పడకంటి మనసులో మాట 07.06.2020


పడకంటి మనసులో మాట... 


 


కరోనా కట్టడిలో కేంద్రం విఫలం ఒత్తిడులకు తలొగ్గి నిర్ణయాలు 



మాస్కులు  కట్టుకున్నాచేతులు శుభ్రం చేసుకు న్నా కరోనా వ్యాప్తిని అరికట్టలేమన్న విషయాన్ని గుర్తించాలి. ఎయిమ్స్ లో, ముంబైలో, అమెరికాలో చాలా మంది డాక్టర్లకు కరోనా సోకిందని, వారికి కూడా కిట్లు లేకపోవడంతోనే వ్యాధి ఉంటుందని చెప్పారు. ఇకపోతే లాక్ డౌన్ సడలింపులు, ఇతర వచ్చిందా అని ఈటెల ప్రశ్నించారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ సోకే అవకాశంఉంటుందని చెప్పారు.


ఇకపోతే లాక్ డౌన్ సడలింపులు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలతోనే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని కూడా చెప్పారు. ముంబై, భివండి నుంచి వచ్చిన వలస కూలీల్లో చాలా మందికి కరోనా .. సోకిందని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కరోనా రక్షణ చర్యలు ఎలా ఉన్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఇది దేశమంతటా ఉన్న పరిస్థితిని గుర్తుచేస్తోంది.



దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎలాంటి సహకారం లేకుండా మీ బాధలు మీరు పడండి అన్న రీతిలో రాష్ట్రాలను కరోనా కట్టడి విషయంలో ముందుకు సాగమని మోడీ సర్కార్ చెబుతున్నది. వలస కార్మికుల బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఏ రాష్ట్రాలలో ఉన్న వలస కార్మికులను ఆ రాష్ట్రాలే చూసుకోవాలన్న చందంగా వ్యవహరించింది.


వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు వేసిన శ్రామిక్ రైళ్ల ఖర్చులను అంటే వలస కార్మికుల ప్రయాణ చార్జీలను కూడా రాష్ట్రాపైనేమోపింది. జక దేశంలో కరోనా కేసులు పెరుగుతన్నకొద్దీ మరణాలు కూడా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇటలీని మించిందన్న వార్తలు వస్తున్నాయి. లా డౌన్ నిబంధనలు పూర్తిగా సడలించడంతో పాటు, రాకపోకలు పెరగడంతో కరోనావ్యాప్తి కూడా వేగంగా విస్తరి స్తోంది. వలస కార్మికుల నుంచి గ్రామాలకు చేరుతోంది.



ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ,ఎపిల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలిస్తే వలసకూలీల రాక తరవాత పెరిగాయి. ఇదే విషయాన్ని మంత్రి ఈటెల పదేపదే చెబుతుండగా ,దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు 15 రోజుల్లో వలసకూలీలను స్వగ్రామాలకు తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


ఈదశలో వైద్యవిభాగంలో ఉన్న సిబ్బందికి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. వారు ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మరోవైపు తెలంగాణలో అవసరమైన మేరకు పరీక్షలు జరగడం లేదన్న విపక్షాల ఆరోపణలను మంత్రి ఈటెల తిప్పి కొట్టారు.



కొందరు రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సరైన చికిత్స చేయట్లేదని, వైద్యులకు కిట్లు ఇవ్వట్లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే ఆరోపణలు చేయాలని సూచించారు.


పీపీఈ కిట్లు, మాస్కులు వాడుతున్న డాక్టర్లకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని, కిట్లు లేకపోవడం వల్లే డాక్టర్లకు కరోనా సోకిందనడం సరికాదని పేర్కొన్నారు. దీన్ని బట్టి మాస్కుల కట్టుకున్నా,చేతులు శుభ్రం చేసుకు న్నా కరోనా వ్యాప్తిని , అరికట్టలేమన్న విషయాన్ని గుర్తించాలి.



ఎయిమ్స్ లో, ముంబైలో, అమెరికాలో చాలా మంది డాక్టర్లకు కరోనా సోకిందని, వారికి కూడా కిట్లు లేకపోవడంతోనే వ్యాధి వచ్చిందా అని ఈటెల ప్రశ్నించారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు వైరస్ సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇకపోతే లాక్ డౌన్ సడలింపులు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలతోనే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని కూడా చెప్పారు.


ముంబై, భివండి నుంచి వచ్చిన వలస కూలీల్లో చాలా మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కరోనా రక్షణ చర్యలు ఎలా ఉన్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఇది దేశమంతటా ఉన్న పరిస్థితిని గుర్తుచేస్తోంది.



ఇంతకాలం జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కరోనా .. ఇప్పుడు కూలీలుకుంటుతున్న వలస కూలీలు కరోనాను కూడా తమవెంట తీసుకెళ్తున్నారు. సొంతూరుకెళ్లితే బుసాకయినా తిని బతుకుదామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు.


దేశంలో కరోనా కేసులు వందలు,వేలు దాటి లక్షల్లోకి చేరుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవు తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. పక్షం రోజుల క్రితం వరకు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు పల్లెల్లో వేగంగా విస్తరిస్తున్నది.



లాక్ డౌన్ సడలింపులతో నగరాల నుంచి లక్షలమంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరుకున్న తరవాతనే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. వీరిలో అత్యధికులు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల వారే ఉన్నారు.


పనుల్లేక కష్టాలుపడుతున్న కార్మికులను ఆయా రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా సొంత గ్రామాలకు తరలించాయి. కార్మికుల కష్టాలు చూడలేక సొంత ఖర్చులతో ప్రత్యేక రైళ్లద్వారా వేలమందిని వారి స్వస్థలాలకు తరలించింది. అంతకుముందే కొంతమంది నడుచుకుంటూ సొంత గ్రామాలకెళ్లిపోయారు. వారు స్వస్థలాలకు చేరుకున్న తర్వాత నిర్వహిస్తున్న పరీక్షల్లో వందల కేసులు బయటపడుతున్నాయి.



అలా ఉత్తరాదికే పరిమితం కాకుండా దక్షిణాది గ్రామాల్లోనూ కరోనా విస్తరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో గత మూడువారాల్లో 1500 కేసులు నమోదుకాగా, అందులో 500 కేసులు గ్రామాల్లోనే వెలుగులోకి వచ్చాయి. ఒడిశాలో ప్రస్తుతం 80శాతం కరోనా కేసులు గ్రామాల్లోనే నమోదవు తున్నాయి.


ఈ రాష్ట్రానికి దేశం నలుమూలల నుంచి ఇప్పటివరకు వచ్చిన 4.5 లక్షల మంది వలసకూలీల్లో 80శాతానికి పైగా 11 గ్రామాణ జిల్లాలవారే. ఇప్పుడు అక్కడే కేసులెక్కువ. కరోనా భయంతో చాలాచోట్ల వలస కార్మికులను ఊళ్లలోకి రానివ్వకపోవడంతో ఊరి పొలిమేరల్లో బతుకుతున్నారు.



పశ్చిమబెంగాల్ లో మార్చిలో కేసులు కేవలం కోల్ కతాలోనే నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర రాజధానికి సుదూరంగా ఉన్న మాల్టా, ఉత్తర మిడ్నాపూర్, దక్షిణ మిడ్నాపూర్, హూగ్లీ, కూచ్ బిహార్ జిల్లాల్లోనే ఎక్కువగా విస్తరిస్తున్నది. ఈ రాష్ట్రానికి ఇటీవల 6 లక్షలమంది వలస కూలీలు చేరుకోవటంతో వైరస్ గ్రామాల్లోకి పాకింది.


బీహార్ లో ప్రస్తుతం 70శాతం కేసులు వలస కూలీలవేనని, వారంతా గ్రామాణులే. పనుల్లేక సొంతూర్లకు వెళ్లిపోయిన కార్మికులను వెనక్కు తీసుకురావటానికి పలు రాష్ట్రాలు అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బీహార్ నుంచి 150 మంది కార్మికులను తీసుకొచ్చేందుకు ఓ విమానాన్నే బుక్ చేసింది.



వలస కూలీలపైనే ఆధారపడి వ్యవసాయం చేసే పంజాబ్ లో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు రైతులు రెట్టింపు వేతనాలు ఇవ్వజూపుతున్నారు. హర్యానా తదితర రాష్ట్రాల్లో చిన్నచిన్న వ్యాపారులూ కార్మికులకు కార్లు, బస్సులు బుక్ చేస్తున్నారు. తిరిగివచ్చే కార్మికుల కోసం కేరళ ఏకంగా ఓ ఆరోగ్య బీమా పథకాన్నే ప్రకటించింది.


ముంబైలో భవన నిర్మాణ కంపెనీలు కార్మికుల ఉద్యోగ భద్రత, రక్షణకు సంపూర్ణ హామీ ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కొన్ని కంపెనీలు గ్రామాణ కూలీలను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇలా చేరుకున్న కూలీలు తమకు తెలియకుండానే వైరసను మోసుకొచ్చారు.



ఇప్పుడది ఎంతగా విస్తరిస్తుందన్న తెలియడం లేదు. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య ఇప్పుడున్న దనాఇకన్నా రెట్టింపయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అప్పుడు ప్రభుత్వం చేతులెత్తేస్తే చేసేదేమీ లేదు. ప్రజలు వ్యక్తిగత భద్రతను విస్మరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే.



 _____________________________________________________


కరోనా కట్టడి విషయంలో ముందునుంచీ కేసీఆర్ ది ముందుచూపే 



కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. భారత్ అందుకు మినహాయింపు కాదు. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా. కరోనా విస్తరణ భారత్ లో పెరుగుతున్న తీరు చూస్తుంటే... మహమ్మారి జన సాంద్రత అధికంగా ఉండే మహానగరాలపై (మెట్రోపాలిటిన్) ఎక్కువ ప్రభావం చూపుతున్నదని అర్ధమౌతుంది.


భారత్ లో మెట్రోపాలిటన్ నగరాలలో కరోనా తీవ్రత భయం గొల్పే రీతిలో ఉంది. ముంబై, పూణె, చెన్నై, కోల్ కతాలలో కరోనా వ్యాప్తి వేగం చూస్తుంటే ఇది అవగతమౌతుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం ఆ తీవ్రతకు అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్ ప్రభుత్వం సఫలీకృతమైంది.



మహమ్మారి వైరస్ వ్యాప్తి విషయంలో భవిష్యత్ లో అది సృష్టించే విలయాన్ని, వ్యాప్తి తీవ్రతను ముందుగానే గుర్తించిన కేసీఆర్ దేశంలో మరే ఇతర రాష్ట్రం కంటే తొలి రెండు దశల లాక్ డౌన్ ను రాష్ట్రంలో అత్యంత కఠినంగా అమలు చేశారు. పరీక్షల సంఖ్య విషయంలో తెరాస సర్కార్ పై వస్తున్న విమర్శలలో కూడా పస లేదు.


దేశ వ్యాప్తంగా ఒకటి రెండు రాష్ట్రాలు వినా అన్ని రాష్ట్రాల సగటు కరోనా నిర్ధరణ పరీక్షల రేటుకు తెలంగాణ ఎన్నడూ తగ్గలేదు. సహజంగానే లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో... వలస కార్మికుల రాక, విదేశాల నుంచి రాకతో దేశంలో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. అందుకు తెలంగాణ కచ్చితంగా మినహాయింపు.



గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో కరోనా వ్యాప్తి కట్టడి భేషుగ్గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించి కూడా తెలంగాణ కరోనా కట్టడి విషయంలో అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాల్సిందిగా సిఫారసు చేసింది.


కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్ పేదల కష్టాల పై స్పందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆహారం లేక ఇబ్బంది పడకూదన్న లక్ష్యంతో వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు బియ్యం పంపిణీ, నగదు బదలీ వంటి చర్యలతో రాష్ట్రంలో పేదలను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు.



కరోనా ఆసుపత్రులు, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స వంటి విషయాలలో ఎక్కడా రాజీ పడలేదు. ఇప్పటికీ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్య నగరంలో కరోనా కట్టడిలోనే ఉందంటే అందుకు కారణం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం.


అయితే కేంద్రం సడలింపుల బాట పట్టడం.... లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోకపోవడం వంచి చర్యలతో కేంద్రమే తెలంగాణ పోరాటాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరించిందని చెప్పాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అంటూ కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన భరోసా వారిలో ధైర్యాన్నీ ధైర్యాన్ని నింపింది.



లాక్ డౌన్ నాలుగు పూర్తి అయిన తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులు కరోనా కట్టడిలో భారత పోరాటాన్ని నీరు గార్చాయనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందు చూపుతో కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో మహమ్మారి అదుపులోనే ఉంది. హైదరాబాద్ మహానగరం వినా మిగిలిన రాష్ట్ర మంతా దాదాపు కరోనా ఫ్రీ అన్న స్థాయికి చేరుకుంది.


హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడిలోకి రాలేదు సరికదా రోజు రోజుకూ విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్క హైదరాబాద్ అని మాత్రమే కాదు... దేశంలో మెట్రోపాలిటన్ నగరాలలో కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాలు అవలంబించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అందరి కంటే ముందుగానే కఠినమైన చర్యలతో... కట్టుదిట్టంగా లాక డౌన్ ను జూన్ 5వ తేదీ వరకూ కొనసాగిస్తేనే మేలని చెప్పారు.



లాక్ డౌన్ కొనసాగించక తప్పదని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. అదే జరుగుతోంది. అయితే కేంద్రం రాష్ట్రాలను ఇతోధికంగా ఆదుకుంటే మాత్రమే రాష్ట్రాలు లాక్ డౌన్ ను సమర్థంగా అమలు చేయగలుగుతాయని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు.


అయితే కేంద్రం రాష్ట్రాలను ఆదుకునే విషయంలో రాజకీయ లాభ నష్టాల బేరీజులో మునిగి తేలడం వల్లనే లాక డౌన్ సడలింపులు అనివార్యమయ్యాయని అమర్త్య సేన్ వంటి నిపుణులు చెప్పారు. కేసీఆర్ స్వరమే అది. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ రంగం కరోనా కల్లోల పరిస్థితుల్లో సైతం పచ్చగా ఉంది.


 ______________________________________________________


జగన్ సర్కార్ దృష్టంతా రాజకీయాలపైనే 



జగన్ సర్కార్ కరోనా కట్టడి కంటే రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం కోసమే సమయమంతా వెచ్చిస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించిన వైద్యుడు డాక్టర్ సుధాకర్ పై కక్ష సాధింపు చర్యలూ, కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ పంచాయతీ కార్యాలయాలపై రంగుల విషయంలో అడ్డగోలు జీవోలతో వివాదాల సుడిలో చిక్కుకు పోయింది.


కేంద్రం సడలింపుల కంటే ముందే... ఆర్థిక కార్యకలాపాలను ఆరంభించడానికి ఏపీ సర్కార్ పడిన తొందర ఫలితం ఇప్పుడు కరోనా కేసుల విజృంభణ రూపంలో కనిపిస్తున్నది. మార్గదర్శకాల మాటే ఎత్తకుండా కరోనాతో సహజీవనం చేయడమంటే జనం అందరికీ కరోనా సోకి తీరుతుంది... ఎవరు మాత్రం ఏం చేయగలరన్న నిర్లిప్తతతో ్యవహరిస్తున్నది.



ఆ కారణంగానే ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రత తమిళనాడుతో పోల్చదగినది ఉంది. అయితే కరోనా కేసుల లెక్కల విషయంలో జనాన్ని గందరగోళంలో పడేయడంలో మాత్రం జగన్ సర్కార్ విజయం సాధించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఇంత మందికి, వలస కార్మికుల్లో ఇంత మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇంత మందికి అంటూ వాస్తవ సంఖ్య ఏమిటన్నది ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.


ఎవరెవరు ఎక్కడ నుంచి వచ్చినా అందరూ ఆంధ్ర పద్రేశ్ కు చెందిన వారేనన్న విషయాన్ని జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నది. ఎక్కడ నుంచి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే వారు రాష్ట్రంలోనికి వచ్చారన్న విషయాన్ని విస్మరిస్తున్నది.



రాజకీయ కార్యకలాపాలకు ఇస్తున్న ప్రాధాన్యత కరోనా కట్టడికి ఇవ్వడం లేదన్న భావన సామాన్య ప్రజలలో కలిగే విధంగా జగన్ సర్కార్ తీరు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో గత మూడువారాల్లో 1500 కేసులు నమోదుకాగా, అందులో 500 కేసులు గ్రామాల్లోనే వెలుగులోకి వచ్చాయి. ఒడిశాలో ప్రస్తుతం 80శాతం కరోనా కేసులు గ్రామాల్లోనే నమోదవు తున్నాయి.


ఈ రా ష్ట్రానికి దేశం నలుమూలల నుంచి ఇప్పటివరకు వచ్చిన 4.5 లక్షల మంది వలసకూలీల్లో 80శాతానికి పైగా 11 గ్రామాణ జిల్లాలవారే. ఇప్పుడు అక్కడే కేసులెక్కువ. కరోనా భయంతో చాలాచోట్ల వలస కార్మికులను ఊళ్లలోకి రానివ్వకపోవడంతో ఊరి పొలిమేరల్లో బతుకుతున్నారు.



పశ్చిమబెంగాల్ లో మార్చిలో కేసులు కేవలం కోల్‌కతాలోనే నమోదయ్యాయి.


ఇప్పుడు రాష్ట్ర రాజధానికి సుదూరంగా ఉన్న మాల్టా, ఉత్తర మిడ్నాపూర్, దక్షిణ మిడ్నాపూర్, హూగ్లీ, కూచ్ బిహార్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరిస్తున్నది.


 ______________________________________________________________


For more updates:


Follow us on Facebook:  https://www.facebook.com/padakanti9/


Join our Facebook group: https://www.facebook.com/groups/538636313431680/?ref=share


Follow us on Instagram:


https://instagram.com/news9.india?igshid=1vrlidszjnziz


Comments