| కుదిపేసిన వాన.. కుదేలైన అన్నదాత

 కుదిపేసిన వాన.. కుదేలైన అన్నదాత 


కడప జిల్లా రైతుకు మిగిలింది కన్నీటి వరద


కడప : ఇప్పుడు కడప జిల్లా రైతన్నది విచిత్ర పరిస్థితి. చాలా రోజుల తర్వాత వచ్చిన వర్షం జిల్లాను వరదలా పోటెత్తింది. ప్రవాహం ధాటికి పంటలు కాస్తా నేలపాలయ్యాయి. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, ఖాజీపేట, దువ్వూరు మండలాల్లో వరి, పసుపు పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి 


చాపాడు మండలం చుట్టూ కుందూ ఉండడంతో అధిక నష్టం వాటిల్లింది. 2970 ఎకరాలకు పైగా వరద వల్ల నష్టపోయినట్లు అంచనా. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, పెద్దముడియం పరిధిలో సుమారు 10 వేల ఎకరాలలో కంది, పత్తి, వేరుశనగ, వరి తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, లింగాల మండలాల్లో 150 నుంచి 200 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నాయి. కమలాపు రం నియోజకవర్గంలోని  


వల్లూరు, ఇతర పలు మండలాల్లో 350నుంచి 400 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రైతులు లబోదిబోమంటున్నారు. ప్రొద్దుటూ రు పరిధిలోని రాజుపాలెంతోపాటు పరిసర ప్రాంతాల్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు వరద నీటికి దెబ్బతి న్నాయి


. దీంతో రైతన్నలకు కోట్లలో నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్షపు నీరు పోటెత్తడంతో పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. తొండూరులో ఒక చెరువు కట్ట తెగిపోగా....మరో చెరువుకు గండి , పడింది. రాయచోటి ప్రాంతంలో పురాతన చెరువుగా గుర్తింపు పొందిన శిబ్యాల చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా వృథాగా యింది. రాయచోటి పరిధిలో ఆరు కుం టలు తెగిపోయాయి. బద్వేలు పరిధి లోని కాశినాయన మండలంలో కూడా ఒక చెరువు కట్ట తెగిపోయింది. చాపా డు మండలాన్ని తాకుతూ కుందూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం వాటిల్లుతోంది 


  


చెరువులు, కుంటలకు గండ్లు పడి నీరంతా ఏటిపాలైంది. ఇప్పటికీ చాపాడు మండలంతోపాట పలుచోట్ల వరద నీరు పోటెత్తుతండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో రహదారులకు భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా రాష్ట్రంలో ని 24 కిలోమీటర్ల హైవేకు నష్టం జరిగింది. ఐదుచోట్ల రోడ్లు కోసుకుపోయాయి. 


ఏడుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నా యి. తొమ్మిదిచోట్ల మిద నీరు పారడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాత్కాలిక మరమ్మత్తులకు సుమారు రూ.80 లక్షల నుంచి రూ. 90 లక్షల మేర అవసరమవుతుందని అధి కారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 192 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 60 చోట్ల రోడ్లు కోతలకు గురి కాగా, మరో 23 చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. 25 చోట్ల రోడ్డులో కోతలు పడ్డాయి.  


రూ. 775 లక్షలు తాత్కాలిక మరమ్మతులకు 


అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, వరద దెబ్బకు విద్యుత్ శాకు ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికీ 205 ట్రాన్స్ఫర్మర్లు నీటిలోనే ఉన్నాయి. నీరు తగ్గిపోతేగానీ వాటి పరిస్థితి తేలదు. 400 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 


అందులో ఎక్కువశాతం పడిపోగా మిగి లిన వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. 33 కేవీ లైన్లు, పెద్ద లైన్లు, ఇతర కరెంటు వైర్ల సమస్య కూడా ఏర్పడింది. భూమిలో తడి తగ్గి స్తంభాలు, వైర్ల దగ్గరికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడితే వెంటనే రిపేర్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 


  


సింహాద్రిపురం మండలంలోని కడప నాగాయపలె వద్ద 15 స్తంభాలు నేలకూలాయి. కడప నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ట్రాన్సఫార్మర్లు, కరెంటు స్తంభాలకు స మస్యలు ఎదురయ్యాయి. వరద ఉధృతికి కొందరు ప్రాణాలు కోల్పోయారు. .


 


Comments