దేశంలో ఏదో జరగబోతోందా ?

 దేశంలో ఏదో జరగబోతోందా ?


 


భారత దేశంలో ఏదో జరగబోతోందా? భారీ విధ్వంసానికి పథక రచన జరిగిందా? ఇప్పటికే ముష్కర మూకలు దేశంలోకి ఎంటరయ్యాయా? ఈ ప్రశ్నలన్నిటికి నిఘ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అందుతున్న వార్తలు కూడా అదే అంటున్నాయి. అయితే ఏం జరగబోతోంది? జమ్మూ కశ్మీరు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర రద్దుచేసిన తర్వాత దాయాది పాకిస్తాన్ భారత్ పై మరింత ద్వేషాన్ని పెంచుకుంది. 


భారత్ చర్యలను వ్యతిరేకిస్తూ పలు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను మళ్లీ పునరుద్దరించించింది. సర్జికల్ స్టయిలో ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరం ఒకటి. రెండు రోజుల క్రితం మన ఆర్మీ చీఫ్ స్వయంగా ఈ విషయం చెప్పారు. ఇదంతా ఎందుకు ? పుల్వామా తరహా దాడులా అంటే కాదు. 


  


ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను జైషే మహ్మద్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. దేశంలో భారీగా కల్లోలం సృష్టించటమే వారి లక్ష్యం. ఈ విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. జైషే మహ్మద్ తో కలిసి పాక్ గూఢచారి సంస్థ ఐఎన్ఏ భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్టు ఇంటిలిజెన్స్ విభాగం హెచ్చరించింది. 


జైషే మహ్మద్ ఉగ్రవాది షంషేర్ వనీ, మరో ఉగ్రవాదికి మధ్య జరిగిన లిఖితపూర్వక సంభాషణలను ఓ విదేశీ నిఘా సంస్థ గుర్తించి మనకు చేరవేసింది. జమ్మూ , అమృత్సర్, పఠాన్ కోట్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నో సహా దేశంలోని మొత్తం 30 నగరాలు ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాయని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ లోని కీలక తమ అనుచరులను సైన్యం మట్టుబెట్టడం సహా బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులతో జైషే మహ్మదక్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 


  


వీటికి తోడు ఆర్టికల్ 370 రద్దుతో ఆ సంస్థ మరింత రగిలిపోతోంది. అందుకు ప్రతీకారంగా భారీ దాడులకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ సారి కూడా దాడులకు ఉగ్రవాదులు ముందుగా ఎంచుకునేది హైదరాబాద్ నగరాన్నేనా అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా పెంచారు. అనుమనాస్పద ప్రాంతాలపై కన్నేసి ఉంచారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో అడుగు పెట్టిన ఉగ్రవాదుల్ని ఆర్మీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఇంకా చాలా మంది స్లీపర్ సెలా ఉండొచ్చన్న అనుమానం కూడా ఉంది. భారత్ తో మూఖా ముఖి తలపడే సత్త లేని పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయించేందుకు కుట్రలు పన్నుతోంది. 


 


  


ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతారనటం ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇండియాలో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చొరబడి ఉండొచ్చు. మరోవైపు భారత్ లో మారణహోమం సృష్టించడానికి 30 మందికి పైగా ఆత్మాహూతి దళ సభ్యులను జైషే మహమ్మద్ సంస్థ సిద్ధం చేసినట్లు కేంద్రానికి సమాచారం ఉంది. 


ఏ క్షణంలోనైనా వారు సరిహద్దులను దాటుకుని భారత గడ్డపై అడుగు పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. కశ్మీర్ నుంచి రాజస్థాన్ గుజరాత్ లోని సర్ క్రీక్ ప్రాంతం వరకు సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బార్డర్ లో పాక్ వైపున దాదాపు 500 మంది ఉగ్రవాదులు తిష్ట వేశారు. దీంతో ఆర్మీ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఎప్పుడైనా, ఏదైనా, ఎలాంటి పరిస్థితులైనా తలెత్తడానికి గల అవకాశాలున్నాయి. ఈ విషయాలు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా చెప్పటం పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. 


  


ఈ సందర్భంలో కేవలం ఆర్మీ, పోలీసులే అప్రమత్తమైతే సరిపోదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు ఎంతో అవసరం!! కశ్మీర్ పై ఏకాకిగా మారిన పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారింది. అది చేస్తాం ఇది చేస్తాం అని బీరాలు పోయి.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. జమ్మూ కశ్మీర్ అంశంలో ఏ దేశం కూడా పాకకు మద్దతు ఇవ్వడం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మిడియా ముందు వాపోవటం దాని పరిస్థితికి అద్దం పడుతోంది.


కశ్మీర్ అంశంలో ప్రపంచదేశాల తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని.. ఏ దేశం కూడా మోదీ మీద ఒత్తిడి తీసుకురావడం లేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిమిత్తం భారత్, పాక్ ప్రధానులిద్దరు న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ.. 'జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ అంశంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు


 


  


. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి మేం చేసిన ప్రయత్నాలు అన్ని వృథా అయ్యాయి. 100 కోట్ల జనాభా ఉన్న భారత్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఏ దేశం మాకు మద్దతివ్వడం లేదు.. మోదీని వ్యతిరేకించడం లేదు. కశ్మీర్ అంశంలో యుద్ధం మినహా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం' అని తెలిపారు. పాక్ కు మద్దతు కొరవడటమే కాక ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా పరిష్కరించుకోమని సూచించాయి.


Comments