అధికార మదమా? అహంకారమా?

అధికార మదమా?


అహంకారమా?


  


హైదరాబాద్ : తిరుమలేశుని విషయంలో ఏపీ సర్కార్ పరిధి మీరి వ్యవహరిస్తున్నది. తిరుమల పవిత్రతను ఫణంగా పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నది. డిక్లరేషన్ విషయంలో టీటీడీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా ఉన్నాయి.


అసలే రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల విషయంలో ఆందోళన, అలజడి రేగుతున్న సమయంలోనే ప్రపంచంలోనే అతి ప్రధానమైన హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల విషయంలో ఏపీ సర్కార్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం ఆక్షేపణీయం.


  


ఇక తిరుమలేశుని దర్శనాలకు వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలన్న సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటన్నది వైకాపా సర్కార్ వివరణ ఇచ్చుకోవలసిందే. అన్నిటికీ మించి తిరుమలేశుని దర్శనాలు, భక్తులకు సంబంధించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసినా ఆక్షేపణీయం.


డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటే పవిత్రులైపోతారా? దైవదర్శనం చేసుకునే హిందువులంతా పవిత్రులేనా అన్న అర్ధం వచ్చేనా నాని చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితం తప్ప మరొకటి కాదు.


  


రాష్ట్రపతి, ప్రధాని హెూదాలలో ఉన్న వారే డిక్లరేషన్ ఇచ్చే తిరుమలేశుని దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని బేషరుతగా క్షమాపణలు చెప్పి స్వామివారికి క్షమాపణలు కోరాలి. కొడాలినాని వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులే కాదు... అన్యమత విశ్వాసాలను గౌరవించాలని భావించే సెక్యులరిస్టులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Comments