ప్యాకేజీల్లో తక్షణ సాయానికి తావేదీ

ప్యాకేజీల్లో తక్షణ సాయానికి తావేదీ


లాక్ డౌన్ తో రోడ్డున పడ్డవారికి దక్కని ఊరట కేంద్రం తీరుపై కాంగ్రెస్, లెఫ్ట్ పెదవివిరుపు


 


న్యూఢిల్లీ : కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీలు తక్షణ ప్రయోజనం కలగించేవిగా లేవన్న విమర్శలు ఉన్నాయి. లాక్ డౌన్ తో గత మూడునెలలుగా అనేక వర్గాలు తిండిలే, ఉపాధి దక్కక ఉన్నారని వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి.


లాక్ డౌన్ కారణంగా సర్వం కోల్పోయిన వర్గాలకు తోణ సాయం ఏదీ అందడం లేదన్నారు. ప్రధాని ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ బూటకమన్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు కేంద్ర ఏం చేసిందన్న దానిపై ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేయాలని కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు డామాండ్ చేస్తున్న్నరు.



వలస కార్మికులు, రైతులు, పేదల కరోనా, లాక్ డౌన్ తో పలువిధాలుగా తీవ్రంగా ప్రభావితమైన అన్ని సెక్షన్ల ప్రజలకు ప్రధానంగా వలస కార్మికులు, వీధి వ్యాపారులు, ఇంటి పని కార్మికులు, మత్స్యకారులు, తదితరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కుడా బదిలీ కాలేదని పేర్కొంది.


రుణాల కేటాయింపే ప్రధానంగా ఈ ప్యాకేజీ ఉందని అభిప్రాయపడింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ విస్తరణకు సంబంధించి రూ.3,500 కోట్ల కేటాయింపు అనే ఒక్కదాని వలన మాత్రమే ప్రజలకు ప్రత్యక్ష లబ్ది చేకూరుతుందని తెలిపింది. పలు కారణాలు చూపి కోట్లాది రేషన్ కార్డులను తొలగించడం వలన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.



దేశంలో వలస కార్మికులు 8 కోట్ల మంది మాత్రమే ఉన్నారని ఆర్థిక మంత్రి తప్పుడు అంచనాలు వేస్తున్నారని, ప్రస్తుత అంచనాల ప్రకారం 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొన్న విషయాన్న గుర్తు చేశారు. ఉచిత ఆహార ధాన్యాల కేటాయింపు మొత్తం జనాభాకు చేరవన్న విషయం స్పష్టమౌతుందని పేర్కొన్నారు.


ఇకపోతే ఉపాధి కార్మికులకు గతేడాది ఏప్రిల్ నెలలో 27.3 కోట్ల పనిదినాల కల్పన జరగ్గా, ఈ ఏడాది అది 11.1 కోట్లుగా మాత్రమే ఉందని, ఇది ఈ దశాబ్ద కాలంలోనే అత్యల్పమని సిపిఎం తెలిపింది. ఈ సొంత గ్రామాలకు చేరుకుంటున్న లక్షలాది వలస కార్మికులను నిరుదోగ్యం వెంటాడనుందని పేర్కొంది.



తిరిగి వెళ్తున్న కార్మికుల సమ- స్యలను ఆర్థిక మంత్రి పూర్తిగా నిర్లక్ష్య దృష్టితో చూస్తున్నారనివిమర్శించింది. కార్మిక వర్గానికి భద్రత కల్పించేలా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు సులభ రుణ సదుపాయం, కనీసం కార్మికులకు వేతనం చెల్లించేందుకు ప్రత్యక్ష ఆర్థిక సాయం హామీ ఇవ్వకుండా తిరిగి వచ్చిన వారు ఇతర ఉద్యోగాలకు నైపుణ్యం గల వారు అంటూ ప్రకటనలు చేశారని, ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక మనస్థత్వాన్ని తెలుపుతోందని విమర్శించింది.



ప్రధానంగా గిరిజనులతో సమన్వయం చేసుకొని నిధులను ఎలా, ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్యలు తీసుకుంటుందని గుర్తు చేసింది. శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వలస కార్మికుల ఆహారానికి చెల్లింపులు చేస్తున్నామని కేంద్రం చెప్పుకోవడం అప్పటికే గాయపడిన వారిని మరింత అవమానించినట్లుగా ఉందని పేర్కొంది.


దేశం, ప్రజలు కరోనాపై పోరే ప్రధానంగా ఏకదృష్టితో ముందుకు సాగుతూ.. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను కాపాడాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.



ధనవంతులను మరింత ధనికులుగా చేసేలా, పేదలకు మరింత కఠిక పేదరికంలోకి చేర్చేలా ఉండే ఆర్థిక సంస్కరణల వంటి తమ సొంత అజెండాను అమలు చేసుకునేందుకు ఈ సంక్షోభం సమయం ఒక అవకాశమని భావిస్తోందని విమర్శించింది.


దేశంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని, పట్టణ పేదల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఇటువంటి సమయంలో ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలన్నింటికీ నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలల పాటు ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేసింది.



దాదాపు మూడింట ఒకొంతు కుటుంబాలు వారం రోజుల కంటే జీవించేందుకు తగిన వనరులు లేవని అంచనా వస్తున్న తరుణంలో కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన గోడౌన్లలో మగ్గుతున్న 77 మిలియన్ టన్నుల నిల్వల నుంచి ఆరు నెలల పాటు ఈ విధమైన ఉచిత పంపిణీ చేయాలని పేర్కొంది.


లా డౌన్లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో రైతులు మనుగడ కొనసాగాలంటే వారికి ఒకే విడతలో రుణమాఫీ చేయాల్సిన అసవరం ఉందని సూచించింది.


Comments