పడకంటి మనసులో మాట 16.08.2020


పడకంటి మనసులో మాట ...


________________________________________________________________


ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మక మైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని వెూదీ వెల్లడించారు. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగు పరుస్తుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణ సిఎం గతంలోనే ఈ ప్రకటన చేశారు. అందరి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేస్తామని అన్నారు. దీనిద్వారా వ్యక్తి ఆరోగ్య వివరాలను అందులో పొందుపర్చడం ద్వారా ఇక ముందు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా త్వరగా తెలుసుకుని చికిత్స అందించే వీలు కలుగుతుంది. ఆయితే జాతీయస్థాయిలో దీనిని తీసుకుని రావాలన్న ఆలోచన మంచిదే.


________________________________________________________________


ఆత్మనిర్భరభారత్‌ లక్ష్యం సాకారం కావాలిస్వాంతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రవెూదీ ఎర్రకోట వేదికగా అనేక విషయాలు ప్రకటించారు. గతాన్ని స్పృశిస్తూనే వర్తమానాన్ని వివరిస్తూ భవిష్యత్‌ దార్శనికతను ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.


ఈ లక్ష్యంలో ముందుకు సాగేలా చిత్తశుద్దితో ముందుకు సాగాలి. ఇందుకు ఆత్మస్థయిర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి.అందుకు ప్రధాని వెూడీ మరింత కఠినంగా భారత్‌ స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రయాణం సాగించాలి. ఇకపోతే ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మక మైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.


ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని వెూదీ వెల్లడించారు.ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగు పరుస్తుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణ సిఎం గతంలోనే ఈ ప్రకటన చేశారు. అందరి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేస్తామని అన్నారు. దీనిద్వారా వ్యక్తి ఆరోగ్య వివరాలను అందులో పొందుపర్చడం ద్వారా ఇక ముందు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా త్వరగా తెలుసుకుని చికిత్స అందించే వీలు కలుగుతుంది.


ఆయితే జాతీయస్థాయిలో దీనిని తీసుకుని రావాలన్న ఆలోచన మంచిదే. దీంతో పాటు దేశంలో కార్పోరేట్‌ ఆస్పత్రుల దాష్టీకం పెరుగుతున్నందున ప్రభుత్వ పరంగా వైద్యశాలలను పటిష్టం చేయాల్సి ఉంది. ఇలా చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కడమే గాకుండా ప్రజలకు కూడా వైద్యం అందనుంది.ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేసేలా నిధులను విడుదల చేయడం, కార్పోరేట్‌ కంపెనీలు సహకరాం అందించేలా చేయడం ద్వారా ఆస్పత్రులను బలోపేతం చేయవచ్చు. అలాగే సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉందన్నారు.


దీనికింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందనున్నాయి. అలాగే ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలగనుంది. ఇకపోతే దేశంలో కరోనావైరస్‌ మహమ్మారి విలయ తాండవం కారణంగా టెలీ మెడిసిన్‌, డిజిటల్‌ వైద్య సేవలకు ప్రాముఖ్యత ఏర్పడింది.కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు ఆవెూదం, అనుమతి లభించి వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామనీ, దానికోసం రోడ్‌మ్యాప్‌ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు.


కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన వెూదీ దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు. దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు ,ఇతర కరోనా యోధులకు వెూదీ కృతజ్ఞతలు తెలిపారు.ఒక విపత్కర సమయంలో ఉన్నాం. ఈ మహమ్మారి కారణంగా తాను పిల్లలను ఎర్రకోటవద్ద చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చాలా కుటుంబాలు ప్రభావితం అయ్యాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 130 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో, ఈ మహమ్మారిని ఓడిస్తామని ప్రధాని వెూదీ అన్నారు.


ప్రధాని వెూడీ వరుసగా ఆరేళ్లుగా ఎర్రకోటపై నుంచి జాతీయపతాకాన్ని ఎగురేస్తున్నారు. ఇదే సందర్భంలో దేశం ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.వాటిని స్థూలంగా అయినా స్పృశించి ఉంటే బాగుండేది. వెూడీకి ఆరేళ్ల సమయం తక్కువేం కాదు. అనేక సమస్యలను పరిస్కరించి ఉండవచ్చు. కానీ సమయం వేగంగా ముందుకు సాగుతున్న వేళ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే కరోనా లాంటి విపత్కర పరిస్థి తుల్లో నిలదొక్కుకునేలా బలోపేతం చేయాల్సింది.


ఇప్పటికైనా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి, వైద్యశాలలను పెంచి, ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఇకపోతే దేశవ్యాప్తంగా భారీవర్షాలు,వరదలు అతలాకుతలం చేస్తున్న సమయంలో సహాయక చర్యలు అందక అనేకులు ఇక్కట్లు పడుతున్నారు.వివిధ రాష్ట్రాల్లో నష్టం విపరీతంగా ఉంది. సాయం కోసం మళ్లీకేంద్రం వైపు చూడాల్సిన ఆగత్యం ఏర్పడింది. దేశస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ అనేకులు నీటిలోనే గడపాల్సిన దుర్గతి పట్టింది. ఇలాంటి దుస్థితి పోయేలా దేశాన్ని విపత్తు నిర్వహణా రంగంలో కూడా పటిష్టం చేసుకోవాల్సి ఉంది.


ఇటీవలి కాలంలో ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా వరదలు ముంచెత్తాయి. మహారాష్ట్ర,కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఇంకా భారీ వర్షాలతో అల్లాడుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చి పడ్డాయి. అనేక భవనాలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.కళ్లముందే భవనాలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక కేరళ,మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఇంకా పరిస్థితి కుదుటపడలేదు. ఆర్మీలో విపత్తు నిర్వహణకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి తర్ఫీదు ఇస్తే మంచిది. ఇకపోతే దేశంలో కరోనా విసిరిన సవాళ్లను గమనించి వివిధ రంగాల్లో భారత్‌ ఎలా ముందుకు సాగాలో ప్రధాని వెూడీ గుర్తించి ఆ తరహా చర్యలకు ఉపక్రమించాలి.


ప్రధానంగా ఆర్థికంగా చితికిపోతున్నా వారిని ఆదుకునేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. వేలకోట్లు ఎగ్గొట్టే వారిపట్ల ఉదారంగా ఉంటున్న బ్యాంకులు.. సామాన్యులు లక్షలోపు రుణాలు కట్టలేకపోతే ఇళ్లను తాకట్టుపెట్టేస్థాయికి వస్తున్నారు.ఈ దశలో స్వయం సమృద్దిని ప్రోత్సహించే పథకాలను విరివిగా ప్రకటించాలి. బ్యాంకులు ఉదారంగా ఉండేలా చూడాలి. విద్యావైద్య రంగాలను పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలి. అపðడు ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు పెరగుతాయి. పైవేట్‌ దోపిడీ తగ్గి ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడుతాయి.


ఈ సంకత్పంతో ప్రభుత్వాలు సాగితే దేశం స్వయం సమృద్దిలో ముందుకు సాగగలదు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ పాలకులకు ఇది సంకల్పంగా మారితే దేశ దిశ మారుతుంది.


________________________________________________________________


సక్రమంగా వినియోగిస్తే వాలంటీర్ల వ్యవస్థ వల్ల మేలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజా పాలన కంటే రాజకీయ రగడే అధికంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువస్తున్న విధానాలూ కూడా రాజకీయ వివాదాలలో రగిలిపోతున్నాయి. జగన్‌ సర్కార్‌ వినూత్నంగా అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ కూడా విమర్శల పాలౌతున్నది.


ప్రజల ముంగిటకు ప్రభుత్వం అన్న సదుద్దేశంతో తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అధికార పార్టీ అత్యుత్సాహం వల్ల లక్ష్యానికి దూరంగానే మిగిలిపోతున్నది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్నిన జన్మభూమి కమిటీలు కూడా ఇలాగే విమర్శల పాలయ్యాయి.ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తీసుకు వచ్చాయి. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకూ అదే పరిస్థితి ఎదురౌతున్నది. వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థ జన్మభూమి కమిటీలతో పోల్చదగినది కాదు. ఈ వ్యవస్థను ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట పెరగడమే కాదు.


పార్టీకి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. వైకాపా శ్రేణుల అత్యుత్సాహం,
మితిమీరిన జోక్యం కారణంగా వలంటీర్ల వ్యవస్థ వైకాపా తొత్తుగా మారిపోయిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది.వాస్తవానికి క్షేత్రస్థాయిలో వలంటీర్లపై ఆజమాయిషీ, పెత్తనం మొత్తంస్థానిక వైకాపా నాయకత్వానిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అధికారులే చెబుతున్నారు. వైకాపా వర్గాలు కూడా అదే అంటున్నాయి. దీనివల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వం పలుచన అయే పరిస్థితిఎదురౌతున్నది.


నిజానికి వలంటీర్ల నియామకంలో అన్ని నిబంధనలూ పాటించి, రాతపరీక్షలు నిర్వహించి, అర్హులను మాత్రమే నియమించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంది. నియామకాల విషయంలో సాధ్యమైనంత వరకూ పారదర్శకంగా వ్యవహరించింది.అయినా స్వల్పకాలంలో వలంటీర్ల వ్యవస్థపై జనంలో అయిష్టత గూడుకట్టుకోవడానికి బాధ్యత క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులదే అని చెప్పవచ్చు. జన్మభూమి కమిటీల వల్ల గత తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట ఎలా మసకబారింతో...వలంటీర్ల వ్యవహారంలో పార్టీ మితిమీరిన జోక్యం వల్ల వైకాపా ప్రభుత్వ ప్రతిష్టకూ భంగం వాటిల్లే పరిస్థితి ఎదురౌతున్నది.


అయితే ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెడుతున్నట్లు కనిపించదు.
లబ్థిదారుల ఎంపిక నుంచి సంక్షేమ ఫలాలు వారికి చేరే వరకూ వాలంటీర్లదే ప్రముఖ పాత్ర. ఇంతటి కీలకమైన వ్యవస్థపై పార్టీ పెత్తనం వల్ల ప్రజలకు సక్రమంగా లబ్థి ఫలాలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.పార్టీ, వర్గం, కులం, మతం తదితర అంశాల మేరకు వివక్ష కనిపిస్తున్నదని క్షేత్రస్థాయిలో పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా దృష్టి సారించాలి. పార్టీ పరంగా కొందరు వ్యవహరిస్తున్న తీరుకు ఆయన అడ్డుకట్ట వేయాలి.


విస్తృత ప్రజాప్రయోజనాలను కాంక్షించి తీసుకువచ్నిన వాలంటీర్ల వ్యవస్థ....ప్రభుత్వ ప్రతిష్టను, పార్టీకి ఆదరణను పెంచేదిగా ఉండాలి తప్ప....కింది స్థాయిలో జరిగే తప్పిదాల వల్ల మొదటికే వెూసం వచ్చే పరిస్థితి రావడం వాంఛనీయం ఎంత మాత్రం సరికాదు.జన్మభూమి కమిటీలపై వచ్చిన విమర్శలను పట్టించుకోకపోవడం వల్లే గత తెలుగుదేశం హయాంలో పార్టీ ఆదరణ కోల్పోయింది. గత ప్రభుత్వ ప్రతిష్ట మసక బారింది.ఆ పరిస్థితి పునరావృతం కాకుండా జగన్‌ సత్వర చర్యలు తీసుకోవాలి. ప్రజల ముంగిటకే ప్రభుత్వం అన్న సదాశయంతో తీసుకు వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యం మేరకు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను సీఎం తీసుకోవలసి ఉంటుంది.


పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నత ఆశయంతో తీసుకువచ్చిన విద్యావాలంటీర్ల వ్యవస్థ ప్రతిష్ట మసకబారడం వైకాపా ప్రభుత్వానికీ, పార్టీకి కూడా ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.


________________________________________________________________


ప్రజా చైతన్యం వల్లే పల్లెల్లో పారిశుద్ధ్యంపంచాయితీల్లో పచ్చదనం పారిశుద్యం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్న లక్ష్యం మేరకు పల్లెప్రగతి,పట్టణ ప్రగతి కార్యాక్రమాలు దోహదపడ్డాయి.ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాలతో గ్రామల్లో పారిశుద్య కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పల్లెల్లో పరిశుద్యానికి ప్రాధాన్యం ఏర్పడింది.


పారిశుధ్యం, పచ్చదనం, తాగునీరు అందరి హక్కుగా ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరబోతుంది. ప్రతీ పల్లె పచ్చగా ఉండేందుకు ప్రణాళిక సిద్దం చేసారు. ప్రతీ పల్లె పచ్చగా పారిశుధ్య లోపం లేకుండా ఉండాలని అందరికీ కనీస మౌలిక సదుపాయాలు అందాలని ప్రభుత్వ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనుంది.ఇందుకు గానూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామసర్పంచ్‌లకు మార్గనిర్దేశనం చేశారు. దీంతో గ్రామాల్లో శ్రమదానాలు చేపట్టారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో వరుస కార్యక్రమాల ద్వారా గ్రామాలను స్వచ్ఛత వైపు మళ్లించారు.దీంతో కొత్త పాత పంచాయతీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంత్రి ఆదేశాలు రావడంతో పల్లెల్లో శ్రమదానాలకు యువత ముందుకు వచ్చింది. పలు గ్రామాల్లో అధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక నుంచి పచ్చగా ఉండాలని పారిశుధ్యం మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక కృషి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నది.నిత్యం పారిశుధ్యం పనులు చేసే కార్మికులు ఏనాటి నుండో చాలీచాలని జీతాలతో గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న వారి జీవితాల్లో మార్పులు తీసుకు రావడంతో పాటు వారి వేతనాలు పెంచే కార్యక్రమం చేపట్టింది. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో పారిశుధ్య కార్మికులను ప్రతీ గ్రామపంచాయతీలో ఉండాలని నిర్ణయించారు.దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కూడా పారిశుధ్యకార్మికులను నియమించుకునే అవకాశలున్నాయి. జిల్లాలో ఇప్పటికే మేజర్‌ గ్రామపంచాయతీల్లో 900మందికి పైగా పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.వీరు కేవలం మేజర్‌ గ్రామ పంచాయతీలో ఉండగా, తాజాగా నియమించే పారిశుధ్య కార్మికులు ఇక నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండనున్నారు. అన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల తాజాగా నిర్ణయం తీసుకుంది.ప్రతీ పల్లె చక్కటి వాతావరణంలో ఉండాలని, తాగునీరు, పచ్చదనం, పారిశుధ్యం అందరి హక్కుగా ఉండాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు మెరుగు పడేందుకు పారిశుధ్య కార్మికులను నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ఇందుకోసం వారి వేతనాలు కనీసం రూ.8500 ఉండాలని నిర్ణయించారు.జీపీల్లో పని చేసే కార్మికుడికి ఈ వేతనం వర్తింప జేయాలని ఆదేశాలు కూడా అధికారులకు అందాయి. గ్రామంలో మొక్కలు పెంచేలా గ్రామస్తులను అవగాహన కల్పించారు. మొత్తంగా ఇటీవల వరుసగా చేపట్టిన కార్యాక్రమాలతో గ్రామాల్లో పరిస్థితులు మారాయి.


ప్రజల్లో కూడా పారిశుద్యం, పచ్చదనంపై ప్రజల్లో చైతన్యం కానవస్తోంది.


________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


 


Comments