నాలాలు పొంగితే | ప్రాణాలు పోవాల్సిందేనా!

నాలాలు పొంగితే | ప్రాణాలు పోవాల్సిందేనా!ఇదేనా అంతర్జాతీయ నగరం చేస్తామన్న వాగ్దానం నేరెడ్మిట్ బాలిక దుర్మరణంపై జయశాంతి ఆవేదన


హైదరాబాద్ : నగరంలోని మల్కాజిగిరిలో సుమేధ అనే అమ్మాయి నాలాలో కొట్టుకు పోవడంతో చోటుచేసుకున్నవిషాద ఘటన పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఫేస్ బుక్ వేదికగా స్పందిస్తూ కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బయటికి వెళ్లిన బాలిక నాలాలో పడి రెండు కి. మీ. దూరంలో శవమై తేలింది. ఈ ఘటన ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. 'కేసీఆర్ గారూ... మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి. సికింద్రాబాద్ లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్ నగర్ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని జీవితం కరిగిపోయింది.


  


విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు బలైపోయాయో లెక్క తీస్తే ఒక గిన్నిస్ రికార్డు అవుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా మా పార్టీ నేతలు రావడం... ఇలా జరక్కుండా చూస్తామని హామీలిచ్చి వెళ్ళిపోవడం మామూలైపోయింది.


వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాదులోని పలు ప్రాంతాలు నీట మునిగిపోవడం పాత ప్రభుత్వాల పుణ్యమేనని గతంలో మీరు ఎన్నోసార్లు విమర్శించారు. మరి గడిచిన ఆరేళ్ళ కాలంలో ఈ ప్రభుత్వం చేసిందేంటి? ఇప్పుడు రాష్ట్రంలోని పలు ఇతర పట్టణాలు, నగరాలు హైదరాబాదు నగరానికి తోడవుతున్నాయి. 


అడుగడుగునా కజ్జాలు, అక్రమ కట్టడాలతో ఆ ప్రాంతాలు కూడా చినుకు పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజల అగ్రహ వెల్లువలో మోరూ కొట్టుకపోకముందే మేలుకుని పరిస్థితిని చక్కదిద్దండని ఆమె హితవు పలికారు.


Comments