పడకంటి మనసులో మాట 30.08.2020


పడకంటి మనసులో మాట ...


________________________________________________________________


ప్రధానంగా కరోనాతో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రవాణా లేక వారు పడ్డ కష్టాలు చర్చించాలి. ఉపాధి కలోపోయి కోట్లాది మంది అన్నవెూ రామచంద్రా అంటూ కాలం గడుపు తున్నారు. అలాగే నీట్‌,జెఇఇ తదితర పరీక్షలపై గళమెత్తిన విపక్షాలు అసలు విద్యారంగ పటిష్టతపై చర్చించాలి. కరోనా కాలంలో విద్యాసంస్థలను నడపడమెలా అన్నది కసరత్తు చేసి పార్లమెంటులో ప్రస్తావించాలి. వెూడీపై ఎదురుదాడి చేద్దామన్న ఆలోచన నుంచి తమ వ్యూహాన్ని మార్చాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి..ధరల పెరుగుదల, పైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ, రవాణా సౌకర్యాలు,ఉపాధి కల్పన వంటివి చర్చించాలి. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళాబిల్లు వంటి వాటిపైనా చర్చ చేయాలి. వాకౌట్లు, అల్లర్లు, వంటివి కాకుండా పార్లమెంట్‌ ప్రొసీడింగ్‌లో పద్దతి మేరకు సమస్యలను ప్రస్తావించే చాతుర్యం ప్రదర్శించాలి.


________________________________________________________________


కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలుపై చర్చలు వానాకాలం పార్లమెంట్‌ సమావేశాలకు రంగం సిద్దం చేస్తున్నారు. కరోనా కష్టాల్లో వచ్చేనెలలో సమావేశాలు జరుగనున్నాయి. అప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందన్న నమ్మకం లేదు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతున్న వేళ పార్లమెంటులో ఈసారి విపక్షాలు బాధ్యతగా మెలగాల్సి ఉంది. కరోనా సంక్షోభంతో దేశం యావత్తూ తీరని సంక్షోభంలో కూరుకుని పోయింది.


అన్నిరంగాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజలు ప్రాణాలకు తెగించి బతుకీడుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భరభారత్‌ ప్రజలకు చేరడం లేదు. బ్యాంకులు యధావిదిగా వడ్డీలు, వడ్డింపులు చేస్తున్నాయి. విద్యారంగం కుదేల య్యింది. చిన్నాచితక వ్యాపారాలు చితికి పోయాయి. ఈ దశలో జరగబోతున్న సమావేశాలు ప్రత్యేకమైనవి గా గుర్తించాలి.అలాగే కలసికట్టుగా సమస్యలను చర్చించే బాధ్యతను భుజాన వేసుకోవాలి. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా ప్రజల పక్షాన సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయడంలో విపక్షాలు కసరత్తు చేయాలి. ప్రధానంగా కరోనాతో మనదేశంలో ప్రభుత్వ రంగంలో వైద్యం ఎంత దయనీయంగా ఉందో తెలిసింది. అలాగే మన వైద్యరంగం ఎంతగా దిగజారిపోయిందో కూడా తెలిసి వచ్చింది.


విద్యావైద్య రంగం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నాయి. ఈ దశలో కాంగ్రెస్‌ పార్టీ ఈ సర్వపాపాలకు కారణమని చెప్పక తప్పదు. అనేక దశాబ్దాలు అధికారంలో ఉన్నా వీటిని విస్మరించి పాలన చేసింది. అయినా ప్రధాన ప్రతిపక్షంగా ఇపðడు సమస్యలను ఏకరవు పెట్టడంలో చాతుర్యం ప్రదర్శించాలి. అనవసర ప్రసంగాలు కట్టిపెట్టాలి.ప్రధానంగా కరోనాతో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రవాణా లేక వారు పడ్డ కష్టాలు చర్చించాలి. ఉపాధి కలోపోయి కోట్లాది మంది అన్నవెూ రామచంద్రా అంటూ కాలం గడుపు తున్నారు. అలాగే నీట్‌,జెఇఇ తదితర పరీక్షలపై గళమెత్తిన విపక్షాలు అసలు విద్యారంగ పటిష్టతపై చర్చించాలి. కరోనా కాలంలో విద్యాసంస్థలను నడపడమెలా అన్నది కసరత్తు చేసి పార్లమెంటులో ప్రస్తావించాలి.


వెూడీపై ఎదురుదాడి చేద్దామన్న ఆలోచన నుంచి తమ వ్యూహాన్ని మార్చాలి. ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి..ధరల పెరుగుదల, పైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ, రవాణా సౌకర్యాలు,ఉపాధి కల్పన వంటివి చర్చించాలి. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళాబిల్లు వంటి వాటిపైనా చర్చ చేయాలి.వాకౌట్లు, అల్లర్లు, వంటివి కాకుండా పార్లమెంట్‌ ప్రొసీడింగ్‌లో పద్దతి మేరకు సమస్యలను ప్రస్తావించే చాతుర్యం ప్రదర్శించాలి. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఓ సంక్షోభ సందర్భంలో సమావేశాలు జరుగ బోతున్నాయి. అందువల్ల ఈ సమస్యలు ప్రస్తావించడం అవసరం. అలాగే విప్తవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెబుతున్న వెూడీ ప్రభుత్వం.. మహిళా బిల్లును కూడా గట్టెక్కించేలా విపక్షాలు కృషి చేయాలి.


మహిళలకు రాజకకీయంగా హక్కు దక్కేలా చేయాలి. బిజెపికి సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లుకు మాత్రం వెూక్షం దక్కడంలేదు. దీనిని గట్టెక్కించడంలో కనీసం ప్రస్తావన కూడా జరగలేదు. వెూడీ అధికారంలోకి వచ్చిన రెండోసారి అనేక విప్లవాత్మక బిల్లులకు వెూక్షం దక్కింది. ట్రిపుల తలాక తీసుకుని వచ్చిన మాదిరిగానే మహిళా బిల్లును కూడా గట్టెక్కిస్తే మహిళలు చిరకాం గుర్తుంచుకుంటారు.బిజెపి కూడా మహిళా బిల్లును తీసుకుని రాలేకపోయిందన్న విషయాన్ని సభలో ప్రస్తావించాలి. నిజానికి మహిళా బిల్లును ఆవెూదించక పోవడం బిజెపి ఘోర వైఫల్యంగానే చూడాలి. గత కొన్నేళ్లుగా ఇది కోల్డ్‌ స్టోరేజిని దాటి రావడం లేదు. ప్రధాని నరేంద్ర వెూదీ దేశంలో సగం శాతం మంది మహిళలు కోరకుంటున్న మహిళా బిల్లుపై స్పష్టం చేయడం లేదు.


భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండు దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. లోకసేభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా వెూడీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.


 ఇలా అనేక అంశాలను పారల్మెంటు ముందుకు తీసుకుని వచ్చే విధంగా కృషి చేసే బాధ్యత విపక్షాలదే అనడంలో సందేహం లేదు. ఇకపోతే దేశవ్యాప్తంగా విద్యారంగం కునారి ల్లింది. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఎగువ మధ్యతరగతి ప్రజలకు భారం కానుంది. వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో ముందుండాలి.


పేదతరగతి వారు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై స్పందించడం లేదు. పైవేట్‌ విద్యాసంస్థల దాష్టీకం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పైవేట్‌ టీచర్లు రోడ్డున పడ్డారు. వారంతా ఇపðడు అడుక్కు తినే స్టేజీలో ఉన్నారు.
కొందరు తోపుడుబళ్లతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా కరోనా కారణంగా అనేకానేక రంగాలు చితికి పోయాయి.ప్రాణాలకు తెగించి వైద్యులు వైద్యం అందిస్తున్నా భరోసా లేదు. పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నా కరోనాకు బలవుతున్నారు. అంతెందుకు ప్రజా ప్రతినిధులు కూడా కరోనాబారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యలను చర్చించేందుకు లోకసేభలో మద్దతు పలికే పార్టీల్ని కూడగట్టే యత్నాలను చేయాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికారపక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలంద రికీ పాత్ర ఉంటుంది.


ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. ప్రభుత్వాలు ఏకపక్ష ధోరణితో విభజించి పాలించే తీరు పక్కన పెట్టకుంటే అది ఎంత మాత్రం సాధికారత సాధనకు ఉపయోగపడదు. అందువల్ల ప్రభుత్వంతో కలసి సమస్యలను చర్చించి, వాటికి అర్థవంతమైన పరిష్కారం చూపే దిశగా విపక్షాలు బాధ్యతాయుతంగా పోరాడాలి.కరోనా కష్టాలను ఎదుర్కొనేలా, ప్రజలకు అండగా నిలిచేలా పార్లమెంట్‌ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరగాలి. వాటికి పరిష్కారం లభించాలి. ఈ ప్రయత్నంలో అధికార, విపక్షం అన్న తేడా లేకుండా అంతా కలసికట్టుగా సమస్యలపై చర్చించి ప్రజల పక్షాన నిలవాలి. లేకుంటే ప్రజలు క్షమించరని గుర్తించాలి. ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారో పార్లమెంట్‌ వేదికగా హావిూలు దక్కాలి.


________________________________________________________________


పోతిరెడ్డిపాడు లిప్ట్‌ ఏపీ సర్కార్‌కు ఊరటరాయలసీమ లిప్ట్‌ స్కీమ్‌ విషయంలో ఏపీ వాదనను కేంద్రం సమర్థించింది. అది పాత పథకమే అని... దాని వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశమే లేదని ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాయలసీమ లిప్ట్‌ స్కీంను సాగునీటి ప్రాజెక్టుగానో విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుగానో పరగణించలేమని స్పష్టం చేసింది. ఎత్తిపోతల వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశమే లేదని వెల్లడించింది.


గత ప్రాజెక్టులకు ఫీడర్‌గా మాత్రమే రాయలసీమ లిప్ట్‌ స్కీమ్‌ పనిచేస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీకి స్పష్టం చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడికాల్వలకు గతంలోనే వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది.కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ నీటివిూటర్ల ఏర్పాటుకు ఆదేశించిందని... వాటిని కేంద్రం పర్యవేక్షిస్తోందని తెలిపింది. రాయలసీమ లిప్ట్‌ స్కీమ్‌ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ మాత్రం ఎత్తిపోతల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపింది. అన్ని అంశాలు పరిశీలించకుండానే, పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని వాదించింది.


ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఇపðడున్న దానికన్నా అధికంగా నీటిని తరలించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, సీమలో పది లక్షల ఎకరాలకు అధికంగా నీరందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, టైబ్యునల్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది జల వివాదమని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు
వినిపించింది. దాంతో... తదుపరి విచారణను వచ్చేనెల మూడో తేదీకి నేషనల్‌ గ్రీన్‌ టైబ్యునల్‌ వాయిదా వేసింది. నిజానికి శ్రీశైలం ద్వారా వీధాగా పోతున్న నీటిని వాడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.ఇటీవలి వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రధాన నదులు వరదలతో పోటెత్తుతున్నాయి. అధిక వర్షపాతం ఓవైపు, భారీ వరదలు మరోవైపు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో... గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు నదులను కలుపుకుంటే 1,500 టీఎంసీలకు పైగా నీరు ఇప్పటికే సముద్రం పాలయ్యింది. గోదావరి ప్రవాహంలో ఇది దాదాపుగా సాధారణ విషయమే.


 అయితే... అపðడపðడూ మాత్రమే వరదలు వచ్చే కృష్ణా నదిలో కూడా వరుసగా రెండో ఏట అన్ని ప్రాజెక్టులు నిండిపోవడం, సుమారుగా 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వదలడం జరిగింది. ఇదిలా ఉంటే... రాయలసీమలోని ప్రధాన కాలువలు ఓ వైపు వెలవెలబోతోంటే, దిగువన కృష్ణా నది పొంగిపొర్లడం చర్చనీయాంశమైంది.రాయలసీమకు వరదల జలాల వినియోగం పట్ల ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ నేపధ్యంలో వినిపిస్తోంది. కృష్ణా నదిలో భారీ వరదలు అరుదుగా వస్తుంటాయి. 2009 తర్వాత కిందటేడాది సుదీర్ఘకాలం పాటు వరదల ప్రవాహం కనిపించింది.ఆగస్ట మధ్య నుంచి అక్టోబర్‌ మధ్య కాలం వరకూ రెండు నెలల పాటు పలుమార్లు వరద కనిపించింది. ఈసారి కూడా మళ్లీ దాదాపుగా వరదల ప్రవాహం అదే స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం , నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ ల్లో దాదాపుగా పూర్తి స్థాయి నీటిమట్టం కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మిగులు జలాలను ప్రకాశం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి వదలాల్సి వస్తోంది.________________________________________________________________


ఆన్ లైన్ తరగతులపై పునరాలోచన అవసరం భారత దేశవ్యాప్తంగా కేవలం 24 శాతం ప్రజల ఇండ్లల్లో మాత్రమే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నదని, ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభిస్తే పిల్లలందరికీ చేరే అవకాశం చాలా తక్కువని యునిసెఫ్‌ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ 24 శాతంలో కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కనెక్షన్లు ఉన్నాయని, గ్రావిూణ ప్రాంతాల్లో లేవని పేర్కొన్నది.కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం వృథా కాకుండా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని ప్రభుత్వాలు భావిస్తున్న తరుణంలో ఈ నివేదిక వెల్లడి కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో బడి పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభిస్తే పేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాల మధ్య అంతరాలు పెరిగి.. పిల్లల మధ్య డిజిటల్‌ డివైడ్‌కు దారి తీయవచ్చని తెలిపింది.సాధ్యమైనన్ని జాగ్రత్తలతో భౌతికంగా బడులు తెరవడమే మేలని కూడా సూచించింది. ఇపðడే తెరవలేని పరిస్థితులుంటే సిలబస్‌ను తగ్గించడం, లేదా తర్వాతి కాలంలో సెలవుల్లోనూ క్లాసులు నిర్వహించడం లాంటివి చేయాల్సి రావచ్చు. మరోవైపు పల్లెలకు ఇంటర్నెట్‌ విస్తరిస్తేనే అభివృద్ది పెరుగుతుందని మంత్రి కెటిఆర్‌ కూడా తెలిపారు.


ఈ దశలో ఆన్‌లైన్‌ క్లాసులు వల్ల ప్రయోజనాలు ఏంటన్నది ఆలోచించాల్సి ఉంది. పాఠశాలలను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ప్రవేశాలతో పాటు దూర విద్యావిధానంలో ఆన్‌లైన్‌ పాఠాలను బోధించనున్నారు.ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ విద్యా సంవత్సరాన్ని దెబ్బతీయడంతో విద్యార్థు లంతా ఇంటికే పరిమితం అయ్యారు. జూన్‌ రెండో వారంలో ప్రారంభం కావలసిన పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు.


కరోనా వల్ల విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యాశాఖ ప్రత్యామ్నాయ
చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఇంటి వద్దనే ఉంచుతూ ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌ చేసేందుకు అవసరమైన వర్క్‌షీట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.2 నుంచి 10 తరగతుల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు వాటిని ఎన్‌సీఈఆర్టీ అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో అన్ని స్జబెక్టులు డౌన్‌లోడ్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్లు రూపొందించారు. ఆన్‌లైన్‌ తరగతుల
నిర్వహణ వల్ల ప్రభుత్వ, పైవేటు విద్యాలయాల్లో చదివే దాదాపు విద్యార్థులకు మేలు జరుగనుందని అంచనా వేస్తున్నారు.


అయితే పైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల తల్లిదండ్రులకు దాదాపు వెూబైల్‌ ఫోన్‌లు, టీవీలు అందుబాటులో ఉండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఇళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేక ఆన్‌లైన్‌ విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం సవాలుగా మారనుంది.ప్రభుత్వ, ఎయిడెడ్‌, పైవేటు పాఠశాలలు ప్రతిరోజు ఆన్‌లైన్‌ తరగతులకు కేటాయించే సమయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విద్యాసంవత్సరంలో విద్యాబోధన ప్రణాళిక దశలవారీగా అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఇంచుమించు
ఉన్నాయి.వీటిని అధిగమించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్దం చేయాలి. అపðడే సమస్యలు అధిగమించి ముందుకు సాగగలం. యూనిసెఫ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందుకు నడవాల్సి ఉంది. కరోనా సంక్షోభం మరెంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన సమయమిది.


________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments