పడకంటి మనసులో మాట ... 


మోడీ మౌనం క్షంతవ్యం కాదు!

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుదన్న క్రమంలో గతేడాది చప్పట్లు కొట్టించిగంటలు కొట్టించిదీపాలు వెలిగించమని హడావిడి చేసిన ప్రధాని వెూడీ ..ఇపðడు మాత్రం దేశంలో కరోనా మరణ మృదంగం వెూగిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. ఈ సంక్షభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారో చెప్పడం లేదు. లెక్కకు మిక్కిలి మరణాలు నవెూదవుతున్నా..ప్రజలంతా ప్రాణాలు బిగబట్టి చస్తావెూబతుకుతావెూ తెలియని పరిస్థితిలో ఉన్నా వెూడీ మాత్రం నింపాదిగా ఉన్నారు. ఒక్కో రాష్ట్రం ఇక లాభం లేదనుకుని సంపూర్ణ లాకడౌేన్‌ దిశగా వెళుతోంది.                 ____________________


దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుదన్న క్రమంలో గతేడాది చప్పట్లు కొట్టించిగంటలు కొట్టించిదీపాలు వెలిగించమని హడావిడి చేసిన ప్రధాని వెూడీ ..ఇపðడు మాత్రం దేశంలో కరోనా మరణ మృదంగం వెూగిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. అసలు ఏం చేయబోతున్నారో చెప్పడం లేదు. ఎంతమంది చస్తే ఆయన కల్లు తెరుస్తారో కూడా అర్థం కావడం లేదు.

 ఈ సంక్షభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారో చెప్పడం లేదు. లెక్కకు మిక్కిలి మరణాలు నవెూదవుతున్నా..ప్రజలంతా ప్రాణాలు బిగబట్టి చస్తావెూబతుకుతావెూ తెలియని పరిస్థితిలో ఉన్నా వెూడీ మాత్రం నింపాదిగా ఉన్నారు. ఒక్కో రాష్ట్రం ఇక లాభం లేదనుకుని సంపూర్ణ లాకడౌేన్‌ దిశగా వెళుతోంది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు పదిహేను రోజుల లాకడైేన్‌ ప్రకటించింది.

 అలాగే కర్నాటకకేరలఒడిషా ప్రకటించాయి. ఇకపోతే మిగతా రాష్ట్రాలు పాక్షిక లాకడైేఔన్‌కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. దీనిని బట్టి కరోనా తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ కూడా వెూడీ తీరును ఏకి పారేసింది. ఫాచీ పలు సూచలను చేశారు. కానీ వెూడీ మాత్రం అధికార మత్తు వదలడం లేదు.

 ఆయన దృష్టి అంతా సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంలోనూ...దేశంలోని ఆస్తులను ఆదానీఅంబానీలకు కట్టబెట్టడంలోనూ ఉందన్న అనుమానాలుఆరోపణలు ఉన్నాయి. అరుంధతీరారు సహా పలువురు మేధావులు వెూడీ తపðకోవాలన్న ఓ కొత్త డిమాండ్‌ను తెపైకి తెచ్చారు.

ఎందకంటే దేశంలో మనుషుల ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా మనదేశం దినదినం కుంగిపోతోంది. భారత దేశం కరోనాపై విజయం సాధించిందని పండుగ చేసికొని మూడురోజులు తిరక్కముందే పెనుఉప్పెన వచ్చిపడింది. ప్రజలు కకావికలులైనారు. ఆసుపత్రుల్లో బెడ్లుమందులు దొరక్క దళారీల వలలో చిక్కుకొంటున్నారు.

 లక్షలాది రూపాయలు చెల్లించి బెడ్లుమందులు దక్కించుకున్నా ఆక్సిజన్‌ దొరక్కవెంటిలేటర్లు లేక నిస్సహాయంగా ప్రాణాలొదులుతున్నారు. ప్రభుత్వా సుపత్రులను ఆధునీకరించ కపోవడంతో మరింత శిథిలావస్థకు చేరాయి. మందులువైద్య పరికరాలుడాక్టర్లుసిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా ప్రజలు గత్యంతరం లేక పైవేటు వైద్య శాలల వైపు క్యూ కట్టారు.

 కనీసం కరోనా మొదటి విడత అనుభవంతోనైనా ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టడంలేదు. శవ దహనానికి శ్మశానవాటికలో సమయం దొరక్క పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మేము అండగా ఉన్నామంటూ పలు దేశాధినేతలు ముందుకొస్తున్నారు.

 వైరస్‌ రూపాంతరం అంటే మ్యుటేషన్‌ చెందడం సహజమనిగత ఏడాది జనవరిలో ప్రారంభమైన తర్వాత పలు దేశాలలో రెండవ దశ విలయం వచ్చిందనిభారత్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందనివిపక్షాలుశాస్త్రవేత్తలు వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికలను పట్టించు కోకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

 బాధ్యతా రాహిత్యంతో పాలకులు ఉన్నారు. కరోనాపై విజయం సాధించామని పాలకులు ప్రచారం చేసిన ఫలితమే ఈ ఉధృతికి కారణమని చెప్పక తప్పదు. ప్రమాదపు హెచ్చరికలు వచ్చిన వెంటనే మేల్కొని యుద్ధప్రాతిపదిక న చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇంతటి వైపరీత్యం వచ్చి ఉండేది కాదు.

ఇప్పటికీ మేధావులువైద్య నిపుణులురాజకీయ పక్షాలన్నిటితో చర్చించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్న ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కనుకనే ఆసుపత్రుల్లో బెడ్లుమందులుఆక్సిజన్‌వెంటిలేటర్ల కొరత ఏర్పడి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి ప ఓతున్నాయి. ఈ మరణాలు ఇంతటితో ఆగుతాయని చెప్పడానికి లేదు.

 ఇన్ని వైఫల్యాలు కళ్లముందు కదలాడుతున్నా పాలకులు ప్రజల
ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడంవైద్య శాస్త్ర నిపుణులు వ్యాక్సిన్‌ ప్రయోజనాలుఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఇపðడు క్యూ కడుతున్నారు. తీరా ఇపðడు వ్యాక్సిన్‌ అందించడంలోనూ ఘోర వైఫల్యం చెందారు.

 తొలి డోసు తీసుకున్న వారు రెండో డోసు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి దాపురించింది. మొదటి డోసు కాల పరిమితి ముగుస్తున్నదనే ఆందోళన ప్రజలను అయోమయంలోకి నెట్టాయి. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే తప్ప మరోటి కాదు. ఇక తొలి డోసు వేయించుకుందామనుకున్న వారికి అసలు అవకాశమే లేదు. న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా కదలిక లేదు.

దేశ రాజధాని ఢిల్లీ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఢిల్లీ హై కోర్ట్‌ పదేపదే హెచ్చరిస్తోంది. తగిన వెూతాదులో ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆదేశిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే 5 నగరాలలో లాకడౌేన్‌ ప్రకటించాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

 అన్ని చర్యలు చేపడితే దేశ రాజధాని లోనే వందలాది మంది ఆక్సిజన్‌ దొరక్క ఎందుకు మరణించారో చెప్పాలి. ఇన్ని వైఫల్యాలునిర్లక్ష్యంఅచేతనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం పాలకులకు ఎవరిచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులు పెడుతున్నారు. ఇంతగా దారుణాలు ప్రపంచానికి కనిపిస్తున్నా మన పాలకులకు మాత్రం కానరావడం లేదు.

శ్మాశానాల్లో శవాల దహనాలు చూడడం లేదు. వేలాదిగా చనిపోతుంటే పదుల్లో లెక్కలు చూపి బెఉరిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు మొద్దునిద్ర వీడాలి. ప్రజలను కాపాడేందుకు సంపూర్ణ లాకడౌేన్‌ విధించాలి. కరోనా చైన్‌ తెంపాలి. మరింతగా విస్తరించకుండా అరికట్టాలి. అపðడు మరాణహోమం ఆగుతుంది. లేకుంటే కాల్చడానికి శ్మశానాలు కూడా మిలకపోవచ్చు.

          ____________________________________________
ఈటలపై సానుభూతి- సీఎంపై వ్యతిరేకత

ఈటలపై వేటు తెచ్చిన చేటిది


ఈటలపై వేటు ఆయనపై ప్రజలలో సానుభూతి పెరగడానికే దోహదపడింది. అదే సమయంలో సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత పెంచింది. ఈటల అభిమానులైతే హుజూరాబాద్‌ లో మా ఈటెలన్న పై పోటీకి రండి అంటూ కేసీఆర్‌కే సవాల్‌ విసురుతున్నారు.

20 ఏళ్లుగా మచ్చలేని మనిషిగా.. మాట అనిపించుకోని నాయకుడిగా.. బలహీన వర్గాల వారి వెంట నడిచే మనిషిగా.. హడావిడి చేయకుండానే అందరికీ కావాల్సినవి అన్ని సమకూర్చే లీడర్‌ గా పేరు తెచ్చుకున్నారు ఈటెల రాజేందర్‌. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పరిస్థితిని ఎంతగా దెబ్బ కొడతారు ఈటెల అనేది ఇంట్రస్టింగ్‌ గా మారింది.

 టీఆర్‌ఎస్‌ లీడర్లు.. ఒకరో ఇద్దరో బయటికి వచ్చి అంటున్నారే తప్ప.. ఈటెలను తప్పుబట్టే లీడర్లు లేరు. ఇక ప్రతి పక్షాలు అన్నీ ఈటెలకే సపోర్ట్‌ చేస్తున్నాయి. సో.. పోటీ చేసినా.. ప్రతి పక్షాలు కూడా ఈటెల వెంటనే నుంచుని.. సీఎం కేసీఆర్‌ ని దెబ్బ కొట్టాలని చూస్తాయి అందులో ఎలాంటి డౌటూ లేదు.

 సో.. ఉప ఎన్నికలు గానీ వస్తే.. కేసీఆర్‌ ఎన్ని రాజకీయ తంత్రాలు వేసినా.. ఈటెల గెలుస్తారు అనే టాక వచ్చింది. ఇక జనం ఆవేశం మామూలుగా ఉంటుందా. అసలు కేసీఆర్‌ అయినా.. మా నియోజక వర్గంలో.. ఈటెలని గెలిచేంత సత్తా ఉండదు. అంత బలం ఉంది ఈటెలకి అంటున్నారు.

కేసుల భయమేనా?


అభిమానం వేరు.. సపోర్ట్‌ వేరు.. డబ్బా కొట్టడం వేరు.. ఇవన్నీ పొలిటికల్‌ గా కనిపిస్తూనే ఉంటరు. కానీ.. సీఎం జగన్‌ కు మాత్రం వెూడీ విషయంలో ఇవేం కాకుండా.. ఇంకేదో ఉన్నట్లుంది. అదే భయం. భయం ఉంటే కూడా ఓకే. తను ఆయన జోలికి వెళ్లకుండా ఉంటారు. అఫ్‌ కోర్స్‌.. ముందు నుంచీ జగన్‌ చేస్తున్నదీ అదే.. మనం చూస్తున్నదీ అదే.

ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఏపీకి ఎంత అన్యాయం చేస్తున్నా.. సీఎం జగన్‌ ఎలాగూ మాట్లాడరు. ఆ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉంది. ఎందుకంటే కేసులంట అంటూ.. సినిమా టైటిల్స్‌.. పంచు డైలాగులు మామూలే కదా. పొలిటికల్‌ గా ఇవన్నీ కామనే.

అయితే.. సీఎం జగన్‌ ఏంటో కానీ.. తానూ మాట్లాడక.. మాట్లాడే వారినీ మాట్లాడనివ్వక.. ఇదేం పని సామే అంటున్నారు జనాలు. ఎందుకంటే.. ఉన్న చోట ఉండక.. జారండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ పై కామెంట్స్‌ చేశారు. ఈ టైంలో రాజకీయాలు అవసరమా సారూ అన్నారు. మనకి మనకి ఎన్నున్నా.. ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు అంటూ హిత బోధ చేశారు.

అఫ్‌ కోర్స్‌.. ఇందులో తప్పేముంది. జారండ్‌ సీఎం కి సాటి సీఎంగా ఓ మంచి మాట చెప్పారు. ఈ టైంలో రాజకీయాలెందుకు హేమంత్‌ సోరెన్‌ అన్నారు. అవును కదా. కరోనా టైంలో.. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాల గురించే ఆలోచించాలి. కానీ.. హేమంత్‌ సోరెన్‌ చేసింది రాజకీయాలు కాదు. జగన్‌ మాట్లాడిందే రాజకీయం అంటున్నారు.

అట్టెట్టా అంటారా. హేమంత్‌ సోరెన్‌ కరోనా గురించి మాట్లాడారు. మన్‌ కీ బాత్‌ లా మాట్లాడారే తప్ప.. ప్రజల గురించి పట్టించుకోలేదు అని పీఎం వెూడీపై కామెంట్స్‌ చేశారు. తను మాత్రమే మాట్లాడ్డం కాదు.. సమస్యలు ఏంటి అని సీఎంలతో మాట్లాడాల్సిన బాధ్యత వెూడీపై ఉంది అన్నారు. తను చెప్పేది చెప్పి.. మేం సమస్యల గురించి మాట్లాడుతుంటే వినలేదు అన్నారు జారండ్‌ సీఎం హేమంత్‌.

 అంతే కదా. వాళ్లు ప్రజల సమస్యల గురించి అడిగితే.. పట్టించుకోలేదని వెూడీపైస విమర్శలు చేశారు. మరి అలాంటప్పుడు సీఎం జగన్‌ వెూడీకి సపోర్ట్‌ చేస్తే.. జగన్‌ చేసిందే రాజకీయం అంటారు కదా. నాపై అటాక చేసిన వారిపై అటాక చేస్తూ.. నాకు సపోర్ట్‌ చేస్తున్నారు అంటూ.. కేసుల విషయంలో జగన్‌ కి వెూడీ హెల్ప్‌ చేస్తారనే.. జగన్‌ ఇలా మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు జనాలు.
            ______________________________________________

For more updates


Follow us on Facebook

 News 9 Telugu Daily


Follow us on Twitter

 News9 India


Follow us on Instagram:

News 9 India


Join our Facebook group

News9 Telugu Daily Public Group


                   Join our Telegram Channel

News9 Telugu Channel

Comments