స్వరం నేపాల్ ది వ్యూహం చైనాది
ప్రధాని ఓలీ వ్యాఖ్యలతో విశ్లేషిస్తున్న భారత్ సరిహద్దు సమస్యలకు ద్వైపాక్షిక చర్చలే ముఖ్యమని స్పష్టీకరణ
ఇంతకాలం భారత్ తో అత్యంత స్నేహంగా ఉంటూ.. అన్నరంగాల్లో సాయం పొందుఉతన్న నేపాల్ మాటమార్చడం, నాలుక తిప్పడం వెనక ఏమై ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
చైనా కనుసన్నల్లో నేపాల్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా వరసగా రెండు మూడు రోజులుగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆరోపణలపై కేంద్రం ధీటుగా స్పందిస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది.
భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాపన్ను నేపాల్ మంత్రిమండలి ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.
ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల విషయంలో గత పాలకుల మాదిరి తాము వెనుకంజ వేయబోమని, వాటిని దక్కించుకుని తీరతామని ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్ కారణమంటూ మరోసారి వివాదానికి తెరతీశారు. ఇది చైనా ఆడిస్తున్న నాటకంగానే భారత్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో నేపాల్ రూపొందించిన మ్యాప్ కు ఎలాంటి చారిత్రాత్మకత ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగశాఖ తేల్చి చెప్పింది.
సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
టిబెట్ లోని మానస సరోవర్ పుణ్య క్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది.
ముఖ్యంగా ఈనెల 11న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకూ మానస సరోవర్ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్ లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది.
అందుకే నేపాల్ పేచీ వెనక ఎవరో' వున్నారని జనరల్ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్ కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్వాత్మకం కానుంది.
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్ మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకూ . ముదురుతోంది. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్ ను డిమాండ్ చేస్తూ.. అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.
ఇకనైనా ఇలాంటి అన్యాయ పూరితమైన పటాలు విడుదల చేయడం ఆపేయాలని నేపాల్ ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరుతున్నాం.
నేపాలీ అధినాయకత్వం సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.