పడకంటి మనసులో మాట 07.02.2021

 


పడకంటి మనసులో మాట...

___________________________________________________________________________________

ఈస్టిండియా కంపెనీల రాకతో ఏమయ్యిందో ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా తీయడం వల్ల కూడా అదే అవుతుందన్నది నిపుణుల అభిప్రాయం. విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడెట్‌ ఊహాలోకంలో విహరింపచేయడానికి ఉపయోగపడుతుందే తప్ప మరొకందుకు కాదు. అంతా కలల బడ్జెట్‌ అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సర్వే ఇస్తున్న సూచనలు కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను సంతృప్తి పరచడానికి కసరత్తు చేసినట్టు కనిపించిందే తప్ప ఆశాజనకంగా లేదనే చెప్పాలి.వన్‌ నేషన్‌ వన్‌ పెన్షన్‌, వన్‌ నేషన్‌ వన్‌ లా, వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ అంటూ దేశం అంతా ఒకటే అని ఊదరగొడుతున్న కేంద్రం. దేశం అంతా ఒకే విధమైన అభివృద్ధి అన్న విధానాన్ని మాత్రం అనుసరించడం లేదు. దక్షిణాదిపై వివక్షతో పాటు...బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్రాలపై ఉద్దేశపూర్వక ఉదాశీనత చూపిస్తున్నది. మొత్తంగా వన్‌ నేషన్‌ వన్‌ గవర్నమెంట్‌...అదీ బీజేపీ గవర్నమెంట్‌ అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని అనిపించేలా వెూడీ సర్కార్‌ తీరు ఉన్నది.

________________________________________________________________________

ఆత్మ నిర్భర్ అంటే ఎఫ్ డీఐలేనా?


ఆయా రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుఅంటే ఎఫ్‌డిఐలను ఆకర్షించి లక్ష్యాలు సాధిస్తామంటున్న తీరు చూస్తుంటే మనమంతా విదేశీ పెట్టుపడులపైనే ఆధారపడాల్సి వస్తుందని అంచనా వేయవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలా చూస్తూ పోతే ఈస్టిండియా కంపెనీల రాకతో ఏమయ్యిందో అన్న విషయం తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతా కలల బడ్జెట్‌ అని చెప్పడానికి సంకోచించాల్సిన  అవసరం లేదు.


 ఆర్థిక సర్వే ఇస్తున్న సూచనలు కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను సంతృప్తి పరచడానికి కసరత్తు చేసినట్టు
కనిపించిందే తప్ప ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఆర్థిక రంగంలోని తిరోగమనం ప్రభుత్వాన్ని కలవరపెడుతోందో లేదో కానీ..ప్రజలపై మాత్రం దాని ప్రభావం బాగా కనిపి స్తోంది. కరోనాతో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో అమెరికా సహా పలు దేశాలు అల్లాడు తున్నాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి పైవేటు పెట్టుబడులు మన దేశానికి ఇబ్బడిముబ్బడిగా వస్తాయని ఆశించడం అత్యాశే కాగలదు. ఇన్నేళ్లల్లో రాని పెట్టుబడులు వచ్చే సంవత్సరం వస్తాయనడం ఆశలపల్లకిలో ఊరేగడం తప్ప మరోటి కాదు. రోజువారీగా ధరలు నిర్ణయించే విధానం వలన పెట్రోధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆ విధంగా సమకూరిన వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ అవసరాలకు ఆసరా అయ్యాయి. 

ఇవి మరింత పెరిగితే మన విదేశీ మారక నిల్వలు తరిగిపోయి ఆర్థిక సర్వే అంచనాలు తల్లకిందులవుతాయి. జిఎస్‌టి వలన అభివృద్ధి కుంటుపడిందని చెబుతున్న సర్వేలు నిజం అవుతున్నాయి. వ్యవసాయాభివృద్ధికి పైవేటు పెట్టుబడులే కీలకమని అంటోది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడంపై అధ్యయనం చేసిన కమిటీ కార్పొరేట్‌ సాగును దూకుడుగా ప్రవేశ పెట్టాలని ఇప్పటికే సిఫారసు చేసింది. 


రైతులు మార్కెట్‌ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుతారు మినహా సంక్షోభం పరిష్కారం కాదు. టెలికం రంగంలో జియో రాకతో ఇబ్బందులొచ్చాయన్న సర్వేను పట్టించుకోవడం లేదు. ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌ విశాఖ ఉక్కులాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో అర్థం చేసుకో వచ్చు. రాష్ట్రాలు స్థానిక సంస్థల పన్ను వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల వాటా గణనీయంగా తగ్గిపోతున్నది.

 వెూడీ సర్కారు ప్రతిపాదించి దూకుడుగా అమలు చేస్తున్న నయా-ఉదారవాద

విధానాలు దేశాన్ని సూపర్‌ పవర్‌ చేస్తాయనడం భ్రమే అవుతుందని గత 

ఆరేళ్లుగా అర్థమవుతూనే ఉంది. బడ్జెట్‌ అనేక అంశాలపై కలవరం 

కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న అవ్యవస్థీకృత రంగాన్ని పెద్ద నోట్ల రద్దు దాన్ని వెన్నంటి వచ్చిన జిఎస్‌టి చావుదెబ్బతీశాయి. పెద్ద సంఖ్యలో ఉపాధి నష్టం జరిగింది.

 ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంది. ఇప్పటికీ ఉపాధి కల్పనలో వృద్ధి లేదు. ఇక విద్య విషయానికి వస్తే గత కొన్నేళ్లలో విద్యతోపాటు వైద్యంపై ప్రభుత్వ వ్యయం తగ్గింది. సామాజిక రంగాలపై ప్రభుత్వ వ్యయం తగ్గడం వల్ల స్థూల ఆర్థిక రంగంపై పడుతున్న ప్రభావంపైనా పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరుగుదల స్థూల ఆర్థికరంగం వృద్ధికి కీలకమని చెప్పిన సర్వే వ్యవసాయ రంగం ప్రస్తుత స్థితిగతులను చర్చించలేదు.

 రైతుల రాబడులను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా గత

 కొన్నేళ్లుగా రైతుల రాబడుల్లో పైసా పెరుగుదల కూడా లేకపోవడానికి కారణాలేమిటో విశ్లేషించే ప్రయత్నం చేయడంలేదు. ఆర్థిక రంగంలోని ప్రస్తుత పరిస్థితులకు సంబంధం లేకుండా రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన స్టాక మార్కెట్లు ప్రమాదకరమైన బుడగ రూపాన్ని సంతరించు కున్నాయి. ఈ బుడగ పేలితే వృద్ధి రేటునే కాదు.. లక్షలాది మంది జీవితాలు కుప్పకూలే ప్రమాదం ఉంది.

ప్రభుత్వం క్రమంగా వివిధ రంగాల నుంచి తపðకుని పైవేట్‌ రంగానికి మరింత పాత్ర కల్పించాలన్న విషయంలో వెూదీ సర్కార్‌ తన లక్ష్యాలనుంచి తపðకోవడం లేదు. నీతి ఆయోగ్‌ పలు నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా కనపడుతుంది. 15వ ఆర్థిక సంఘం నివేదిక సైతం గ్రామాల్లోకి మార్కెట్‌ చొచ్చుకు వెళ్ళాలన్న ఉద్దేశాన్ని ప్రకటించింది.

 వెూదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలు వ్యవసాయరంగం రూపురేఖలు మారుస్తాయని, గ్రామాల్లో పైవేట్‌ రంగం పెట్టుబడులు పెట్టడమే సమస్యలకు తగిన పరిష్కార మని పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణకు అరుణ్‌ శౌరీ నేతృత్వంలో ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి, విదేశీ సంచార్‌ నిగమ్‌, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, బాల్కో, హిందుస్తాన్‌ జింక మొదలైన కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ఆవెూద ముద్ర వేశారు.


 ప్రభుత్వ రంగంలోని హోటళ్లను పూర్తిగా అమ్మి వేశారు. ప్రభుత్వ బ్యాంకులన్నిటిలోనూ 33 శాతం వాటాలను అమ్మాలని అపðడే ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రతిపాదించారు కాని అది అమలు కాలేదు. వాజపేయి హయాంలో రూ.33,655 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వేగవంతం కాలేదు.

 ఆ తొలి అయిదేళ్లలో కేవలం రూ. 8,515 కోట్ల మేరకే పెట్టుబడులను ఉపసంహరించ గలిగారు. అయితే యూపీఏ రెండవ సారి మళ్లీ అధికారంలోకి రాగానే ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వేగవంతం చేశారు. ఎన్‌హెచ్‌పిసితో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ వివిధ రంగాల్లోకి విస్తరించి దాదాపు రూ.99,000 కోట్ల మేరకు సాగింది.


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపðడు రూ. 9,961 కోట్ల మేరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కేవలం మైనారిటీ వాటాలనే ఉపసంహరించడాన్ని పీవీ అనుమతించారు. వాజపేయి హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ ఒక వెల్లువలా సాగింది.

____________________________________________________________________


కేసీఆర్ టార్గెట్ సాగరేనా?
వరుస ఎన్నికల్లో చతికలపడుతూ వస్తున్న అధికార పార్టీ తెరాసను ట్రాకలోేకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లూ తనయుడు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావు, ఇతర తెరాస ముఖ్యనేతలను ప్రచార పర్వంలోకి వదిలిన కేసీఆర్‌.. రాబోయే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలకు నేరుగా తానే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోలా మరోసారి పరాభవం చెందకుండా ఉండేందుకు తనదైన వ్యూహాలకు సీఎం పదునుపెడుతున్నారు.

 దీనిలో భాగంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బహిరంగ సభద్వారా సమరభేరి వెూగించనున్నారు.తెలంగాణలో తెరాస పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. రెండవదఫా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి తెరాస బలం తగ్గుతూ వస్తుంది. రాష్ట్రంలో పాగావేసేందుకు కమలదళం వేగంగా దూసుకొస్తుండగా.. కమళనాథుల వ్యూహాల ధాటికి తెరాస తేలిపోతున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. అదే ఊపును
 కొనసాగిస్తూ వస్తుండటం తెరాస శ్రేణులను కలవరానికి గురిచేస్తుంది. తొలుత బీజేపీది గాలివాటం గెలుపు అని భావించిన కేసీఆర్‌.. ఇటీవల వరుస ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవటాన్ని చూసి అలర్ట్‌ అయినట్లు ప్రచారం సాగుతుంది.
 దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని స్థాయిలో తన సత్తాను చాటింది.
 అప్పటి వరకు బీజేపీని లైట్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. అలర్ట్‌ అయ్యారు. దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎవరూ ప్రచారం నిర్వహించలేదు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను కేటీఆర్‌ తీసుకున్నారు.

 సీఎం కేసీఆర్‌ చివరి సమయంలో ఒక్క బహిరంగ సభతోనే సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నిక ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవటంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. దీంతో రాబోయే ఏ ఎన్నిక ఏదైనా తెరాసకు డూ ఆర్‌ డై అనట్లుగా మారింది.
 ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలను సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
సాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని భావిస్తున్న కేసీఆర్‌.. ఎలాగైనా సాగర్‌లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా నల్గొండ ఉమ్మడి జిల్లాతో పాటు సాగర్‌ నియోజకవర్గం అభివద్ధిపైనా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దష్టికేంద్రీకరించారు. ఈనెల 10న హాలియాలో బహిరంగ సభ ద్వారా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రచార భేరిని ప్రారంభించనున్నారు. అంతేకాక పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తెరాస గెలుపుతోనే అభివద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు పకడ్బంధీ వ్యూహాలతో క్యాడర్‌ను కార్యరంగంలోకి దింపనున్నారు.
 మొత్తానికి బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. సీఎం కేసీఆర్‌ మళ్లీ తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నారు.
____________________________________________________________________


గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారా?

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటే ఇంతే ఉంటుంది. ముందు ముందే ఊహించి.. కాస్త ప్రజాస్వామికంగా వెళ్లి ఉంటే ఇంత దాకా వచ్చేదా అనే జనం కామెంట్స్‌ లో కూడా నిజం ఉన్నట్లే ఉంది. లేదంటే.. వైసీపీ సర్కార్‌ కి ఇప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్‌ ఉందో తెలుసు కదా. అంత దాకా వచ్చేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.


ఓ పక్క దండయాత్ర చేస్తున్నారు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌. ఎక్కడా వదలడం లేదు. పిన్‌ డ్రాప్‌ సైలెంట్‌ గా చెప్పింది చేసుకుంటూ వెళ్లండి అంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ఎంప్లాయిస్‌ కే కాదు.. ఏపీ సర్కార్‌ కి మనిస్టర్లకి కూడా అదే రూల్‌ వర్తిస్తుంది అన్నట్లు.. పక్కాగా వెళ్తున్నారు. కానీ.. మరి మినిస్టర్లకి మింగుడు పడుతుందా చెప్పండి. లేదు కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ లీడర్లకీ.. వాళ్లని సపోర్ట్‌ చేస్తున్న ఉద్యోగులదీ అదే సిచ్చువేషన్‌.

 అసలు చంపుతాం పొడుస్తాం అన్న ఉద్యోగ సంఘాల నేత ఎటు పోయాడో కూడా తెలీదు. తను సైలెంట్‌ గా చెప్పిన పని చేసుకుంటూ పోతున్నాడు కావచ్చు.
ఏదెలా ఉన్నా.. మినిస్టర్లకి మాత్రం ఏ మాత్రం రుచించడం లేదు నిమ్మగడ్డ తీరు. ఏందయ్యా అంటే.. ఏకగ్రీవాల విషయం ఇషఉ్య అవుతోంది కదా.

 అధికార పార్టీ బెదిరించి ఏకగ్రీవాలు చేయిస్తుంది అనే కామెంట్స్‌ ఉన్నరు కదా.
 అందుకే.. రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలని నిలిపివేసింది ఎన్నికల కమిషన్‌. దానిపై డీటెయిల్డ్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి అని.. ఆర్డర్స్‌ పాస్‌ చేసింది. లేదంటే ఏకగ్రీవాలను యాక్సెప్ట్‌ చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ఆఫీసర్లు. ఇప్పుడు ఇదే విషయం వైసీపీకి, ఏపీ మినిస్టర్లకీ నచ్చడం లేదు.
 మామూలుగా అయితే.. బెదిరింపులతోనే ఏకగ్రీవాలు జరిగాయి అనేది జనం మాట. కానీ.. వైసీపీ లీడర్లు మాత్రం.. ప్రశాంతంగా, అందరూ ఇష్టపూర్తిగా ఏకగ్రీవాలు జరిగాయి అంటున్నారు.
 నిమ్మగడ్డ ఏవెూ.. అలాంటప్పుడు రిపోర్ట్‌ వస్తే ఓకే కదా అంటున్నారు. ఇక వైసీపీ లీడర్స్‌ ఊరుకుంటారా. మినిస్టర్లు రంగంలోకి దిగారు. 

ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి యాక్షన్‌ లోకి దిగారు. నిమ్మగడ్డ మార్చి వరకే పదవిలో ఉంటారు. తర్వాత మేం చూసుకుంటాం అన్నట్లు మాట్లాడుతున్నారు అనేది హాట్‌ టాపిక అయింది. అంటే.. నెగటివ్‌ రిపోర్టులు కానీ పంపితే మీ పని ఉందే అనేది ఆ మాటల వెనక ఇంటెన్షన్‌ అంటూ.. పొలిటికల్‌ గా డిస్కషన్స్‌ నడుస్తున్నాయి.

 ఫ్రస్ట్రేషన్‌ లో అధికారుల్ని బెదిరిస్తున్నారని.. ఇది కూడా ఎన్నికల రూల్స్‌ ని బ్రేక చేయడమే అవుతుంది అనేది ఇంటలెక్చువల్స్‌ మాట. పాపం వైసీపీ లీడర్స్‌.. ఎన్నికల టైం అంతా మెంటల్‌ టెన్షన్‌ తప్పదేవెూ.

____________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India

Comments