పత్తి రైతులను వెన్నాడుతున్న కష్టాలు

పత్తి రైతులను వెన్నాడుతున్న కష్టాలు 


వర్షాలతో పంట దిగుబడులపై ఆందోళన 


ఆదిలాబాద్ : పత్తి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆశతో పత్తిసాగు విస్తీర్ణాన్ని రైతులు గణనీయంగా సాగు చేయగా, ఇప్పుడు భారీవర్షాలతో దిగాలు పడుతున్నార J. ఖరీఫ్ సాగు మొదట్లో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు 15 రోజులుగా ఎదిగుబడులపై డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పత్తి సాగు దెబ్బతింటోంది. 


 


జిల్లాలో రైతులకు ప్రతీ యేటా కష్టం తప్పడం లేదు. అకాల వర్షం, ప్రకృతి బీభత్సంతో పత్తి రైతులు గోస పడుతున్నారు. సాగు ప్రారంభంలోనే నకిలీ విత్తనాలతో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించని బిటి-3 విత్తనాలను ఆంధ్రా, మహారాష్ట్రల నుంచి తీసుకవచ్చి అమ్మకాలు జరిపారు. 


  


అందులో నకిలీ విత్తనాలు కూడా రైతులకు అంటగట్టారు. కలుపు తీయడానికి కూలీల ఖర్చు భారంగా మారింది. దీనికి తోడు వాన దెబ్బ రైతులను మరింత కృంగదీసింది.


పంట  చేతికి వచ్చే దశలో పూత రాలిపోతుండగా దోమకాటు, రసం పీల్చేపురుగులు దాడి చేస్తున్నాయి. దీంతో పంట పై పెట్టుకున్న ఆశలు రైతులు వదులుకునే పరిస్థితి కనిపిస్తోంది. 


వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి ఎర్రబారుతుండగా.. కాయ కుళ్లిపోతోంది. మరోవైపు రసం పీల్చే పురుగు నష్టపరుస్తోంది. తెలంగాణ వ్యవసాయ మా ర్కెటింగ్ శాఖ, సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పొడవు గింజ పత్తి కనీసం మద్దతు ధర క్వింటాలుకు రూ.5550, మద్య పింజ పత్తి రూ.5255 మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది. 


  


వరుస వర్షాలతో దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంట చేజారిపో తుండడంతో ఆవేదన చెందు తున్నారు. సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచుకొని దిగుబడి కోసం ఆశగా ఎదు-రు చూస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు


 


  


 


. కాయ దశకు వచ్చిన పత్తికి పురుగు, తెగుళ్ల దాడి పెరిగిపోయింది. తెల్లదోమ భారీగా పెరిగింది. రసం పీల్చే పురుగు తోడైంది. దీనికి తోడు గులాబీ రంగు పురుగు పొంచి ఉండడంతో రైతులు భయప డుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల తెగుళ్లే కాకుండా మెగ్నీషియం లోపం కూడా తలెత్తుతోంది. 


Comments