పడకంటి మనసులో మాట 13.09.2020


పడకంటి మనసులో మాట ...


________________________________________________________________


జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
యువతపైనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని వారిలో స జనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, స జనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్‌ ఉంటుందని చెప్పారు.


________________________________________________________________


మాతృభాషలో బోధనపై వెూడీ మంచి మాటమాత భాషలో విద్యా బోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదనీ, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర వెూదీ పేర్కొన్నారు. బాలలు సులువుగా నేర్చుకోగలిగే భాష ఏదైతే అదే బోధనా మాధ్యమంగా ఉండాలని చెప్పారు.


ఈ కారణంవల్లే పాఠశాలల్లో విద్యాబోధన.. విద్యార్థుల మాత భాషలోనే జరగాలని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. కనీసం 5వ తరగతి వరకు స్థానిక భాషలోనే బోధించాలన్నారు.
శుక్రవారం కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్వహించిన శిక్షా పర్వ్‌లో ప్రధాని మాట్లాడారు.ఇంగ్లిషు సహా ఏ ఇతర అంతర్జాతీయ భాషను బోధించడంపైనా జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో ఎటువంటి నిషేధం లేదని వెూదీ స్పష్టం చేశారు. భారతీయ భాషలను మాత్రం కచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 2022 నాటికి నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌) సిద్ధమవుతుందన్నారు.


భాష అనేది విజ్ఞానాన్ని వ్యక్తపరచడానికి ఓ మార్గమని, భాషే యావత్తు విజ్ఞానం కాదని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారన్నారు. విద్యార్థులపై ఈ ఒత్తిడిని దూరం చేయడమే నూతన విద్యా విధానం లక్ష్యమన్నారు.కాగా, జై జగత్‌ నినాదం ఇచ్చిన ఆచార్య వినోబా భావే నుంచి, విశ్వమానవ సౌభ్రాత త్వంపై సందేశమిచ్చిన స్వామి వివేకానంద నుంచి మానవాళి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని వెూదీ అన్నారు. ఈ ఇద్దరు మహనీయుల జయంతి నేపథ్యంలో వారికి ట్విటర్‌లో వెూదీ నివాళులర్పించారు.


దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తామని ప్రధాని వెూదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజ్‌ షీట్లు అని వ్యాఖ్యానించారు.జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ '21వ శతాబ్దంలో పాఠశాల విద్య' అనే అంశంపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.యువతపైనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని వారిలో స జనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, స జనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్‌ ఉంటుందని చెప్పారు.ఎన్‌ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని వెూదీ వెల్లడించారు. అయిదో తరగతి వరకు మాత భాషలో విద్యా బోధన అత్యంత అవసరమని వెూదీ చెప్పారు.
దేశాన్ని 21వ శతాబ్దిలోకి తీసుకుని పోవడానికి ఒక నూతన మార్గాన్ని నూతన విద్యావిధానం కల్పిస్తోందని, ఇది నూతన శకానికి బీజాలు నాటుతోందని ప్రధాని చెప్పారు.


అయితే ఈ విద్యావిధానం లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని, దేశవ్యాప్తంగా సమర్థవంతమైన రీతిలో సమాన స్థాయిలో దీన్ని అమలు చేయాల్సి ఉందని, ఆ దిశలో అందరం కలిసి పనిచేయాలని వెూదీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంపై జాతీయవ్యాప్తంగా చర్చల ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోందన్నారు.


________________________________________________________________


నిరంతర నిఘాతోనే కొత్త చట్టానికి సార్థకతకొత్త రెవెన్యూ చట్టం పటిష్టంగా అమలు కావాలంటే నిరంతర నిఘా ఉండాలి ఎందుకంటే గతంలో భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం పెద్ద ఎత్తున భూ వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ వివాదాలను పరిష్కరించడం కోసం ప్రత్యేక ట్రి బ్యూనల్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ సైతం వినిపించింది.


ముఖ్యంగా ప్రక్షాళన తర్వాత భూ యాజమాన్య హక్కుల విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. దశాబ్దాల క్రితం భూములు విక్రయించిన పట్టేదార్ల పేర్లు తిరిగి సర్వేలో బయటకు రావడం, వారి పేర్లనే పట్టేదార్లుగా నవెూదు చేయడం వంటి వివాదాల తలెత్తాయి.అలాగే ఒకరి సర్వే నెంబర్లుగా ఉన్న భూమిని మరొకరి సర్వే నెంబరుకు మార్చడం అందులో కొంత, ఇందులో కొంత చూపించడం వంటి చిత్రాలు చోటు చేసుకున్నాయి. మొదటితరం భూ సంస్కరణల్లో వాస్తవ సాగుదారుకు, పన్నులు వసూలు చేసే ప్రభుత్వానికి మధ్య ఉన్న వివిధ రూపాలలోని భూ యజమానులను తొలగించే పని చేపట్టారు.


ఇపðడు భూ సంస్కరణల్లో ప్రభుత్వం భూ యజమానులకు, ప్రభుత్వానికి,కొనుగోలుదారులకు మధ్య ఉన్న సాగుదార్లను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. భూ లావాదేవీల సరళీకరణ, కంప్యూటరీకరణ అన్నది పారదర్శకంగా సాగేలా సమాంతరంగా మరో వ్యవస్థ పనిచేయాలి.భూమి యజమానికి టైటిల్‌ డీడ్‌, వారు సాగు చేస్తున్న విస్తీర్ణానికి పాసుపుస్తకం ఇచ్చేవారు. ఇపðడు ఆ రెండిటినీ కలిపివేసి కేవలం 'టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాసుపుస్తకంగా మార్పు చేశారు. ఇక నుంచి భూమికి ఒకరే హక్కుదారు అంటే ఎవరిది భూమి అయితే వారిదే.


మారిన కాలంలో ఈ రక్షణ రావడం అన్నది విప్లవాత్మక మార్పుగా చూడాలి. నిజానికి సాగుదారు అన్నది కేవలం పనిచేసుకుని పంటపండించుకుని ఉపాధి పొందాలి. కానీ తానే హక్కుదారు అన్న పేచీ పెట్టడంతోనే భూముల పంచాయితీ వస్తోంది. అలా అనేకానేక సందర్భాల్లో వేల కేసులు పుట్టుకు వచ్చాయి.పట్టణాల్లో స్థిరపడ్డ వారు లేదా..పల్లెల్లో తరతరాలుగా భూములు ఉన్న వారు ఎవరో ఒకరికి కౌలుకు ఇచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో విఆర్‌వోలను, ఎమ్మార్వోలను పట్టుకుని భూములను ఖాస్తుదారు ఖాతాలో వేయేంచేసుకున్నారు.
తెలంగాణ భూమి హక్కులు, పాసుపుస్తకాల బిల్లు -2020ను ముఖ్యమంత్రి బాగా ఆలోచన చేసిరూపొందించినట్లు కనిపిస్తోంది.


అయితే ఇదే సందర్బంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ తొలి అడుగు మాత్రమే అన్నారు. ఇప్పటికే అమలులో
ఉన్న చట్టంతో పోలిస్తే ముఖ్యమైన మార్పులు చోసుకున్నాయి. రిజిస్టే షన్‌, పట్టా జారీ అధికారాలను తహశీల్దారు చేతిలో పెట్టడం, రెవెన్యూ కోర్టుల స్థానంలో టైబ్యునళ్లను పెట్టడం, భూమి రికార్డులను ఎలక్టా నిక రూపంలో నవెూదు చేయడానికి, భద్రపరచడానికి, మార్పులు చేయడానికి, జారీ చేయడానికి చట్టబద్ధత కల్పించ,డం; టైటిల్‌ డీడ్‌ పట్టా పాసుపుస్తకం జారీ పక్రియ సమయాన్ని తగ్గించడం వంటివి మార్పులకు శ్రీకారంగా చూడాలి.అయితే ఈ పక్రియలో పేదల కష్టాలన్నీ తీరిపోతాయని, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి మటుమాయం అయిపోతుందనే భావన ఉండరాదు. చట్టాలు ఎన్ని చేసినా వాటిని వమ్ముచేసేందుకు కొందరు మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారికి అవకశాం లేకుండా చేయగలగాలి.


భూ లావాదేవీలు, రికార్డులు, కంప్యూటరీకరణ ద్వారా భూమి సమస్యలు పరిష్కారం కావాలి. అందుకు పక్కాగా ప్రణాళిక చేయాలి. పేదల భూములు, రికార్డులలో సమస్యాత్మక లోపాలున్న భూములకు సంబంధించి జరిగిన కుంభకోణాలు బద్దలు కావాలి.నిజానికి తెలంగాణలో పెద్దఎత్తున భూమాఫియా తయారయింది. వారిపై కన్నేసి సామాన్యులకు అండగా సర్కార్‌ నిలవగలగాలి. ఎందుకంటే సామాన్యులు రోజువారీగా తమ భూమి ఉందో లేదో కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో తనిఖీ చేసుకోరు. కేవలం భూమి సాగు చేసుకుంటూ ఉంటారు.


కాని వాళ్ల భూమికి కంప్యూటర్లలోనే రెక్కలు వచ్చి ఎగిరిపోతే సర్కార్‌ సంకల్పం నెరవేరదు. తమ భూమి తమది కాదన్న విషయం వాళ్లకు తెలిసేసరికి వేరేవారి పేరు విూద పట్టాలు లేకపోగా వివాదాలతో మళ్లీ కోర్టు గడపలు తొక్కాల్సి వస్తుంది. ఇంక వాటిని అధిగమించి తమ భూమిని కాపాడుకోవడం వాళ్లకు ఒక జీవన్మరణ పోరాటమే అవుతుంది.


________________________________________________________________


సీఐడీ అత్యుత్సాహంతో జగన్‌ సర్కార్‌కు అప్రతిష్టఏపీలో జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు అదే పనిగా ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. అంతెందుకు ఆ మధ్య లిక్కర్‌ విధానంపై ప్రశ్నించిన యువకుడి మరణానికి ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తే..


ఆధారాలున్నాయా అంటూ పోలీసులు చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. తాజాగా అంతర్వేది రథం దగ్ధం ఘటన చంద్రబాబు పనేనని విజయసాయి రెడ్డి అదే పనిగా ఆరోపిస్తున్నారు. మరి ఆధారాలు ఇవ్వాలని విజయసాయికి పోలీసులు నోటీసులు ఇచ్చారా అంటే సమాధానం చెప్పేది ఎవరు
ఇక పోలీసుల వ్యవహారం ఎలా ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనుకుందాం.ఇక సీఐడీ విషయానికి వస్తే సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని కాలేజీ కుర్రాళ్ళ నుండి ముసలమ్మపై కూడా కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. మరికొందరిని అయితే అసలు ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియక వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేసుకోగా ఏకంగా డీజీపీనే కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.


అయితే, సీఐడీ పోలీసులు పెట్టిన కేసులేవీ న్యాయస్థానాలలో నిలబడలేదు.
కేసులు కోర్టులలో చెల్లడం లేదని సీఐడీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వరసపెట్టి కేసులు బుక చేస్తూనే ఉంది. అలానే ప్రముఖ తెలుగు వెబ్‌ న్యూస్‌ చానెల్‌ ఎండీ కే రవిశంకర్‌ పై మంగళగిరి సీఐడీ ఠాణాలో కేసు నవెూదు చేసి ఆఫీసుకు సంబంధించిన సామాన్లను కూడా స్వాధీనం చేసుకుంది.పి.జగదీష్‌ అనే వ్యక్తి సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేయగా సీఐడీ పోలీసులు వెనక ముందు లేకుండా కేసు పెట్టి సామాన్లను ఎత్తుకుపోయారు.
దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు సీఐడీని తీవ్రంగా తప్పు పట్టింది.


ఈ కేసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం వెబ్‌ న్యూస్‌ చానెల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని వెనక్కి ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. అంతేకాదు సీఐడీ పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని సంత ప్తి పరచడానికి చేసినట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పక్షపాతంతో ప్రజలను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఆగ్రహం కొత్తేమీ కాదు. గత ఏడాదిలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయినా అవేమీ సీఐడీ పట్టించుకోవడం లేదు.


ఎందుకంటే ముందుగా కేసులు పెట్టడం భయాందోళనకు గురిచేయడంతో స్వామి కార్యం జరిగిపోతుంది. తీరా కోర్టుల దగ్గర నిలబడకపోయినా అప్పటికే సదరు వ్యక్తులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే, అసలు చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెడుతున్న సీఐడీపై చర్యలు ఉండవా అన్నదే ఇప్పుడు తలెత్తే ప్రశ్న. తప్పుడు కేసులని సాక్షాత్తు హైకోర్టే వెల్లడించగా మరి చర్యలు ఎక్కడ?


________________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments