్‌ సంపన్న వర్గాల కొమ్ము కాసే విధానాలను అవలంబిస్తున్నదన్న విపక్షాల విమర్శలకు తాజాగా ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మరో ఉదాహరణగా చెప్పవచ్చు.


ఆమ్‌ ఆద్మీని విస్మరించి సూటు బూటు వర్గాల కోసమే కేంద్రంలోని వెూడీ సర్కార్‌ పని చేస్తున్నదని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఇప్పుడు సామాన్య జనం గుర్తు చేసుకుంటున్నారంటే అది వారి తప్పు ఎంత మాత్రం కాదు.ఉల్లి ఎగుమతుల నిషేధం వల్ల ఇటు రైతు, అటు సామాన్య వినియోగదారుడూ విలవిలలాడుతున్నారు.ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కేవలం బడా వ్యాపారులకే తప్ప మరొకరికి కాదు.


________________________________________________________________


కేసీఆర్‌ చాణక్యం కేటీఆర్‌ కార్యాచరణమున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ లాంటి మహానగరాలకు ఎన్నికలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌,ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ తరచూ సవిూక్షలతో అభివృద్ది కార్యక్రమాలను విశ్లేషిస్తూ వ్యూహాత్మకంగా సాగుతున్నారు.


ప్రధానంగా చర్చలన్నీ డబుల్‌ బెడ్రూంలు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. డబుల్‌ ఇళ్లతో పేదలకు గూడు కల్పిస్తామని చెప్పిన నేతలు ఇపðడు లక్ష ఇళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పడం వెనక మతలబు ఇదే. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇళ్లు బోగస్‌ అని ప్రచారం చేయాలనుకుంటోంది. ఈ కోవలోనే మంత్రి తలసాని, భట్టిల పర్యటన సాగింది.మొత్తంగా గ్రేటర్‌లో రాజకీయాలు డబుల్‌ ఇళ్ల చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలపై అధికార పార్టీ
నేతలు గత కొన్ని రోజులుగా పలు దఫాలు హైదరాబాద్‌లో చర్చించారు. పలు దఫాలు సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొని మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు.


మున్సిపల్‌ ఎన్నికలు ఎపðడు జరిగినా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా చర్చలు జరిపారు. సీ ఎం కేసీఆర్‌ ఆదేశించిన విధంగా మున్సి పాలిటీలపైనా వీరు చర్చించారు. రిజర్వేషన్‌లు ప్రకటించి నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే రంగంలోకి దిగే విధంగా ఈ చర్చలను సాగిస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు.అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అత్యధిక సీట్లను కై వశం చేసుకున్నందున మొత్తం మున్సిపాలిటీలను గెలిపించు కునే విధంగా చూడాలని సీఎం ఆదేశించడంతో వీరు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు


. రిజర్వే షన్‌లను ప్రకటించిన వెంటనే అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్దాలు చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మెజారిటీ వార్డులు కైవశం చేసుకునే విధంగా నేతలతో చర్చిస్తున్నారు. కొత్తవారికి సైతం ఈ దఫా అ వకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మెజారిటీ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నారు.నోటిఫికేషన్‌ రాగానే బరిలోకి దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సన్నాహకంగా ముందస్తుగా నేతలు చర్చించి, మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని మున్సి పాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రతిపక్షపార్టీల నేతలు లేరు.


మున్సిపాలిటీల గెలుపు బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. ఇకపోతే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల విూద రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్‌ పెట్టినట్టు చెబుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అయినట్టు తెలుస్తోంది.అలానే ఎన్నికల నిర్వహణ పై సవిూక్ష నిర్వహించినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులపై ఈ సవిూక్షలో చర్చించి నట్టు చెబుతున్నారు. గ్రేటర్‌ అధికారులకు టైనింగ్‌ కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించి నట్టు చెబుతున్నారు.


ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతిక సహకారంతో సాంకేతికత ను ఎక్కువగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.. గత ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు.కోవిడ్‌ నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన గైడ్‌ లైన్స్‌ పాటించాలని, అయితే బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా, లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనే దాని విూద నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ లో 8 వందలకు మించకుండా ఓటర్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు.


________________________________________________________________


జనం కరోనా కష్టాలకు సమాధానం ఇదేనాఏపీలో సర్కార్‌ ఒక చేత్తో సంక్షేమం రెండో చేత్తో బాదుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కరోనా కాలంలో ఉపాధికోల్పోయి ఇబ్బందులు పడుతున్న జనానికి వరుస వడ్డింపులతో నడ్డి విరుస్తున్నది. సంక్షేమంలో దేశంలోనే మరే రాష్ట్రం చేయని విధంగా చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటూనే..జనం జేబులను గుల్ల చేసే విధంగా అదనపు భారాన్నివడ్డిస్తున్నది.


అదేమంటే నవరత్నాలున్నాయిగా అని సమాధానం చెబుతున్నది. కేంద్రం కష్ట కాలంలో సామాన్యుల బతుకు భారం అయ్యేవిధంగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతుంటే...తానేం తక్కువ తినలేదన్నట్లు ఏపీలోని వైకాపా సర్కార్‌ ఇసుక ధరలను పెంచింది. ఈ పెంపులన్నీ అంతిమంగా సామాన్యుడికే భారంగా మారుతున్నాయి.ఈ వడ్డింపుల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. కరోనా మహమ్మారి ఉపాధిని లాగేసుకుంది. ఇక ఇసుక ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో నిర్మాణ రంగం కుదేలైంది. నిర్మాణ పనులు నిలిచిపోయి..లక్షలాది భవన నిర్మాణ కార్మికుల బతుకులు రోడ్లపాలయ్యాయి.


కరోనా మహమ్మారి విజ ంభణ నేపథ్యంలో పాఠశాలలు, సినిమా థియోటర్లు, జిమ్‌ లు మూతపడటంతో వాటిల్లో పని చేసే వారూ పూడగడవక పస్తులుండే పరిస్థితికి వచ్చారు. టీచర్లు బతుకు తెరువు కోసం కూలిపనులు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి.ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారెవరికీ గత ఐదున్నర నెలలుగా పూర్తి జీతం రాలేదు. ఈ పరిస్థితుల్లో జనం ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ప్రణాళికలు రచించాల్సిన సర్కార్‌...ఖజానా నింపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నది.ఆఖరికి చెత్త సేకరణ పేరిట సెస్సు వసూలు చేయడానికి సిద్ధ పడింది. బార్లను బార్లా తెరిచి కరోనా సెస్‌ పేర వసూళ్లకు తెగబడుతోంది.


ఇప్పుడిక ఆస్తి పన్ను పెంచేందుకు సమాయత్తమౌతున్నది. భారీ వరదలతో ఆస్తి, పంట నష్టాలకు ఇప్పటి వరకూ పరిహారం కూడా అందలేదు. అన్నిటికీ ఒకే మంత్రం జపిస్తున్న సర్కార్‌ నవరత్నాల అమలును ఘనంగా చెప్పుకుంటున్నది.అభివ ద్ధి, పారిశ్రామికీకరణను పూర్తిగా విస్మరించి, పన్నులు సెస్సుల పేర సామాన్య జనం నడ్డివిరిగేలా భారంవెూపుతూ సంక్షేమం పాట పడుతున్న సర్కార్‌ పథకాల పేరిట కొంత సొమ్ములబ్ధిదారుల ఖాతాలో వేసి జనం కష్టాలన్నీతీర్చేశామని నమ్మమంటున్నది. దేశంలోనే కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రంగా నిలిచిన ఏఫీ...కరోనా


కట్టడి చర్యలను గాలికొదిలేసింది. సంక్షేమం పేరు చెబుతూ రాష్ట్రాన్ని సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తున్నది .


________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments