పడకంటి మనసులో మాట 27.09.2020


పడకంటి మనసులో మాట ...


 


_________________________________________________________


దీని వల్ల వాస్తవంగా లాభపడేది కామందులనబడే భూస్వాములు, లేదా పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు మాత్రమే. ఇక రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్కెట్‌ యార్డుల ద్వారా వచ్చే సెస్‌ రాదు. ఆ మేరకు ఆదాయాన్ని అవి కోల్పోతాయి. రైతుకు సరైన ధర రానప్పుడు ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీస మద్దతు ధర ఇచచి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు.రాజకీయ పార్టీలూ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులను కేంద్రం పార్లమెంటులో ఆవెూదింప చేసుకుందనీ, ఇవి చట్ట రూపం దాలిస్తే దేశంలో రైతు కుదేలు కావడం ఖాయమనీ విమర్శలు గుప్పిస్తుండగా, దేశ వ్యాప్తంగా రైతులు బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీ దళ్‌ కూటమి నుంచి వైదొలిగితే...ఇతర పక్షాలు మింగలేక కక్కలేక అన్న చందంగా ఉన్నాయి.


_________________________________________________________


అన్నదాతనుఅవస్థల పాలు చేసే


అగ్రి బిల్లులపై వెనక్కు తగ్గాలి


 



 


కేంద్రం వ్యవసాయ రంగం బలోపేతం, రైతుకు మార్కెట్‌ స్వేచ్ఛ అంటూ తీసుకువచ్చిన మూడు బిల్లులు పార్లమెంటు ఆవెూదం పొందడంతో రాజకీయ పార్టీలు భగ్గు మంటున్నాయి. వ్యవసాయ భారతం ఆందోళనలతో రగిలిపోతున్నది.


రాజకీయ పార్టీలూ రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులను కేంద్రం పార్లమెంటులో ఆవెూదింప చేసుకుందనీ, ఇవి చట్ట రూపం దాలిస్తే దేశంలో రైతు కుదేలు కావడం ఖాయమనీ విమర్శలు గుప్పిస్తుండగా, దేశ వ్యాప్తంగా రైతులు బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాయి.



ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీ దళ్‌ కూటమి నుంచి వైదొలిగితే...ఇతర పక్షాలు మింగలేక కక్కలేక అన్న చందంగా ఉన్నాయి. ఆఖరికి బీజేపీకి మెంటార్‌ గా వ్యవహరించే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నది.


ఇంతగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ బిల్లులేమిటి వాటి వల్ల రైతులకు ఒనగూరే నష్టమేమిటి ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే లాభపడేదెవరు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అన్న విషయాలనుఅ అవలోకిస్తే..ముందుగా నిత్యావసర సరుకుల సవరణ బిల్లు, ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ ప్రవెూషన్‌, ఫెసిలియేషన్‌ బిల్లు,ఫార్మర్స్‌ ఎంపవర్‌ మెంట్‌ అండ్‌ ప్రొటక్షన్‌, అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల ఆవెూదం పొందాయి.



ఈ బిల్లులు చట్ట రూపం దాలిస్తే దేశంలో రైతుల జీవితాల్లో వెలుగులు పూస్తాయిని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే...వారి జీవితాలు అంధకార బంధురమౌతాయని విపక్షం గగ్గోలు పెడుతోంది.


వాస్తవానికి ఈ బిల్లుల వల్ల రైతులకు నిజంగా ప్రయోజనం ఉంటే...తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందకు రైతులు పండుగ చేసుకుని ఆ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేటీఆర్‌ కు పాలాభిషేకాలు చేశారు. అయతే కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల విషయంలో దేశంలో ఎక్కడా రైతులలో ఆనందం కానరాలేదు సరికదా విమర్శలు వెల్లువెత్తాయి.



వాస్తవానికి ఈ బిల్లుల వల్ల ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రైతు ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నది వ్యవసాయ రంగ నిపుణుల అనుభవం.ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు మాత్రమే దోహదపడడతాయన్నది వారి విశ్లేషణ.


సామాన్య రైతు తను పండించిన పంటను మద్దతు ధర వచ్చే వరకూ అమ్మకుండా నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండదు...అందుకే బడా వ్యాపారులకో, బడా భూస్వామికో అయిన కాడికి అమ్మేసుకునే అనివార్య పరిస్థితులకు నెట్టబడతాడు.



ధరను డిమాండ్‌ చేయలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటాడు. దీని వల్ల వాస్తవంగా లాభపడేది కామందులనబడే భూస్వాములు, లేదా పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు మాత్రమే. ఇక రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్కెట్‌ యార్డుల ద్వారా వచ్చే సెస్‌ రాదు.


ఆ మేరకు ఆదాయాన్ని అవి కోల్పోతాయి. రైతుకు సరైన ధర రానప్పుడు ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీస మద్దతు ధర ఇచచి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దాంతో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది.



ఇక వినియోగదారుడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. క త్రిమ కొరత స ష్టించి బడా వ్యాపార వేత్తలు రైతుల నుంచి చౌకగా కొన్న ఉత్పత్తులను వినియోగదారుడికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అంటే కేంద్రం తీసుకువచ్చిన అగ్రో బిల్లులు అంతిమంగా ఉపయోగపడేది సంపన్నులకే కానీ సామాన్యులకు ఎంత మాత్రం కాదు.


_________________________________________________________


కాగ్‌ నివేదికతో


కేసీఆర్‌ వాదనకు బలం


 



 


జీఎస్టీ పరిహారం వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి నుంచీ వాదిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలో ముంచేసేదిగా ఉందన్న కేసీఆర్‌ వాదనకు ఇప్పుడు కాగ్‌ నివేదిక బలం చేకూర్చింది.


జీఎస్టీపరిహారం చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని చాల కాలంగా పలు రాష్ట్రాల నుండి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అయితే సీఎం కేసీఆర్‌ కేంద్రం మాట తప్పిందంటూ తీవ్రంగా విమర్శలు కూడా చేశారు.



జీఎస్టీ తెచ్చే సమయం 2017లో దాని వలన రాష్ట్రానికి ఆదాయంలో నష్టాలు వస్తే ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పరిహారాన్ని పూర్తిగా రాష్ట్రాలకు చెల్లించడంలేదు. దానిని మన వెూడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రకతి అన్యాయంగా చూపిస్తూ చేతులు దులుపుకున్నారని పలు విశ్లేషణలు వినిపించాయి.


వాస్తవానికి జరిగిందేమిటంటే....జీఎస్టీ విషయంలో కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేసింది. రాష్ట్రాలకు చెల్లించాల్సినపరిహారాన్ని దారి మళ్లించింది. రాష్ట్రాలకు రిక్త హస్తం చూపుతూ...ఆ సొమ్మును ఇతర అవసరాలకు వాడేసింది. ఇదే పని...అంటే ఒక అవసరం కోసం కేటాయించిన నిధులను వేరే అవసరం కోసం వాడటం, రాష్ట్రాలు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అంటూ కేంద్రం గగ్గొలు పెట్టేది.



అదే కంపెనీలు చేస్తే చట్ట విరుద్ధం అంటూ కేసులు నవెూదు అవుతాయి. మరి కేంద్రమే ఆ పని చేస్తే... అలా చేయాల్సి రావడానికి కారణం యాక్ట ఆఫ్‌ గాడ్‌ అంటూ దబాయిస్తే...కేంద్రం ఇప్పుడు అదే చేస్తున్నది. ఆ విషయాన్నే కాగ్‌ తన నివేదికలో విస్పష్టంగా ఎత్తి చూపింది.


ఇప్పుడు కాగ్‌ ఇదే విషయంపై కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం.. రాష్ట్రాలకు అన్యాయం చేసిందనే చెప్పిన కాగ్‌ రాష్ట్రాలకు చెల్లించాల్సిన 47వేల కోట్లకు పైగా పరిహారాన్ని కేంద్రం దారి మళ్లించిందని తన నివేదికలో తెలిపింది. ఇలా ఇతర అవసరాలకు దారి మళ్లించడం జీఎస్టీ చట్టానికి విరుద్దమని కూడా కాగ్‌ ఎండగట్టింది.



చట్టాలను చేసి అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని కాగ్‌ ఎత్తి చూపింది. జీఎస్టీ సెస్‌ కింద వసూలు చేసిన మొత్తాన్ని చట్టం ప్రకారం తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలని, కానీ, కేంద్రం వేరే పథకాలకు మళ్లించిందని వివరించింది.


ఇప్పుడు కరోనాను కారణంగా చూపిస్తూ అసలు ఇవ్వలేమని చెప్పడం దగా చేయడమేనని విస్పష్టంగా తేల్చేసింది. కేంద్రం తీరు ఎలా ఉన్నదంటే..ఎదుటి వారినుంచి తీసుకున్న అప్పు చెల్లించకుండా...అనుకోని కష్టాలొచ్చాయి...నీ బాధలు నువ్వు పడు నీ అప్పు నేను తీర్చను అని చేతులెత్తేయడమే కాకు...అదే మని నినదీస్తే దేవుడినడుగు అన్నట్లుగా ఉంది.



అందుకే తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ కు తన వాదనను మరింత బలంగా వినిపించడానికి, కేంద్ర విధానాలను మరింత గట్టిగా ఎండగట్టడానికి కాగ్‌ నివేదిక ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు. . ఒకవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ జీఎస్టీ విషయంలో కేంద్రంపై ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏవైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ అక్షర సత్యాలంటూ కాగ్‌ నివేదిక కుండ బద్దలు కొట్టింది.


ఈ నివేదిక ద్వారా కేసీఆర్‌ కేంద్రంపై కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా కాగ్‌ స్పష్టం చేయడంతో కేసీఆర్‌ వాదనకు బలం చేకూరినట్లైంది. కేంద్రం అంటే రాష్ట్రాల మీద పెత్తనం చేసే పెద్దన్న పాత్ర పోషించడం కాదని సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని కేసీఆర్‌ చెబుతున్న మాటలు ఇప్పటికైనా కేంద్రం చెవికెక్కించుకుంటే మేలు.


_________________________________________________________


కోర్టులతో వైకాపా


సవాళ్ల పర్వం పర్యవశానం


 



 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి న్యాయ స్థానాల్లో చుక్కెదురవుతున్న సంగతి తెలిసిందే..! పలు విషయాల్లో ఏపీ ప్రభుత్వం తీరును న్యాయస్థానాలు తప్పుబట్టాయి. ఇటీవలే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీద ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.


ఆంధ్రప్రదేశ్‌ లో రూల్‌ ఆఫ్‌ లా అన్నది అమలు కావడం లేదు.. అలాంటప్పుడు డీజీపీ పదవిలో మీరు ఉండి ఏమి ఉపయోగం అంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కు హైకోర్టు కొద్ది రోజుల కిందట మొట్టికాయలు వేసింది. పోలీస్‌ వ్యవస్థను కంట్రోల్‌ చేయలేకపోతే డీజీపీ పదవికి గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేయాలని హై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.



రాష్ట్రంలో మూడుసార్లు జ్యుడీషియల్‌ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీని పలుసార్లు కోర్టుకి పిలిపించినా మార్పు రాలేదని తెలిపింది ధర్మాసనం.


కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ పలువురు వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక ష్ణారెడ్డి కూడా కోర్టుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. నిష్పాక్షికంగా తీర్పులు చెప్పాల్సి న కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.



డీజీపీ ఇలాగే పనిచేస్తే రాజీనామా చేసి పోవలసి ఉంటుంది.. ఇలాగైతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.. అంటూ వ్యాఖ్యలు చేయడం ఏమిటని అడిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. పరిపాలన చేస్తోందా.. అంటూ చేస్తున్న వాఖ్యలపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని సజ్జల రామక ష్ణారెడ్డి అన్నారు.


కోర్టుల పట్ల గౌరవంతో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.మరో వైపు విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ పై ఫ్లెక్సీలపై ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది.



''రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోం.'' అని కొన్నింటిలో ఉంటే.. ''మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆవెూదం పొంది గెలిచింది, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించేహక్కు మీకు ఎవరు ఇచ్చారు'' అంటూ ఇంకొన్ని ఫ్లెక్సీల్లో రాసి ఉంది.


వైసీపీ టియుసి నాయకుడు మాడు శివరామ కష్ణ పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్‌ చేసి పెట్టారు మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అని ఏకంగా వార్నింగ్‌ ఇస్తున్నారా. ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు అనే చర్చ మొదలైంది.


_________________________________________________________


Comments