భయపెడుతున్న మెట్రో పగుళ్లు

భయపెడుతున్న మెట్రో పగుళ్లు 


హైదరాబాద్, సెప్టెంబర్ 26(ఆర్మ్ ఎ): ఏళ్లకు ఏళ్లు కష్టపడి సంసాదించుకున్న నమ్మకం మట్టిపాలు కావటానికి ఒక్క సంఘన చాలు. ఆ ఒకే ఒక్క సంఘటన ఇప్పుడు మెట్రో పనితీరును అడుగడుగునా ప్రశ్నిస్తోంది. 


నడి రోడ్డు మీద నిర్మించిన మెట్రోరైలు ప్రాజెక్టు మంచి ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఆధునిక నగరాభివృద్ధిలో ఒక అంతర్భాగం అంటూ ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి ప్రాజెక్టుపై అమీర్ పేట మెట్రో స్టేషన్ లో జరిగిన సంఘటన మాయని మచ్చగా మారింది. రోడ్డు మీదుగా నిర్మించిన మెట్రో స్టేషన్లు, పిల్లర్లు, వయాడక్ట్ నాణ్యతపై అందరూ సందేహాం 


వ్యక్తం చేస్తున్నారు. 


 



కారిడార్ల కింద నుంచి వెళ్తున్న వారు పైకి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పెచ్చులూడి మీద పడతాయో, ప్రాణం ఎక్కడ పోతుందోనన్న భయం నగరవాసుల్లో ఉంటోంది. ప్రస్తుత ప్రాజెక్టును 72 కి.మీ మేర ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 66కి.మీ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గమంతా 99 శాతం రోడ్డు మీదుగానే ఉంది. 


నగరంలో 


రాకపోకలు సాగించే ప్రజలంతా మెట్రో పిల్లర్లు, స్టేషన్ల కింద నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. కారిడార్-1లో ఎల్ బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కి.మీ, మియాపూర్ వరకు 29 కి.మీ, కారిడార్-2లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9 కి.మీ, కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు సుమారు 28 కి.మీ మార్గం పూర్తిగా రోడ్ల మీదుగానే ఉంది. ఎక్కడా అండర్ గ్రౌండ్ లో లేదు.


 


 



ఎండైనా, వానైనా ప్రజలు వాటి కిందకు వెళ్లి నిల్చుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36 పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న మెట్రో స్టేషన్ పెచ్చులూడి ఉన్న మెట్ర ప్రమాదంగా మారింది. కొద్ది కొద్దిగా పెచ్చులు కింద పడుతున్నా యి. 


 


 


ఇప్పటి వరకు ఎవరికీ ఏమి కాకపోయినా.. దీన్ని వల్ల ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే మెట్రో 


కారిడార్-1లోని జేఎన్‌టీయూ, కేపీహెచ్ బీకాలనీ, కూకట్ పల్లి మెట్రో స్టేషన్లతో పాటు కారిడార్ లోని వయాడక్ట్స్ మధ్య , ఉన్న జాయింట్ల వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. 


 



 


 


ఎర్రగడ్డలో స్టేషన్ కింద ఉన్న పిల్లర్ నంబరు ఎ947 పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సిమెంటు దిమ్మె పగిలిపోయింది. మెట్రో అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారో లేదో చూడాలి!!


Comments