దేశంలో కొత్త జవసత్వాలకు ఇదే అదను

దేశంలో కొత్త జవసత్వాలకు ఇదే అదను


ఐటి,ఫార్మా,రియల్ రంగాలకు అండగా నిలవాలి


 


హైదరాబాద్ : భారతీయ ఆర్థిక వ్యవస్థలో గ్రామాణ ఆర్థికరంగం వాటానే ఎక్కువ. దేశానికి కొత్త జవసత్వాలనిచ్చేందుకు ఇదే మంచి సమయం. రూపాయి బలో పేతానికి అనుసరించాల్సిన మార్గాలపై కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రానికి సూచించారు.


దీంతో వివిధ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అండగా నిలిస్తే ఉత్పత్తి, సేవా రంగాలు ఆరునెలల్లో గాడినపడతాయి. లాక్ డౌన్ కారణంగా ఇప్పటి వరకు ఐటీ రంగం ఇప్పటికే నష్టపోగా, మరో రెండు నెలలు దానిపై కరోనా సంక్షోభ ప్రభావం ఉంటుంది.



కొత్తగా ప్రాజెక్టుఉల రాకపోతే తీవ్ర నష్టాలను చవి చూడాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశ ఆలు త్వరగా కోలుకునే కాలాన్ని బట్టి దీనిపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా 17 శాతం కాగా ఇందులో ఐటీరంగం వాటా కొద్ది మాత్రమే.


కాబట్టి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, పింక్ స్లిప్ జారీ వంటివి పెద్దగా ప్రభావం చూపవని అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి ఇకముందు కొనసాగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.


డేటా సెక్యూరిటీ, పనిలో నాణ్యత వంటివి దృష్టిలో పెట్టుకుని ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి వంద చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున ఆఫీస్ స్పేస్ ఉండగా, భౌతికదూరం నిబంధన నేపథ్యంలో 150 చదరపు అడుగులకు విస్తరించాలి.



కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు అమెరికా, యూరోప్ లోని చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు ప్రస్తుత సంక్షోభం తర్వాత ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిం వచ్చని అంటున్నారు.


ఆతిథ్య రంగంలోనూ భౌతికదూరం నిబంధనతో నిర్మాణరంగానికి డిమాండ్ పెరగొచ్చంటున్నారు. కరోనా సంక్షోభానికి ఆర్నెల్ల ముందే ఆర్థిక పరిస్థితి ప్రపంచంతో పాటు భారత్ లో కూడా మందగమనంతో సాగుతూ వచ్చింది.



దీంతో మనం కరోనాకు ముందు, ఆ తర్వాతి పరిస్థితులను శాస్త్రీయంగా సమీక్షించుకోవాలి. 2022 లేదా 2023 నాటికి ఉండే పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకెళ్లాలి. గతంలో కరువు నుంచి వ్యవసాయ రంగం హొటెక్కినట్టే ప్రస్తుత సంక్షోభం నుంచి ఉత్పత్తి, సేవా రంగాలు తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.


గతంలో వరుసగా రెండు, మూడేళ్ల పాటు కరువొచ్చినా ఈ రంగం తిరిగి పుంజుకుంది. ఈ ఏడాది తెలంగాణ, ఏపీ లో వ్యవ సాయరంగం పురోగతి సాధిస్తోంది. ప్రభుత్వం ఈ రంగానికి అండగా నిలిస్తే గ్రామాణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది.



ఇదే తరహాలో ఉత్పత్తి, సేవా రంగాలూ పుంజుకుంటాయి. పెద్ద పరిశ్రమల మనుగడకు జీఎస్టీ నిబంధనల సడలింపు, రుణాల వసూలుపై మారటోరియం వంటివి అమలుచేయాలి. సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం సులభతర వాణిజ్య విధానాలు అమలయ్యేలా చూడాలి.


హెలికాప్టర్ మనీ ఆలోచన మంచిదే కానీ సరైన పర్యవేక్షణ లేకుంటే వియత్నాం తరహా ప్రతికూల ఫలితాలు వస్తాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం విషయానికొస్తే.. నిర్మాణ, ఇతర రంగాల్లో పనిచేసేందుకు తెలంగాణ గ్రామాణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే కార్మికుల సంఖ్య వచ్చే పదేళ్లలో పదింతలు కావచ్చు. ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, ఎంఎస్ఎంఈ రంగాల్లో హైదరాబాద్ సాధిస్తున్న పురోగతే దీనికి కారణం. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా ఆదుకునేందుకు ముందుకు రావాలి.


Comments