పాడి,మత్స్య సంపదలకు ప్రోత్సాహం మంచిదే
గ్రామాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పథకాలు తేనటీగల పెంపకంతో పెద్ద ఎత్తున ఉపాధి
న్యూఢిల్లీ : దేశంలో అపారమైన సమజసంపదలు ఉన్నాయి. సమజ వనరులను సరిగా ఉపయోగించుకుంటే భారత్ కు ఆహార సమస్యలు రావు. కూర్చుని తిన్నా తరగని వనరులు ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించుకోవడంలో ఇంతకాలం పెద్దగా ప్రయత్నాలు జరగలేదు.
తెలుగు రాష్ట్రాలనే తసేఉకుంటే వ్యవసాయకంగా అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే పాడి, మత్స్య పరిశ్రమలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగాలను రానున్న ఐదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని కేంద్రం అంచనా వేస్తున్నది.
మౌలిక సదుపాయాలు, సామార్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే తమ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో మత్స్యకార రంగంలో 55 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పడంతో వారికి ఊరట దక్కనుంది.
పశు వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం కోసం రూ.13,343 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. పశువులు, గేదేలు, గొర్రెలు, మేకలు, పందులకు వంద శాతం టీకాలు వేస్తామని, ఇప్పటి వరకు 1.5 కోట్ల ఆవులు, గేదేలకు ట్యాగ్ చేసి టీకాలు వేసినట్లు తెలిపారు.
అలాగే పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెటుబడులను ఆకర్షించే సాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. పాడి ప్రాసెసింగ్, పశువుల మేతలో ప్రైవేట్ పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
వచ్చే రెండేళ్లలో పది లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగుకు రూ.4 వేల కోట్లు కేటాయించడం దేశీయ వైద్యానికి తోడ్పాటును ఇచ్చేదిగా ఉంది. దీంతో వీటిని సాగుచేసే రైతులకు రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
నేషనల్ మెడిసినల్ ఎలాంట్స్ బోర్డు (ఎస్ఎంపిబి) ఆధ్వర్యంలో 2.25 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఔషధ పంటల సాగుకు ప్రోత్సాహిస్తామ విస్తీర్ణంలో ఔషధ పంటల సాగుకు ప్రోత్సాహిస్తామ న్నారు. ఔషధ పంటల సాగుకు ప్రాంతీయ మండీలు, నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు. గంగా నది ఒడ్డున ఔషధ మొక్కల కారిడార్ అభివృద్ధి కోసం 800 హెక్టార్లను ఎస్ఎంపిబి తీసుకొస్తుందని తెలిపారు.
తేనేటీగల సంరక్షణకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తేనే టీగల పెంపకం వ్యవసాయ ఆధారిత కార్యాచరణ ఆదాయమని గుర్తించడం ముదావహం. దీని కోసం ప్రభుత్వం పథకం అమలు చేయాలనుకోవడం మంచి నిర్ణయం.
తేనే టీగల పెంపకం అభివృద్ధి కేంద్రాలు, సేకరణ, మార్కెటింగ్, పెంపకం అభివృద్ధి కేంద్రాలు, సేకరణ, మార్కెటింగ్, నిల్వ కేంద్రాలు, పోస్ట్ హార్వెస్ట్ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా నిరుద్యోగు లకు అవకాశాలు దక్కుతాయి.
తేనే కోసం గుర్తించిన వ్యవస్థను అభివృద్ధి చేయడం, మహిళల సామర్థ్యం పెంచడం, నాణ్యమైన న్యూక్లియస్ స్టాక్, తేనేటీగ పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని చేసిన ప్రకటన కుటరీ పరిశ్రమగా ఇది అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన తేనే వినియోగదారులకు ఆదాయం రూ.2 లక్షలకు పెరుగుతుందని అంచనా.
ఇకపోతే వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఆపరేషన్ గ్రీన్ తీసుకొస్తామని చెప్పారు. రవాణ ఖర్చుల్లో 50 శాతం, శీతల గోదాముల రుసుముల్లో 50 శాతం రాయితీ ఇస్తామన్నారు.
ఆరు నెలల పాటు ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ఆర్థికమంత్రి ప్రకటించిన పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, రైతుల ఆదాయ పెంపునకు ఉపకరిస్తాయని ప్రధాని మోదీ కూడా పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఉపకరించే సంస్కరణలను స్వాగతిస్తున్నానన్నారు.
ఆర్థిక మంత్రి ప్రకటించిన అంశాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ ప్రశంసించింది. నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేయాలన్న ప్రతిపాదన సహా వ్యవసాయ సంస్కరణలన్నీ భవిష్యత్తులో ప్రభావం చూపుతాయని జేపీ నడా పేర్కొన్నారు.