హిందీ నేర్చుకుంటే తప్పేముంది ?
ఇటీవల హిందీభాష పట్ల తమిళనాడు తదితర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో మళ్లీ హిందీ సమస్య మొదటికి వచ్చింది. నిజానికి మనకు అసవరం లేకున్నా ఇంగ్లీష్ నేర్చుకున్నాం. బ్రిటిష్ వారు పాలించారు కనుక వారు బలవంతంగా రుద్దారు కనుక అది తప్పని సరయ్యింది.
అలాగే ముస్లిం రాజుల ఏలుబడిలో ఊర్దూను బలవంతం చేశారు కనుక ఉర్దూ నేర్చుకోక తప్పలేదు. చైనాలో ఉన్నత చదువుల కోసం వెళితే చైనీస్, జర్మన్ వెళితే జర్మన్, ఫ్రాన్స్ వెళితే ఫ్రాన్స్, రష్యా వెళితే రష్యన్ నేర్చుకోక తప్పడం లేదు. దీనివల్ల ప్రజలకు ప్రపంచంతో విస్తృత సంబంధాలు ఏర్పడుతాయి.
అవి వారికి ఉత్తమైన మాధ్యమంగా దోహదపడుతాయి. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నా ఏ దేశం కూడా తమ భాషపరిధిని తగ్గించుకోవడం లేదు. అలాగే ఆయా దేశాల ప్రతినిధులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు దుబాసీలను ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఐదురుగు సీనియర్ అధికారులను కాల్చేయించారు. ఎందుకంటే వారు ట్రంప్ ఇంగ్లీష్ ను సరిగా అర్థం చేసుకుని తనకు సరిగా వివరించి చెప్పలేకపోయారని ఆరోపించారు. అందుకే ట్రంప్తో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆగ్రహించాడు.
మనం స్వాతంత్రోద్యమ కాలంలోనూ బ్రిటిషర్లను వెళ్లగొట్టడానికి గాను మన వాళ్లు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని వారి భాషలో మాట్లాడి సమాచారాన్ని చక్కగా తెలుపగలిగాం. భాష ఏదైనా నేర్చుకుంటే ఉపయోగపడుతుందే తప్ప నిరుపయోగం కాదు.
మనదేశంలో భిన్న భాషలుండటం, భిన్న మతాలు, సంస్కృతులు వర్ధిల్లడం మన దేశ విశిష్టత. ఈ వైవిధ్యతను గర్వకారణంగా భావించేవారికీ... తమ భాషతో సమానంగా ఇతర భాషల్ని గౌరవించి, ప్రేమించే వారికీ కొదవలేదు. పరాయి భాషల పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించేవారూ ఎల్లవేళలా విజయం సాధిస్తూనే ఉన్నారు.
తమిళనాడుకు చెందిన ఎందరో నేతలు హిందీని ఔపోసన పట్టి రాజకీయంగా విజయం సాధించారు. జయలలిత లాంటి వారు జాతీయస్థాయిలో రాణించారు. అలాగే చిదంబరం,సుబ్రమణ్యస్వామి లాంటి వారి బలమంతా భాషలోనే ఉంది.
హిందీని జాతీయ భాషగా చేసి నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం రాగానే వ్యతిరేకించడం మంచిది కాదు. ప్రాంతీయ భాషలో బోధన జరుగుతూనే తమ భాషను నేర్చుకుంటూనే ప్రపంచానికి, దేశానికి అవసరమైన ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం వల్ల తప్పులేదు.
అయితే ఈ క్రమంలో ఆధిపత్య భావన ఉందని భావించిన కొందరు దీనిని | వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంగా దక్షిణాది వారు ఆధిపత్యం చలాయించడానికి అడ్డంకిగా హిందీ ఉంది. ఇది నేర్చుకుంటే పోయేదేమి లేదు. ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె.
కస్తూరిరంగన్ ఆధ్వర్యంలోని 9మంది సభ్యుల కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదా దేశంలో మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళనను రగిల్చింది. ఆ ముసాయిదా ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, ఆ వ్యవధిలో పిల్లలకు మూడు భాషల్ని పరిచయం చేయాలని సూచించింది.
ఆరో తరగతి నుంచి ఆ మూడు భాషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేందుకు విద్యార్థికి అవకాశం ఉండాలని ముసాయిదా చెబుతోంది. దాని ప్రకారం హిందీ భాషా ప్రాంతాల్లోని పిల్లలు హిందీ, ఇంగ్లిష్ తోపాటు మరో ఆధునిక భాషను నేర్చుకోవచ్చు.
హిందీయేతర ప్రాంతాల్లో హిందీ, ఇంగ్లిష్ తోపాటు స్థానిక భాష ఉంటుంది. సారాంశంలో హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకుతీరాలని నిర్దేశించింది. ఈ ముసాయిదాలో దాంతోపాటు అనేక కీలకమైన అంశాలున్నాయి.
వాటన్నిటిపైనా కూలంకషమైన చర్చ కూడా జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు... మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఈ మసాయిదాపై వ్యతిరేకత పెల్లుబికింది. పశ్చిమ బెంగాల్లో సైతం హిందీని రుద్దేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఉద్యమం ప్రారంభించారు.
ఇదంతా గమనించాక కేంద్ర ప్రభుత్వం తప్పనిస్థితిలో కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చింది ముసాయిదా నివేదికే తప్ప విధానం కాదని, ఆ కమిటీ చేసిన సిఫార్సుల్ని ప్రజాభిప్రాయం తెలుసు కోకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా అమలు చేయబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖియాల్ నిశాంక్తోపాటు ఇతర మంత్రులంతా హామీ ఇచ్చారు.
వాస్తవానికి ముసాయిదా రూపొందించే క్రమంలో కస్తూరి రంగన్ కమిటీ భిన్నరంగాలవారిని సంప్రదించింది. అవన్నీ పూర్తయ్యాక నిరుడు డిసెంబర్లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
హిందీ ఆధిపత్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకున్న అనుమానాలేమిటో, అభ్యంతరా లేమిటో గ్రహించడంలో కమిటీ | విఫలమైంది. కనీసం కేంద్ర ప్రభుత్వమైనా ఈ అయిదు నెలల్లో ముసాయిదాను క్షుణ్ణంగా పరిశీలించి వివాదాస్పద అంశాలను గుర్తించాల్సింది.
అది జరగకపోబట్టే నిరసనలు చెలరేగాయి. చివరకు ముసాయిదాలోని ఆ వివాదాస్పద క్లాజును సవరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. హిందీ తప్పనిసరన్న నిబంధన స్థానంలో ఆరు లేదా ఏడో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకే భాషను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తూ కొత్త నిబంధన తెచ్చారు. నిజానికి విద్యార్థులకు ఇతర భాషలను నేర్పడం వల్ల జ్ఞానం పెరుగుతుంది.
పరిచయాలు విస్తృతం అవుతాయి అవకాశాలు వరిస్తాయి. అయితే రాజకీయ నాయకులు . తమ పెత్తనం కోసం ఇలాంటి ఆందోళనలకు ఊపిరి పోస్తూ దేశంలో ప్రాంతీయ వాదాలను ప్రోత్సహిస్తున్నారు.
హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలు నేర్చుకోవడం అన్నది తప్పనిసరి చేస్తే విద్యార్థులకే మేలు s • ల • • • • • • o_ది . | దీనిని భాషాపరంగానే గుర్తించేలా, మార్కులతో సంబంధం లేకుండా సాగించేలా చేయాలి.
పరీక్షల కోసం కాకుండా భాసను ఐచ్చికంగా నేర్చుకునే వెసలుబాటు రావాలి. హిందీతో పాటు ఇతర భారతీయ భాషలను కూడా నేర్చుకునేలా చేయాలి. అప్పుడు పిల్లలకు జాతీయతా భావం కూడా పెరుగుతంది.