పడకంటి మనసులో మాట 31.05.2020 PART I


పడకంటి మనసులో మాట......... 


 


భారత్ లో కరోనా విజృంభణ కేంద్రం వ్యూహ వైఫల్యం


  


కరోనా ప్రపంచ మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమించిన ఒక మహా సంక్షోభం. అందులో సందేహం లేదు. అమెరికా, రష్యా, ఇటలీ, స్పెయి ఎన్, బ్రెజిల్ దేశాలు కరోనా మహమ్మారి దాడిలో సాలెగూడులో చిక్కుకున్న చందంగా విలవిలలాడుతున్నాయి. తమ దేశ ప్రజలను కాపాడుకోవడానికి అన్ని యత్నాలూ చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా, ఆర్థిక మందగమనం నుంచి బయటపేందుకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నా, కరోనా పరీక్షల విషయంలో ఆ దేశాలు ఇసుమంతైనా రాజీ పడటం లేదు. అదే భారత్ విషయానికి వస్తే కరోనా లెక్క తక్కువ చూపడానికో, లేదా దేశంలో మరణాల రేటు చాలా తక్కువ ఉందని చెప్పుకోవడానికో పరీక్షలు నిర్వహిస్తున్న చందంగా ఉంది. ర్యాండమ్ పరీక్షలు కాదు. సమగ్ర సర్వేలా ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి పౌరుడికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. మొబైల్ పరీక్షల విధానాన్ని కూడా చేపట్టాలి. వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారితో పోరులో దేశం గెలిచి నిలవాలంటే అది తప్పదు. సడలింపులు ఇచ్చేస్తూ.. లాక్ డౌన్ పొడిగించుకుంటూ వెళ్లడం వల్ల పలితం ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇప్పటికైనా కరోనా కట్టడి విషయంలో ఆర్థిక అంశాలను జోడించకుండా ప్రధాని మోడీ తన వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.


______________________________________________________కరోనా ప్రపంచ మానవాళి మనుగడనే ప్రమాదంలో పడేసిన మహా విపత్తు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి చెందిన దేశాలూ, అభివృద్ధి చెందుతున్న దేశాలూ, వెనుకబడిన దేశాలూ అన్న తేడా లేదు. సంపన్నులు, పేదలు అన్న బేధం లేదు. అందరికీ కరోనా ముప్పు పొంచి ఉంది.


మానవుడు అంటేనే సామాజిక జీవి. అటువంటి మానవాళి ఇప్పుడు సామాజిక దూరం పాటించడానికి నానా అగచాట్లు పడుతోంది. తప్పదు. వ్యాక్సిన్ కనుగొనేదాకా...సామూహిక కార్యక్రమాలేవీ ఆచరణీయం కాదు. కొద్దిగా ఆలస్యమైనా ప్రధాని మోడీ లాక్ డౌన్ నిర్ణయం తీసుకుని మంచి పనే చేశారు.ఆ లాక్ డౌన్ కారణంగానే మహమ్మారి వ్యాప్తి వేగం తగ్గింది. ఇక నియంత్రణలోనికి వస్తున్నది అనుకునేలోగా కేంద్రం పట్టు వదిలేసింది. సడలింపుల పేరుతో కరోనా కట్టడికి పట్టి ఉంచిన కల్లెం వదిలేసింది. మినహాయింపులంటూ చేతులెత్తేసింది. రెండో విడత లాక్ డౌన్ వరకూ పరిస్థితి అదుపులోనే ఉన్నా.. మూడో విడత లాక్ డౌన్ లో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.


మినహాయింపుల కారణంగా జనం సామాజిక దూరం పాటించే అవకాశం లేకుండా పోయింది. ఇక నాలుగో విడత లాక్ డౌన్ అమలులోకి వచ్చే సరికి మేం చేతులెత్తేశాం...మీ చావు మీరు చావండి అన్నట్లుగా జనం ఆరోగ్య భద్రతను కేంద్రం గాలికి వదిలేసింది. ఇప్పుడు ఇక ఐదో విడత లాక్ డౌన్ రేపటి నుంచి అమలు కానుంది.ఈ లాక్ డౌన్ సందర్భంగా ఇస్తున్న వెసులు బాట్లు, సడలింపులు కరోనా మహమ్మారి విజృంభణను మరింత వేగవంతం చేసేలా ఉన్నాయని వైద్య నిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వర్షాకాలంలో కరోనా వ్యాప్తి ఉదృతి తీవ్రతను ఊహించడమే కష్టమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను సైతం పక్కన పెట్టి ప్రజారోగ్యాన్ని గాలిలో దీపంలా వదిలేయడానికి కేంద్రంపై పని చేసిన ఒత్తిడులేమిటో ఊహించలేనివేమీ కాదు.ఇన్ని రోజుల వరకూ నగరాలకే పరిమితమైన కరోనా మహమ్మారి లాడ్ డౌన్ 3 నుంచి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ఇప్పుడిక లాక్ డౌన్ 5తో అది మూరుమూల గ్రామాలకూ విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు, సామాజిక వేత్తలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.


ప్రజారోగ్యం ముందు ఆర్థిక పరిస్థితి ఒక లెక్కలోకి వచ్చే విషయం కాదని జనతా కర్ఫ్యూ సందర్భంగా ఘనంగా ప్రకటించిన మోడీ....నెల రోజులు తిరిగే సరికి మాట మార్చేశారు. ప్రజారోగ్యంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడకుండా చూసుకోవడం కూడా ముఖ్యమేనన్నారు.నాలుగో విడత లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చే సరికి ప్రజారోగ్యం బాధ్యత ప్రజలదేననీ, మా బాధ్యత దేశం ఆర్థికంగా వెనుకబడకుండా ముందుకు సాగేలా చూడడమేననీ చెప్పకనే చెప్పేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత అత్యంత ఉదృతంగా ఉన్న తరుణంలోనే ప్రధాని మోడీ రెండో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భం వచ్చింది.


ఆ సందర్భాన్ని మోడీ కరోనా కట్టడికి ప్రజలు ఏ రీతిన సహకరించాలో చెప్పి వారిని చైతన్య వంతులను చేయడానికి ఉపయోగించుకుంటారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా తాను రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత బ్రహ్మాండం బద్దలైపోయేలా అద్భుత విజయాలు సాధించానంటూ చెప్పుకోవడానికే పరిమితమయ్యారు.ట్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణం, పౌరసత్వ చట్టం అంటూ దీర్ఘకాలిక వివాదాస్పద సమస్యలను చిటికెలో పరిష్కరించేశానని చెప్పుకున్నారు. ఇప్పటికైనా ప్రధాని కరోనా కట్టడి విషయంలో వ్యూహాలను మార్చాల్సిన అవసరం ఉంది. 135 కోట్ల జనాభా ఉన్న భారత్ లో మానవ వనరులకు కొరత లేదు.ఇప్పుడు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నా తరువాత మరింత వేగంతో ప్రగతి రథం పరుగులు పెట్టేందుకు అవసరమైన శకి భారత్ కు ఉంది. కేవలం భారత్ కు మాత్రమే ఉంది. ఇక్కడి సంసృతి, జీవన విధానం అందుకు దోహదపడతాయి. మోడీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.


ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కరోనా కట్టడి చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 


1. సినిమా హాల్స్ 


2. జిమ్స్  సెంటర్స్


3. మెట్రో రైళ్లు


4.  బార్లు - పబ్బులు, క్లబ్బులు   


5. స్విమ్మింగ్ పూల్స్


6.  పార్కులు


7. సభలు - సమావేశాలు


8. అంతర్జాతీయ విమానాలు వీటితోపాటు ముఖ్యంగా భారత దేశంలో తెరవపడిన వైన్ షాపులు అన్నిoటిని నిషేధము లోకి తీసుకరావాలి .


మూసి వేసిన వెంటనే కరోనా కేసులు పెరగకుండా ఆగిపోవచ్చును.


______________________________________________________


CLICK ME FOR PART II


Comments