మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు

మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు


 


పురపాలికల్లో పాగా వేసేలా కెటిఆర్ చర్చలు డబుల్ ఇళ్లతో గాలం వేసేలా అధికార పార్టీ యత్నాలు


 



హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబా' పాటు వరంగల్ లాంటి మహానగరాలకు ఎన్నికలు రానున్నాయి. దీంతో మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తరచూ సమీక్షలతో అభివృద్ధి కార్యక్రమాలను విశ్లేషిస్తూ వ్యూహాత్మకంగా సాగుతున్నారు.ప్రధానంగా చర్చలన్నీ డబుల్ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.


డబుల్ ఇళ్లతో పేదలకు గూడు కల్పిస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు లక్ష ఇళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పడం వెనక మతలబు ఇదే. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు బోగస్ అని ప్రచారం చేయాలనుకుంటోంది. ఈ కోవలోనే మంత్రి తలసాని, భట్టిల పర్యటన సాగింది. మొత్తంగా గ్రేటర్ లో రాజకీయాలు డబుల్ ఇళ్ల చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై అధికార పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా పలు దఫాలు హైదరాబాద్ లో చర్చించారుపలు దఫాలు సమావేశాలను నిర్వహించారు.



 


ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొని మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా చర్చలు జరిపారు. సీ ఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా మున్సి పాలిటీలపైనా వీరు చర్చించారు. రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగే విధంగా ఈ చర్చలను సాగిస్తున్నారు.


మొత్తం మున్సిపాలిటీల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రయత్నాలను మొదలు పెట్టారు. అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక సీట్లను కై వశం చేసుకున్నందున మొత్తం మున్సిపాలిటీలను గెలిపించు కునే విధంగా చూడాలని సీఎం ఆదేశించడంతో వీరు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం - పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.


 



 


రిజర్వే షన్లను ప్రకటించిన వెంటనే అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్దాలు చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మెజారిటీ వార్డులు కైవశం . చేసుకునే విధంగా నేతలతో చర్చిస్తున్నారు. కొత్తవారికి సైతం ఈ దఫా అ వకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మెజారిటీ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నారు. నోటిఫికేషన్ రాగానే బరిలోకి దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


అందుకు సన్నాహకంగా ముందస్తుగా నేతలు చర్చించి, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్ని మున్సి పాలిటీల పరిధిలో టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు లేరు. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మిద రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు.


 



 


 


గ్రేటర్ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అయినట్టు తెలుస్తోంది. అలానే ఎన్నికల నిర్వహణ పై సమీక్ష నిర్వహించినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులపై ఈ సమీక్షలో చర్చించి నట్టు చెబుతున్నారు. గ్రేటర్ అధికారులకు ట్రైనింగ్ కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించి నట్టు చెబుతున్నారు.


ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతిక సహకారంతో సాంకేతికత ను ఎక్కువగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.. గత ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు.


 



 


కోవిడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని, అయితే బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా, లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో 8 వందలకు మించకుండా ఓటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.


Comments