తెలంగాణ చరిత్రను కాలరాసే యత్నం

తెలంగాణ చరిత్రను కాలరాసే యత్నం


 


కెసిఆర్ తీరు ప్రజలకు అవమానకరం అధికారికంగా విమోచనోత్సవం జరగాలి మజ్లిస్ కోసం అమరుల త్యాగాలను పణంగా పెడతారా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్


 


హైదరాబాద్ : తెలంగాణ చరిత్రను కాలరాయడం,విమోచన ప్రాధాన్యతను విస్మరించడం తెలంగాణ అమరులను అవమానించడం తప్ప మరోటి కాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం అమరుల ఆత్మకు శాంతి చేకూర్చడమేనని అన్నారు. తెలంగాణ రక్త చరిత్రను ప్రజలకు తెలియచేయాల్సిన పాలకులు రాజకీయ స్వలాభం కోసం మిన్నకుండడం దారుణమని అన్నారు. తెలంగాణ విమోచనోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ఎన్ ప్రతినిధితో మాట్లాడుతూ. 


విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వంగా గుర్తించాలన్నారు. ఉద్యమ సమయంలో దీనిని ఓ అంశంగా తెరపైకి తెచ్చిన కేసీఆర్ చేతుల్లో నుంచి తెలంగాణ విముక్తికి మరో ఉద్యమం నిర్వహించాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ లోని మజ్లిస్ పార్టీ నేతలకు భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు.


నిజాం నియంతృత్వ పాలన నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎన్నో పోరాటాలు | సాగాయని, చివరకు నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ సెప్టెంబర్ 17న సైనిక చర్యతో తెలంగాణకు | విముక్తం కల్పించారని అన్నారు.


 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యతోపాటు ప్రస్తుత సీఎం కేసీఆర్ వరకూ అందరూ మజ్లిస్ పార్టీ నేతలకు భయపడుతున్నారని ఆరోపించారు.


తలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నాటి ప్రభుత్వాలపై ఎదురుతిరిగి ప్రజలను ఉసిగొల్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం విమోచనాన్ని అధికారికంగా నిర్వహించే వరకూ ఆందోళనలు ఆగవన్నారు.


 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకుంటే.. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని, పాఠ్యాంశాల్లో తెలంగాణ విమోచన చరిత్రను ప్రవేశపెడతామని చెప్పారు. | తెలంగాణ విమోచన దినోత్సవానికి కులాలు, మతాలతో సంబంధం లేదని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని సూచించారు.


సెప్టెంబర్ 17న తెలంగాణలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.


 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు మంత్రులుగా కొనసాగడం శోచనీయమన్నారు. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని.. ఎవరినో అడిగి తెచ్చుకోలేదన్నారు.


సస్యశ్యామల, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు, నష్టాలకు ఓర్చి ఎన్నో రూపాల్లో పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చిందని, ఇది ఎవరి జాగీరు కాదని అన్నారు. అబద్దాలతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు.


 బంగారు తెలంగాణ ఆశలు భ్రమల తెలంగాణగా మారాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్న ధీమాను లక్ష్మణ్ వ్యక్తం చేశారు.


కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ బందీగా మారిందని,దానిని విముక్తం చేయడం ద్వారా తెలంగాణ విముక్తం కావాల్సి ఉందన్నారు. తెలంగాణ వస్తే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామిని విస్మరించారు.


 దీనిని అవకాశంగా చూపుతూ రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు, అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని బిజెపి నేత చెబుతున్నారు.


Comments