పడకంటి మనసులో మాట ... 


కరోనా సంక్షోభంపై అధ్యయనమేదీ?

 

చనిపోయిన వారి విషయంలో సమగ్ర సమాచార సేకరణ జరిగి వారికి సాయం అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్భుత్వాలు ముందుకు రావాలి. ఎందుకంటే అనేక మంది ప్రజలు లక్షల్లో డబ్బులు అపðచేసి మరీ ఆస్పత్రులకు ధరాపోశారు. అందించిన ప్యాకేజీ వల్ల మేలు జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకు నేందుకు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి విస్తృతమైన యంత్రాంగం ఉన్నందున నివేదికలు తెప్పించు కోవాలి. ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచార సేకరణ చేయాలి. అవసరమైతే దెబ్బతిన్న రంగాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుని ముందుకు సాగాలి. అపðడే కరోనా కష్టాల వల్ల ప్రజలకు ఉపశమనం దక్కుతుంది.

 

దేశంలో ఆయా రాష్ట్రాలు ఎవరి పరిధిలో వారు లాకడౌేన్‌ కొనసాగిస్తున్న వేళ అనేక రంగాల ప్రజలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయారు. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నికల పుణ్యమా అని అనేకులు కరోనాకు బలయ్యారు. టీచర్లు ఎందరో మరణించారు. ఇలా మరణించిన వారి కుటుంబాలపై అధ్యయనం చేసి వారిని అదుకునే ప్రయత్నాలు చేయాలి. గతేడాది ప్రదాని వెూడీ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏయే రంగాలను ఆదుకున్నదీ లేనిదీ తెలియడం లేదు. తాజాగా ఇచ్చిన ఐదుకిలోల బియ్యం సాయం కూడా పెద్దగా ఒరిగిందేవిూ లేదు. అయితే ఈ సంక్షోభంపై అధ్యయనం చేయాలి. గ్రామాల వారీగా లెక్కలు తీయాలి. ఎంతమంది బలయ్యారు..ఏ ఆసుపత్రిలో మరణించారు..వారికి ఎంత ఖర్చయ్యిందీ తెలుసుకోవాలి. ఇలా కోల్పోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లు అనాధలయ్యారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూడా చనిపోయారు.
ఇలా చనిపోయిన వారి విషయంలో సమగ్ర సమాచార సేకరణ జరిగి వారికి సాయం అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్భుత్వాలు ముందుకు రావాలి. ఎందుకంటే అనేక మంది ప్రజలు లక్షల్లో డబ్బులు అపðచేసి మరీ ఆస్పత్రులకు ధరాపోశారు. అందించిన ప్యాకేజీ వల్ల మేలు జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకు నేందుకు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి విస్తృతమైన యంత్రాంగం ఉన్నందున నివేదికలు తెప్పించు కోవాలి. ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచార సేకరణ చేయాలి. అవసరమైతే దెబ్బతిన్న రంగాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుని ముందుకు సాగాలి. అపðడే కరోనా కష్టాల వల్ల ప్రజలకు ఉపశమనం దక్కుతుంది. ప్రధానంగా నిత్యకూలీలు ఎదుర్కొటున్న సమస్యలపై తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. కొన్ని రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుని వారిని ఆదుకున్నా..అవి తక్షణ ఉపశమనం కోసం చేసినవే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేయలేదు. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకున్న ప్రయత్నాలు చేయలేదు. చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదు. దేశ పునర్ని ర్మాణంలో అతిపెద్ద భాగస్వాములైన ప్రజలను అనాధలుగా వదిలేస్తే భవిష్యత్‌ నాశనం కాగలదు. నిజానికి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉపశమన చర్యలు తీసుకుని, సక్రమమైన వైద్యం అందించే ప్రయత్నం చేసివుంటే సమస్యలే ఎదురయ్యేవి కాదు. కనీసం ఇపðడైనా కరోనాతో చనిపోయినవారి వెతలపై అందరూ దృష్టి సారించాలి. అలాగే కరోనాతో ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలు తీసేందుకు పనికి వస్తుంది. వారి సంక్షేమం కోసం ఏంచేయాలో, ఇపðడెదురైన చేదు అనుభవాలు భవిష్యత్తులో
ఎదురు కాకూడదనుకుంటే ఎలాంటి చర్యలు చేయడం అవసరవెూ లోతుగా ఆలోచించాలి. కరోనా వైరస్‌ మహమ్మారితో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. కరోనా సెకండ్‌వేవ్‌ హెచ్చరికలను ముందే గ్రహించి అందుకు వసరమైన ముందస్తు చర్యలు అమలు చేసివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. సామాన్యుల కష్టాలను విని, చూసి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు రంగంలోకి దిగి చేతనైనంత చేయడంతో కొందరైనా పొట్టనింపుకోగలిగారు. బతికిబట్ట కలిగారు. అయితే కొందరు నిత్యం అడుక్కుంటే తప్ప పూటగడవని పరిస్థితిలో ఉన్నారు. ఇన్ని అనుభవాల దృష్ట్యా ప్రభుత్వాలు ఆలోచనలు చేయాలి. ఈ దేశంలో ఉన్న అభివృద్దికి సామాన్యులే పునాది రాళ్లు. దేశంలోని సమస్థ మౌలిక సదుపాయా లకూ వీరే వెన్నెముక అన్నది కూడా మరవరాదు. మాల్స్‌, మల్టీప్లెక్సలు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు అన్నీ వీరి శ్రమశక్తితోనే నిర్మాణమయ్యాయి. ఆకాశ హర్మ్యాలకు రంగులద్దినా,
గూడ్స్‌ రైళ్లనూ, ట్రక్కులనూ సరుకులతో నింపినా, రిక్షాలు లాగినా, ఆటోలు నడిపినా, తోపుడు బళ్లపై ఆధారపడినా, ఆహారవెూ, సరుకులో ఇంటింటికీ అందించినా అంతా వీరి చలవే అన్నది పాలకులు గుర్తించాలి. ఈ పనులు చేసేవారిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలే. ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం సాగివుంటే, అభివృద్ది పనులకు సంకల్పించి ఉంటే ... ఉన్న ఊరును, కన్నవారిని విడిచి, భార్యాబిడ్డల్ని వదిలి వేల కిలోవిూటర్ల దూరంలో అనేకులు దినసరి కూలీలు పనిచేస్తున్నారు. ఇలా నగరాలకొస్తున్నవారంతా
ఎంతటి దుర్భరమైన స్థితిలో బతుకు లీడుస్తున్నారో పరిశీలన చేయాలి. దేశ సంపద పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న వలసజీవుల్ని ప్రభుత్వాలు పూర్తిగా ఉపేక్షిస్తున్నాయి. చెపðకోవడానికి పేదరిక నిర్మూలన పథకాలు దేశంలో చాలానే వున్నా.. అవేవీ దినసరి కూలీలను, కార్మికులను ఆదుకోవడలేదని నిరూపితం అయ్యింది. కరోనా దెబ్బతో వలస జీవులకు ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిందేవిూ లేదని వెల్లడైంది. వలస జీవులతో పనులు చేయించుకుంటున్న యజమానుల్లో అత్యధికులు వారికి సంబంధించి ఎలాంటి రికార్డులూ నిర్వహించడం లేదు. కార్మికులకు న్యాయంగా దక్కవలసిన పథకాలను ఎగ్గొట్టడం కోసం చాలా తక్కువ మందిని లెక్కల్లో చూపుతారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు పక్కన పెట్టాయి. ఈదశలో ఇక కార్మికులకు ఉపాధి చూపే దిశగా పథకాలు రూపొందించాలి. వారి కుటుంబాలకు బతుకు భయం లేకుండా చూడాలి. అందుకు తగిన ప్రణాళికలను రచించాలి. ఇప్పట్లో కరోనా కష్టాలు తొలగవు కనుక వివరాలు సేకరించడంతో పాటు, ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతో కరోనా బాధితులకు, చనిపోయిన కుటుంబాలకు మేలు చేసినవారం అవుతాం.

 

 

తెలంగాణలో ధాన్యం దిగుబడుల రికార్డు

 

తెలంగాణలో ఇపðడు వ్యవసాయికంగా బాగా పురోగమించిందనే చెప్పాలి. ధాన్యం రాశులే దీనికి నిదర్శనం. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎంతగా ధాన్యం దిగుబడి అయ్యిందో గమనించాలి. ఓ వైపు జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నా మరోవైపు తమ ధాన్యం కొనడం లేదని రైతులు ఆందోళనలకు దిగితున్నారు. ఇదంతా ఓ వైపు గోదావరి ఉరుకులు పరుగులు.... సాగుతో జిల్లాల్లో ధాన్యం దిగుబడులు పెరిగాయి. మరోవైపు ధాన్యం దిగుబడిలో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిందన్న కేంద్రం ప్రశంసలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవం సాధించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కనుంది. వరిదిగుబడి, ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని భారత ఆహార సంస్థ గతేడాది చేసిన ప్రకటన తెలంగాణ వ్యవసాయరంగం పురోగమిస్తోంద నడానికి సంకేతం. ఇక అవసరమున్న పంటలను పండించాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్వయసాయ రంగం బహుముఖంగా అభివృద్ది చెందనుంది. కరోనా కాలం కష్ట సమయంలో ధాన్యా గారంగా,యావద్దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. ఈ విజయం వ్యవసాయరంగ పురోభివృద్దిలో సాధించిన మైలురాయిగా చూడాలి. కరువులు, వలసలతో కొండంత కష్టాలతో కుమిలిపోయిన అన్నదాతల జీవితాలు గట్టెక్కుతున్నాయి. రైతుబంధుతో పెట్టుబడి సాయంతో పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరాతో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. కరోనా సంక్షోభంలో అన్నదాత ఆగం కావొద్దని ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలుచేసేందుకు ఊరూరా కొనుగోళ్లను ప్రారంభించారు. యాసంగి దిగుబడిలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో వరి దిగుబడి సాధించి తెలంగాణ రైతులు రికార్డు సృష్టించారు. ఆ తరువాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనడంతో అన్నదాతలకు బరోసా దక్కింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ మాదిరిగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనడం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ దశలో వ్యవసాయంలో మరో విప్లవాత్మక మార్పునకు తెలంగాణ సర్కారు దృఢ నిశ్చయంతో ఉన్నది. కృష్ణా, గోదావరి, మూసీ నదీ జలాలు పుష్కలంగా లభిస్తున్న తరుణంలో పంట మార్పిడి దిశగా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. గిరాకీ ఉన్న పంటల్నే పండించడం, డిమాండ్‌
ఉన్నపðడే పంటను మార్కెట్‌కు తేవడం.. నియంత్రిత వ్యవసాయం లక్ష్యం. వ్యవసాయానికి పెట్టుబడి సాయం మొదలు విత్తనాల్లో సబ్సిడీ, ఎరువుల్లో రాయితీ సమకూర్చుతున్న ప్రభుత్వం... రైతులు మూస విధానం వీడి మంచి ఆదాయం పొందేలా మేధోమధనం జరిపింది. ఈ మేరకు జిల్లా నేలలకు అనువైన పంటలు వేసి లాభాలు గడించేలా ప్రణాళిక రూపొందించింది. ఒకే రకమైన పంటలసాగుతో ధరలు తగ్గి రైతులు నష్ట పోతున్న నేపథ్యంలో డిమాండ్‌ ఉన్న పంటలకు రైతులు కూడా మొగ్గుచూపుతున్నారు. దేశచరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సాహసించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం విలువ పదివేల కోట్ల రూపాయల పై మాటే అని తెలుస్తోంది. యాసంగిలో పండిన వరిధాన్యం సేకరణలో జాతీయస్థాయిలో తెలంగాణది కీలక భాగస్వామ్య మని ఎఫ్‌సిఐ పేర్కొన్నది. గతేడాది ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్‌ పంపిణీలో భాగంగా తెలంగాణలో 2.87 లక్షల టన్నుల బియ్యాన్ని 1.91 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా అందించారని చెప్పారు.

 

 

లాక్ డౌన్ తో ఏపీలో కరోనా తగ్గుముఖం

 

 

కరోనా సెంకడ్‌ వేవ్‌ ఏపీని వణికించడంతో పాటు... కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భయపెట్టాయి. అయితే ఇపðడిపðడే వైరస్‌ ఉధృతి రాష్ట్రంలో తగ్గుముఖం పడుస్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,756 కరోనా కేసులు నవెూదయ్యాయి. ఈ రోజు నవెూదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,71,742కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 10,738 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,73,622 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 14,87,382 మంది రికవరీ అయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,392 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 87 వేల 382 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,88,611 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,73,622 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నవెూదైన కరోనా కేసుల వివరాలు.. ఇలావున్నాయి. శ్రీకాకుళం- 666, విజయనగరం- 397, విశాఖ- 1004, తూ.గో- 2301, ప.గో- 1397, కృష్ణా- 782, గుంటూరు- 780, ప్రకాశం- 811, నెల్లూరు- 865, చిత్తూరు- 2155, అనంతపురం- 1224, కర్నూలు- 742, వైఎస్‌ఆర్‌ జిల్లా- 632 కేసులు నవెూదయ్యాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా కరోనా మృతుల సంఖ్య.. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి, చిత్తూరు జిల్లాలో 13, విశాఖ జిల్లాలో 10 మంది మృతి, తూ.గో, అనంతపురం జిల్లాల్లో 9 మంది చొపðన మృతి, గుంటూరు, కృష్ణా జిల్లాలో 8 మంది చొపðన మృతి, కర్నూలు జిల్లాలో ఏడుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు మృతి, విజయనగరం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు మృతి, కరోనాతో వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు.గేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఈ ఆదివారం కూడా చికెన్‌, మాంసం, చేపల అమ్మకాలను నిలుపుదల చేశారు. కరోనా తీవ్రత కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన తెలిపారు. మాంసం దుకాణాల వద్ద జనం గుమిగూడటం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని సృజన కోరారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ అధికారులు ఒక రోజు ముందుగానే ఆయా వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం చికెన్‌, మటన్‌, చేప, రొయ్యల మార్కెట్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రజలెవరూ భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో వైరస్‌ ఉనికి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయితే రేపు మాంసం విక్రయాలపై అధికారులు నిషేదం విధించడంతో మాంసం ప్రియులు ఒక రోజు ముందే షాపుల వద్ద ఎగబడ్డారు. దీంతో శనివారం మాంసం దుకాణాల వద్ద తాకిడి పెరిగింది. గత ఆదివారం కూడా జీవీఎంసీ పరిధిలో మాంసం విక్రయాలపై నిషేదం విధించారు. దీంతో నగరంలో చికెన్‌, మాంసం, చేపల వ్యాపారాలు నిలిచిపోయాయి.


Comments