కొత్త మద్యం వ్యాపారులకు నిరాశ

కొత్త మద్యం వ్యాపారులకు నిరాశ 


గడువు పెంచడంతో ఆయోమయంలో సిండికేట్లు 


హైదరాబాద్: మద్యం దుకాణాల లైసెన్సు గడువును ప్రభుత్వం మరోనెల రోజుల పాటు పొడిగించడంతో అక్రమ మద్యం వ్యాపారులకు కలసి వచ్చేలా ఉంది. ఎలాగైనా మద్యం దుకాణాలను దక్కించుకొని వ్యాపారం చేయాలనుకొని భావించి ఔత్సాహికుల ఆశలపై సర్కారు నిర్ణయం తాత్కలికంగా నీళ్లు చల్లినట్లయ్యింది. 


 


ఈనెల 30 వరకు పాత మద్యం దుకాణాల గడువు ముగిసిపోనుండడంతో ఎలాగైనా ప్రభుత్వం మళ్లీ మద్యం దుకాణాలకు టెండర్లను నిర్వహిస్తుందని వీరంతా భావించారు. ఇందులో భాగంగా నే చాలామంది నిరుద్యోగులు భాగస్వాములుగా ఏర్పడి మద్యం దుకాణాలను దక్కించుకోవాలని భావించారు. సర్కారు నెల రోజుల పాటు మద్యం దుకాణాల కేటాయింపులపై వాయిదా వేయడ ంతో వారంతా నిరాశకు గురయ్యారు. 


 



 


ప్రభుత్వం ఇప్పటి వరకు మద్యం దుకాణాల కేటాయింపులపై స్పష్టమైన విధానం రూపొందించకపోవడం అలాగే చివరి వరకు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుత మద్యం వ్యాపారు ల్లోనూ, కొత్తగా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న వారిలో ఉత్కంఠ కొనసాగింది. కాగా కొత్త మద్యం పాలసీ అక్టోబరు 1నుంచి మొదలు కానున్నట్లు ప్రచారం జరిగిన క్రమంలో జిల్లాలోని పలు ప్లలెల్లో బెల్ట్ షాపుల దందాకు తెర లేచింది. 


 


మొ న్నటి వరకు కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకపోగా , ఈసారి ఆగ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం ఆయా గ్రామాల్లోని వీడీసీలు బెల్ట్ షాపుల కోసం అనధికారిక టెండర్లను సైతం నిర్వహి స్తున్నాయి. 


 


 



ఇలా గ్రా మాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడుతున్నాయి. ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ అధికారులు ఈ బెల్ట్ షాపుల వ్యవహారంపై సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడంతో వీడీసీల ఆధిపత్యం , కొనసాగుతోంది. మరోవైపు గడువు పెంచడంతో ప్రస్తుతం మద్యం వ్యాపారుల ఊపిరిపీల్చుకున్నారు. 


 నిబంధనల ప్రకారం మద్యం లైసెన్సు గడువు ఈనెల30వతేదీ వరకే మ- గియనుంది. అయితే అక్టోబరు 1నుంచి కొత్త మ ద్యం పాలసీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ప్రభు త్వం సరియైన పాలసీ రూపొందించకపోవడంతో గత్యంతరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో పాటు ఇటీవలే బార్ లైసెన్సును సైతం మరో ఏడాది పాటు పొడగిస్తూ కూడా ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. 


 



ఈనేపథ్యంలో చాలా మంది ఔత్సాహిక వ్యాపారులు ఈసారి మద్యం దుకాణాలను నిర్వహించేందు కోసం ప్రభుత్వం నిర్వహించే డ్రాలో పాల్గొ నేందుకు సిద్ధమయ్యారు. ఈసారి దరఖాస్తు రుసుం రూ. 2లక్షలు చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది.


Comments